Twitter: ట్విట్టర్ నుంచి 80 శాతం మంది ఉద్యోగులను తొలగించినట్లు ధ్రువీకరించారు కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్. మొత్తం 8000 మంది ఉద్యోగుల్లో ప్రస్తుతం 1500 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. అక్టోబర్ 2022లో 44 బిలియన్ డాలర్ల భారీ డీల్ తో ట్విట్టర్ ను సొంతం చేసుకున్నారు మస్క్. అప్పటి నుంచే ట్విట్టర్ లో ప్రక్షాళన చేపట్టారు. వచ్చీ రావడంతోనే కంపెనీ కీలక ఉద్యోగులు అయిన పరాగ్ అగర్వాల్, లీగల్ హెడ్ అయిన విజయా గద్దెలను తొలగించారు. ట్విట్టర్ బోర్డును రద్దు చేసి తానే సీఈఓగా ప్రకటించుకున్నారు మస్క్.
Read Also: India Economy: భారత వృద్ధి అంచనాను తగ్గించిన ఐఎంఎఫ్.. అయినా ప్రపంచం ఆశంతా భారత్‌పైనే..
బుధవారం ట్విట్టర్ స్పేసెల్ లో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ తొలగింపులపై ధ్రువీకరించారు. ఉద్యోగుల తొలగింపుల ప్రక్రియ సరదా కానది, బాధకరమైనదని ఆయన అన్నారు. ప్రతీ వ్యక్తితో ముఖాముఖిగా మాట్లాడటం తనకు సాధ్యం కాదని, అయితే సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ట్విట్టర్ లోని అన్ని విషయాలు సహేతుకంగానే జరుగుతున్నాయని మస్క్ పేర్కొన్నారు. అయితే గతంలో ట్విట్టర్ కు తాను చెల్లించిన 44 బిలియన్ డాలర్ల చెల్లించానని అయితే దాని విలువ సుమారు 20 బిలియన్ డాలర్లు ఉంటుదని ఇటీవల అన్నారు.
ట్విట్టర్ ను సొంతం చేసుకున్న తర్వాత చాలా మార్పలు తీసుకువచ్చారు ఎలాన్ మస్క్. వెరిఫైడ్ ఖాతాలకు ఛార్జీలను వసూలు చేస్తున్నారు. వైరిఫైడ్ ఖాతాల కోసం డబ్బులు చెల్లించకుంటే ఏప్రిల్ 20న బ్లూ టిక్ కోల్పోతారని ఇప్పటికే మస్క్ ధ్రువీకరించారు. ఏప్రిల్ 1 తర్వాతనే బ్లూ టిక్ తొలగిస్తామని చెప్పినప్పటికీ అలా జరగలేదు. భారత్ దేశంలో వెబ్ యూజర్ల కోసం నెలవారీ చందా రూ. 600 కాగా, మొబైల్ యూజర్లకు రూ. 900 చెల్లించాల్సి ఉంటుంది.