Venu Goapl Reddy
Author- NTV Telugu-
LTTE Prabhakaran: తమిళటైగర్ ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నాడు.. తమిళ నేత సంచలన వ్యాఖ్యలు..
LTTE Prabhakaran: లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టిటిఇ) చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నాడని మరుమలర్చి ద్రవిడ మున్నేట్ర కజగం(MDMK) ప్రధాన కార్యదర్శి వైకో ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక ప్రభుత్వం ప్రభాకరన్ మరణించడాని ప్రకటించిన 14 ఏళ్ల తరువాత ఆయన ఈ ప్రకటన చేయడం సంచలనంగా మారింది. ప్రభాకరన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. -
Uttarakhand Tunnel: రెస్క్యూ కోసం ఇండియన్ ఆర్మీకి పిలుపు.. వర్టికల్ డ్రిల్లింగ్ ప్రారంభం..
Uttarakhand Tunnel: ఉత్తరాఖండ్ సిల్క్యారా సొరంగం కూలిపోవడంతో గత 15 రోజులగా 41 మంది కార్మికులు అందులోనే చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు దేశంలోని నిపుణులతో సహా అంతర్జాతీయ టన్నెల్ నిపుణులు రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. ఇటీవల అమెరికా నుంచి తీసుకువచ్చిన ఆగర్ మిషన్ సాయంతో రెస్క్యూ పనులు త్వరలోనే ముగుస్తాయని, కార్మికులంతా బయటపడతారని అంతా భావించారు. 57 మీటర్ల దూరంలో ఉన్న వారిని రక్షించేందుకు 47 మీటర్ల వరకు స్టీల్ పైపుల్ని అమర్చారు. అయితే మిషన్ విరిగి పోవడంతో ఈ ప్రయత్నాలను విరమించారు. -
Asaduddin Owaisi: రాహుల్ గాంధీ మీరు పెళ్లి చేసుకోండి.. ఓవైసీ సెటైర్లు..
Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి కాంగ్రెస్ రాహుల్ గాంధీపై ఫైర్ అయ్యారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓవైసీ, ప్రధాని నరేంద్రమోడీకి స్నేహితుడని వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఓవైసీ స్పందించారు. రాహుల్ గాంధీ జీవితంలో రెండు ప్రేమలు ఉన్నాయని, ఒకటి ఇటలీ అయితే మరొకరు ప్రధాని నరేంద్రమోడీ అని అన్నారు. -
Ship Sink: సముద్రంలో కార్గో షిప్ మునక.. నలుగురు భారతీయులతో సహా 14 మంది గల్లంతు..
Ship Sink: 14 మంది వ్యక్తులతో వెళ్తున్న కార్గో షిప్ గ్రీస్ సమీపంలో సముద్రంలో మునిగిపోయింది. లెస్బోస్ ద్వీపం సమీపంలో ఆదివారం ఈ ఘటన జరిగినట్లు గ్రీక్ కోస్ట్ గార్డ్స్ తెలిపారు. బలమైన ఈదురుగాలుల కారణంగానే షిప్ మునిగిపోయిందని చెప్పారు. ప్రస్తుతం 14 మంది సముద్రంలో గల్లంతయ్యారు. వీరి కోసం ఐదు కార్గో షిప్‌లు, మూడు తీర రక్షక నౌకలు, వైమానిక దళం మరియు నేవీ హెలికాప్టర్లతో పాటు నేవీ ఫ్రిగేట్ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. -
Myanmar: చైనా సరిహద్దుని స్వాధీనం చేసుకున్న సాయుధ మయన్మార్ గ్రూప్..
Myanmar: భారత సరిహద్దు దేశం మయన్మార్‌లో ప్రజాప్రభుత్వాన్ని కూల్చి సైన్యం అధికారాన్ని చేపట్టింది. అప్పటి నుంచి ఆ దేశంలో హింస చెలరేగింది. జుంటా పాలకకు వ్యతిరేకంగా అక్కడ సాయుధ గ్రూపులు పోరాటాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా అక్కడి సైనిక పాలకులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నాళ్లు సైనికులు కంట్రోల్లో ఉన్న చైనా సరిహద్దు సమీపంలోని ప్రాంతాలను మూడు సాయుధ మైనారిటీ గ్రూపులు స్వాధీనం చేసుకున్నాయి. ఉత్తర షాన్ రాష్ట్రంలోని ఉన్న ఈ చైనా సరిహద్దు చాలా కీలకం. ప్రస్తుతం ఆ రాష్ట్రం… -
China: చైనాలో ప్రబలుతున్న “మిస్టరీ వ్యాధి”.. కారణాలు ఇవే అంటున్న ఆ దేశ అధికారులు..
China: చైనాలో మిస్టరీ వ్యాధి విస్తరిస్తోంది. ముఖ్యంగా ఆ దేశంలోని పిల్లలు శ్వాసకోశ జబ్బుల బారిన పడుతున్నారు. అయితే అనేక వ్యాధికారకాలు దేశంలో తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నాయని చైనా ఆరోగ్య కమిషన్ తెలిపింది. ఈ వ్యాధులకు నోవల్ వైరస్ కారణంగా ఉండవచ్చని పేర్కొంది. -
26/11 Mumbai attacks: ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు, అణిచివేస్తాం.. ముంబై దాడులపై ప్రధాని మోడీ..
26/11 ముంబై దాడులు భారత దేశం ఎప్పటికీ మరిచిపోలేని ఉగ్రదాడి. పాకిస్తాన్ ఉగ్రవాదులు సముద్రం మార్గాన ముంబై మహానగరంలోకి వచ్చి మారణహోమాన్ని సృష్టించారు. ఈ ఘటనకు నేటితో 15 ఏళ్లు నిండాయి. అయితే ఆ నెత్తుటి గుర్తులు ఇప్పటికీ దేశ ప్రజలను బాధిస్తున్నాయి. నరేంద్రమోడీ ఈ రోజు తన 107వ ఎడిషన్ మన్ కీ బాత్‌లో ముంబై ఉగ్రదాడిని ‘ అత్యంత భయంకరమైన ఉగ్రదాడి’ గా పేర్కొన్నారు. ‘‘ ఈ రోజు నవంబర్ 26, ఈ రోజును ఎప్పటికీ మరిచిపోలేము. ఈరోజునే దేశంలో భయంకరమైన… -
PM Modi: “విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడం అవసరమా.?” మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ..
PM Modi: కొన్ని పెద్ద కుటుంబాలు డెస్టినేషన్ వెడ్డింగ్ పేరులో విదేశాల్లో వివాహాలు చేసుకోవడం ఇటీవల కాలంలో చూస్తున్నాం. అయితే దీనిపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. ఈ రోజు జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కొన్ని కుటుంబాలు విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్న తీరు తనను కలవరపరుస్తోందని, దేశానికి చెందిన ధనం వేరే దేశానికి చేరకుండా భారత గడ్డపై ఇలాంటి వేడుకలను నిర్వహించుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం కోరారు. పెళ్లిళ్ల కోసం షాపింగ్ చేసేటప్పుడు, ప్రజలు భారతీయ ఉత్పత్తులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని… -
China Pneumonia: చైనాలో కొత్త వ్యాధి.. రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు
China Pneumonia: చైనాలో న్యూమోనియా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నాయి. దీనిపై ప్రపంచ దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చైనాలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా భారత్ ఈ విషయాన్ని పరిశీలిస్తోంది. ఇటీవల ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో భారత్‌లో వ్యాధి తీవ్రత ఉండదని చెప్పింది. పొరుగు దేశంలో పరిస్థితుల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక సూచనలు చేస్తూ లేఖ రాశారు. -
Man Kills Wife: ఫ్రైడ్ చికెన్ కోసం భార్యను చంపేసిన భర్త..
Man Kills Wife: ఫ్రైడ్ చికెన్ కారణంగా ఓ వ్యక్తి తన భార్యను హతమార్చాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఫ్రైడ్ చికెన్ కొనడానికి నగదు ఇవ్వలేదని ఆరోపిస్తూ ఓ టైలర్ తన భార్యను కత్తెరతో గొంతుకోసి హత్య చేశాడు. ఘజియాబాద్ లోని ప్రేమ్ నగర్ కాలనీలో శనివారం ఈ హత్య జరిగింది. షాహిద్ హుస్సేనే అతని భార్య నూర్ బానో(46)ని హత్య చేశాడని ఏసీపీ సిద్ధార్థ గౌతమ్ తెలిపారు. దంపతుల పిల్లల ముందే ఈ హత్య జరిగింది. భార్యను హత్య…
తాజావార్తలు
-
Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్
-
Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
-
IND vs WI 1st ODI: నేడు భారత్, వెస్టిండీస్ మొదటి వన్డే.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, పిచ్ డీటెయిల్స్ ఇవే!
-
BYD Seal U PHEV SUV: భారత్‌లోకి BYD తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV.. 26.6 kWh బ్యాటరీ, 1,000KM కు పైగా రేంజ్
-
Hyderabad: “కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు”.. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?