Heat Wave Warning: ఏప్రిల్ రెండో వారమే దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం జనాలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్న సమయాల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇప్పటికే భారత వాతావరణ శాఖ(IMD) వచ్చే పది రోజుల్లో దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతుందని ఇప్పటికే హెచ్చరించింది. ఇదిలా ఉంటే వచ్చే ఐదు రోజుల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 3-5 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతాయని ఐఎండీ తెలిపింది.
Kolkata Metro Runs Under River, First In India: కోల్కతా మెట్రో రికార్డ్ క్రియేట్ చేసింది. దేశంలో తొలిసారిగా నదీ గర్భం నుంచి మెట్రో రైల్ పరుగులు తీసింది. హుగ్లీ నది నుంచి ఏర్పాటు చేసిన సొరంగం గుండా మెట్రో రైల్ పరుగులు పెట్టింది. ఈ విషయాన్ని బుధవారం సీనియర్ అధికారి వెల్లడించారు. అధికారులు, ఇంజనీర్లతో కూడిన మెట్రో రైల్ హుగ్లీ నది కింద నుంచి కోల్కతా నుండి నదికి అవతలి వైపున హౌరా వరకు నడిచింది.
11-yr-old Chinese boy cycled 130 kms for almost 24 hrs: సాధారణం అమ్మ కొడితేనో, నాన్న తిడితేనో ఇళ్లు వదిలిపెట్టి వెళ్లడం చూస్తుంటాం. కొందరు కావాలని కొద్ది సేపటి వరకు తల్లిదండ్రులకు కనిపించకుండా దాక్కుంటారు. ఇలాంటి ఘటనలను మనం నిత్య జీవితంలో చూస్తునే ఉంటాం. ఇదిలా ఉంటే చైనాకు చెందిన ఓ 11 ఏళ్ల బాలుడు మాత్రం తన తల్లిపై కంప్లైంట్ చేయడాని ఏకంగా 130 కిలోమీటర్ల దూరంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. ప్రస్తుతం ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది.…
Karnataka Elections: కర్ణాటక రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ పావులు కదుపుతోంది. కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టేవిధంగా ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే 224 సీట్లు ఉన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిన్న 189 మంది అభ్యర్థులతో తొలివిడత జాబితాను విడుదల చేసింది. దీంతో 52 మంది కొత్తవారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఆయా నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణలు, బలమైన అభ్యర్థులను చూసి పోటీలో నిలిపినట్లు తెలుస్తోంది.
Wealth of CMs: భారత రాజకీయాలు డబ్బుతో ముడిపడి ఉంటాయనేది కాదనకూడని నిజం. సాధారణంగా గ్రామస్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎంపీటీసీ, జెడ్పీటీసీలే ఒక్కసారి అధికారం వస్తే కోట్లకు పడగతెత్తుతున్నారు. అలాంటిది సీఎం అయితే కోట్ల ఆస్తులు ఉండటం చాలా సహజం. అయితే భారతదేశంలో మొత్తం 30 మంది సీఎంలలో 29 మంది కోటీశ్వరులే అని అంటే 97 శాతం మంది కోటీశ్వరులే అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) వెల్లడించింది.
Karnataka Elections: కర్ణాటకలో బీజేపీ టికెట్ల వివాదం రచ్చరచ్చ అవుతోంది. మంగళవారం రోజు 189 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. అయితే వీటిలో 52 మంది పాతవారిని కాదని కొత్త వారికి చోటు కల్పించింది. అయితే కొందరు ఎమ్మెల్యేలు మాత్రం బీజేపీ అధిష్టానం తీరును తప్పుబడుతున్నారు. ఇప్పటికే మాజీ ఉపముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ కి టికెట్ నిరాకరించింది. ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించడం హాట్ టాపిక్ గా మారింది.
Covid 19: భారతదేశంలో కోవిడ్ మహమ్మారి కోరలు చాస్తోంది. గత ఐదారు నెలలుగా స్తబ్ధుగా ఉన్న కేసుల సంఖ్య ప్రస్తుతం మళ్లీ పెరుగుతన్నాయి. కొన్నాళ్ల వరకు కేవలం కేసులు 1000 లోపే పరిమితం అయ్యేవి, కానీ కొన్ని రోజుల నుంచి కేసుల సంఖ్య పెరుగుతూ.. 5000 మించి నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం కోవిడ్ ఎండమిక్ స్టేజ్ లో ఉందని, మరో 10-12 రోజుల వరకు కేసులు పెరుగుతూనే ఉంటాయని, ఆ తర్వాత తగ్గుముఖం పడతాయని ప్రభుత్వ వర్గాలు ఈ రోజు తెలిపాయి.
Twitter: ట్విట్టర్ నుంచి 80 శాతం మంది ఉద్యోగులను తొలగించినట్లు ధ్రువీకరించారు కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్. మొత్తం 8000 మంది ఉద్యోగుల్లో ప్రస్తుతం 1500 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. అక్టోబర్ 2022లో 44 బిలియన్ డాలర్ల భారీ డీల్ తో ట్విట్టర్ ను సొంతం చేసుకున్నారు మస్క్. అప్పటి నుంచే ట్విట్టర్ లో ప్రక్షాళన చేపట్టారు. వచ్చీ రావడంతోనే కంపెనీ కీలక ఉద్యోగులు అయిన పరాగ్ అగర్వాల్, లీగల్ హెడ్ అయిన విజయా గద్దెలను తొలగించారు. ట్విట్టర్ బోర్డును రద్దు చేసి…
India Economy: ఆర్థికమాంద్యం భయాలు, రష్యా ఉక్రెయిన్ పరిణామాలు, కోవిడ్ మహమ్మారి కలిసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇన్నాళ్లు యూరోపియన్ దేశాల ఆర్థిక వ్యవస్థలు చాలా బలంగా ఉన్నాయని అనుకుంటున్నప్పటికీ, గాలి బుడగలా మారాయి. ఎప్పుడు బ్లాస్ట్ అవుతాయో తెలియని పరిస్థితి. ఇప్పటికే శ్రీలంక దివాళా తీసింది.
Pro-Khalistan Elements Misusing Asylum Policy, India Tells UK: ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ కోసం ఇంకా వేట కొనసాగిస్తున్నారు పంజాబ్ పోలీసులు. ఈ విషయం తెలిసిన విదేశాల్లోని ఖలిస్తానీవాడులు భారత రాయబార కార్యాలయాలే టార్గెట్ గా దాడులకు తెగబడ్డాయి. ముఖ్యంగా యూకే, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియాల్లో ఖలిస్తానీవాదులు భారత సార్వభౌమాధికారాన్ని సవాల్ చేస్తూ.. ఇండియన్ ఎంబసీ, కాన్సులేట్స్ పై దాడులు చేయడాన్ని భారత్ తీవ్రంగా ఆక్షేపిస్తోంది.