Covid 19: భారతదేశంలో కోవిడ్ మహమ్మారి కోరలు చాస్తోంది. గత ఐదారు నెలలుగా స్తబ్ధుగా ఉన్న కేసుల సంఖ్య ప్రస్తుతం మళ్లీ పెరుగుతన్నాయి. కొన్నాళ్ల వరకు కేవలం కేసులు 1000 లోపే పరిమితం అయ్యేవి, కానీ కొన్ని రోజుల నుంచి కేసుల సంఖ్య పెరుగుతూ.. 5000 మించి నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం కోవిడ్ ఎండమిక్ స్టేజ్ లో ఉందని, మరో 10-12 రోజుల వరకు కేసులు పెరుగుతూనే ఉంటాయని, ఆ తర్వాత తగ్గుముఖం పడతాయని ప్రభుత్వ వర్గాలు ఈ రోజు తెలిపాయి.
Read Also: Twitter: ట్విట్టర్‌లో 80 శాతం మంది ఉద్యోగులు ఔట్.. కన్ఫామ్ చేసిన ఎలాన్ మస్క్..
దేశంలో కరోనా పెరుగుదలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇప్పుడు ఇన్ఫెక్షన్లు స్థానిక దశలోనే ఉన్నాయని ఆరోగ్యమంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఎండమిక్ స్టేజ్ లో కేసులు కేవలం కొన్ని ఏరియాలకు మాత్రమే పరిమితం అయి ఉంటాయి, అదే పాండిమిక్ స్టేజ్ లో మాత్రం ఇది వ్యాప్తి దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది. భారత దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 7,830 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అయితే ఇన్ఫెక్షన్లు పెరిగినప్పటికీ ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం దేశంలో కరోనా వేరియంట్ ఓమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన XBB.1.16 వల్ల కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇది ప్రమాదకరం కాదు, దీని వల్ల రోగులు ఆస్పత్రుల్లో చేరడం ఎక్కువగా ఉండదు. అయితే దీర్ఘకాలిక రోగాలు, శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం ఉన్న టీకాలు ఈ వేరియంట్ కు వ్యతిరేకంగా ప్రభావవంతం ఉన్నాయి. ప్రస్తుతం XBB.1.16 తీవ్రత ఫిబ్రవరిలో 21.6 శాతం నుంచి మార్చిలో 35.8 శాతానికి పెరిగింది. అయితే ఆస్పత్రుల్లో చేరడం, మరణించడం వంటి సంఘటనలు పెద్దగా లేవు.