India Economy: ఆర్థికమాంద్యం భయాలు, రష్యా ఉక్రెయిన్ పరిణామాలు, కోవిడ్ మహమ్మారి కలిసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇన్నాళ్లు యూరోపియన్ దేశాల ఆర్థిక వ్యవస్థలు చాలా బలంగా ఉన్నాయని అనుకుంటున్నప్పటికీ, గాలి బుడగలా మారాయి. ఎప్పుడు బ్లాస్ట్ అవుతాయో తెలియని పరిస్థితి. ఇప్పటికే శ్రీలంక దివాళా తీసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లు కూడా ఆర్థికంగా సతమతం అవుతున్నాయి. ఇక యూరోపియన్ దేశాలు అయిన జర్మనీ, ఫ్రాన్స్, యూకే ఇలా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కూడా తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయి. అమెరికా పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి.
Read Also: India: శరణార్థి పాలసీని దుర్వినియోగం చేస్తున్న ఖలిస్తానీవాదులు.. యూకేకు తేల్చి చెప్పిన ఇండియా..
ఈసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కేవలం భారత్, చైనాలు మాత్రమే ఆదుకుంటాయని ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(IMF) వెల్లడించింది. తాజాగా IMF విడుదల చేసిన ఆర్థిక వృద్ధి అంచనాల్లో భారత వృద్ధిని 6.1 శాతం నుంచి 5.9 శాతానికి తగ్గించింది. అయితే అయినా కూడా ప్రస్తుతం 2024 ఆర్థిక సంవత్సరం(2023-24)లో భారత్ అన్ని దేశాల కంటే టాప్ పొజిషన్ లో ఉంది. ఆ తరువాత స్థానంలో చైనా ఉంది. ఈ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు మాత్రమే ఇలాంటి కఠిన పరిస్థితుల్లో కూడా బలంగా నిలబడి ఉన్నాయని ఐఎంఎఫ్ ప్రకటించింది.
ఫైనాన్షియల్ ఇయర్ 2024(2023-24)లో ఇండియా రిటైల్ ద్రవ్యోల్భణం 4.9 శాతం, 2025లో 4.4 శాతంగా ఉంటుందని, ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) మంగళవారం 2023-24 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జిడిపి వృద్ధి అంచనాను 20 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.9 శాతానికి తగ్గించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసిన 6.4 శాతం కంటే తాజా అంచనా తక్కువగా ఉంది. కానీ, భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది. ఐఎంఎఫ్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది జనవరిలో 6.8 శాతం నుంచి 6.3 శాతానికి తగ్గించింది. ఇదిలా ఉంటే 2023-24 ఏడాదిలో చైనా వృద్ధి రేటును 5.2 శాతంగా అంచనా వేసింది. 2024-25లో 4.5 శాతంగా ఉంటుందని అంచానా వేసింది. ఇక ప్రపంచ ఆర్థిక వ్యవ్థ వృద్ధిరేటు 2.8 శాతం నుంచి 3 శాతానికి పెంచింది.
IMF Growth Forecast: 2023
USA🇺🇸: 1.6%
Germany🇩🇪: -0.1%
France🇫🇷: 0.7%
Italy🇮🇹: 0.7%
Spain🇪🇸: 1.5%
Japan🇯🇵: 1.3%
UK🇬🇧: -0.3%
Canada🇨🇦: 1.5%
China🇨🇳: 5.2%
India🇮🇳: 5.9%
Russia🇷🇺: 0.7%
Brazil🇧🇷: 0.9%
Mexico🇲🇽: 1.8%
KSA🇸🇦: 3.1%
Nigeria🇳🇬: 3.2%
RSA🇿🇦: 0.1%https://t.co/lvRdo3zKMV pic.twitter.com/mZOsBfCYS5— IMF (@IMFNews) April 11, 2023