TMC: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ లూయిజిన్హో ఫలేరో తన రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆయన టీఎంసీ పార్టీకి కూడా రాజీనామా చేశారు. టీఎంసీ తన జాతీయ పార్టీ హోదాను కోల్పోయినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించిన మరుసటి రోజే ఈ పరిణామం సంభవించింది.
IPL Tickets Issue: తమిళనాడులో ఇప్పుడు ఐపీఎల్ టికెట్లు, చెన్నై సూపర్ కింగ్స్ కేంద్రంగా రాజకీయాలు సాగుతున్నాయి. ఇప్పటికే సీఎస్కే టీం ను బ్యాన్ చేయాలని పలువురు రాజకీయ నాయకులు, పార్టీలు కోరతున్నాయి. పీఎంకే శాసనసభ్యుడు ఏకంగా తమిళనాడు అసెంబ్లీలోనే సీఎస్కేని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Arunachal Pradesh: భారతదేశంలో అంతర్భాగం అయిన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంపై చైనా తన గుప్పిట్లోకి తీసుకోవాలని అనుకుంటోంది. అయితే ఎప్పటికప్పుడు భారత్ అరుణాచల్ విషయంలో చైనా వైఖరిపై దృఢంగా వ్యవహరిస్తోంది. ఇటీవల డ్రాగన్ కంట్రీ అరుణాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు పేర్లను మార్చింది. దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ పేర్లు మార్చినంత మాత్రాన అరుణాల్ మీదైపోదంటూ ఘాటుగానే బదులిచ్చింది.
CSK doesn't have any players from TN, should be banned: తమిళనాడులో భాషాభిమానం, ప్రాంతీయాభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ భాషకు ఎలాంటి అగౌరవం వాటిల్లినా అక్కడి ప్రజలు, ప్రభుత్వాలు భగ్గుమంటాయి. ముఖ్యంగా హిందీ మాట్లాడితే ఏదో పాపం చేసినట్లు చూస్తుంటారు కొందరు.
‘Naatu Naatu’ becomes ‘Modi Modi’ in BJP election song: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉంది. ఇప్పటికే ప్రచారంలో బీజేపీ దూసుకుపోతోంది. మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే మరోసారి రాష్ట్ర బీజేపీ ప్రధాని నరేంద్రమోదీ ఛరిష్మానే నమ్ముకుంది. ఆయన కేంద్రంగానే ప్రచారం జరగుతోంది. ఇటీవల కాలంలో ప్రధాని పలుమార్లు కర్ణాటకను సందర్శించారు. వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు పలు ప్రాజెక్టులను ప్రారంభించారు.
Karnataka Elections: బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప ఎన్నికల బరి నుంచి వైదొలిగారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదని ప్రకటించారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు ఈశ్వరప్ప. అభ్యర్థుల ఎంపికలో తన పేరును పరిశీలించ వద్దని ఆయన విజ్ఞప్తి చేశారు
Amit Shah: 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ 300కు పైగా లోక్ సభ స్థానాలను కైవసం చేసుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అస్సాం దిబ్రూఘర్ లో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో 14 లోక్ సభ స్థానాలకు గానూ 12 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని అన్నారు.
Vladimir Putin: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతన్ ఆరోగ్యంపై వదంతులు వస్తూనే ఉన్నాయి. పుతిన్ ఆరోగ్యం చాలా క్షీణించందని, ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, క్యాన్సర్ తో ఇబ్బందిపడుతున్నారని పలు వార్తలు వచ్చాయి. తాజాగా వచ్చిన ఓ నివేదిక పుతిన్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని తెలిపింది. అతడి ఆరోగ్యంపై వైద్యులు భయాందోళనలో ఉన్నట్లు తెలిపింది.
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. వాషింగ్టన్ పోస్ట్ ద్వారా లీక్ అయిన యూఎస్ ఇంటెలిజెన్స్ పత్రాల్లో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మిడిల్ ఈస్ట్ లో అమెరికాకు మిత్రదేశంగా ఉన్న ఈజిప్టు, రష్యాకు సాయం చేసేందుకు సిద్ధం అయినట్లు పత్రాల ద్వారా వెల్లడైంది. ఈజిప్టు రహస్యంగా దాదాపుగా 40,000 రాకెట్లను ఉత్పత్తి చేసి రష్యాకు సరఫరా చేయాలని ప్లాన్ వేసింది.
Uddhav Thackeray: మహారాష్ట్ర మంత్రి చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో చిచ్చుపెట్టాయి. బాబ్రీ మసీదు కూల్చివేతలో ఒక్క శివసేన కార్యకర్త కూడా లేరని ఆయన వ్యాఖ్యానించిన మరుసటి రోజు శివసేన(యూబీటీ)నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఫైర్ అయ్యారు.