Javed Miandad: పాకిస్తాన్ లో జరగబోయే ఆసియా కప్ క్రికెట్ టోర్నీకి భారత జట్టు వెళ్లకూడదని నిర్ణయించుకుంది. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కారాలుమిరియాలు నూరుతోంది. పాక్ మాజీ ఆటగాళ్లు భారత్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. క్రికెట్ ప్రపంచంలో బీసీసీఐ నియంతలా ప్రవర్తిస్తోందని పాక్ మాజీ ఆటగాడు, ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు.
Snakes Inside Door Frame: మహరాష్ట్రలోని గోండియాలో ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే సంఘటన జరిగింది. ఓ ఇంటిలోని డోర్ ఫ్రేమ్ నుంచి 39 చిన్న పాములు బయటకు తీయడంతో అంతా షాక్ అయ్యారు. అయితే ఇంట్లో వాళ్లు డోర్ ఫ్రేములో చెదులు ఉందని అప్పటిదాకా భావించారు. అయితే పాములను చూసి ఒక్కసారిగా భయపడ్డారు. ఈ పాములను పట్టుకునేవారు దాదాపుగా 4 గంటలు కష్టపడి పాములన్నింటిని పట్టుకున్నారు. సమీపంలోని అడవుల్లో వదిలారు.
H3N8 Bird Flu: మానవుల్లో అత్యంత అరుదుగా కనిపించే బర్డ్ ఫ్లూతో చైనాలో ఒకరు మరణించారు. ప్రపంచంలోనే ఇలా మరణించడం ఇదే మొదటిసారి. అయితే ప్రజల నుంచి ప్రజలకు ఈ వ్యాధి వ్యాప్తి చెందడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. దక్షిణ ప్రావిన్స్ ఆఫ్ గ్వాంగ్‌డాంగ్‌కు చెందిన 56 ఏళ్ల మహిళ ఏవియన్ ఇన్ఫ్లుఎంజా H3N8 సబ్టైప్ బారిన పడిన మూడవ వ్యక్తి అని డబ్ల్యూహెచ్ఓ మంగళవారం తెలిపింది.
Nitish Kumar Meets Rahul Gandhi: జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. విపక్షాల ఐక్యత కోసం ప్రయత్నిస్తున్న బీహార్ సీఎం నితీష్ కుమార్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. సమావేశంలో ఆర్జేడీ నేత, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కూడా పాల్గొన్నారు. బుధవారం ఢిల్లీలో ఈ భేటీ జరిగింది. సమావేశం జరిగే సమయంలో జేడీయూ అధ్యక్షుడు లాలన్ సింగ్ కూడా ఉన్నారు. ఢిల్లీలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌తో నితీశ్ కుమార్…
Flesh-Eating Bacteria: అమెరికా తీర ప్రాంత ప్రజలను ఇప్పుడో కొత్తరకం బ్యాక్టీరియా కలవరపెడుతోంది. అత్యంత ప్రాణాంతకం అయిన బ్యాక్టీరియా ‘‘ విబ్రియో వల్నిఫికస్’’ కారణంగా అంటువ్యాధులు పెరుగుతున్నాయి. దీన్ని సాధారణంగా ‘‘మాంసాన్ని తినే బ్యాక్టీరియా’’గా పిలుస్తుంటారు. యూఎస్ తీరం చుట్టూ వేడెక్కుతున్న జలాలు ఈ బ్యాక్టీరియా పెరుగుదలకు కారణం అవుతున్నాయి. క్రమంగా తీరం వెంబడి కదులుతున్నాయి.
Karnataka Elections: కర్ణాటక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. తాజాగా ఈ రోజు బీజేపీ తన తొలివిడత అభ్యర్థులు జాబితాను ప్రకటించింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో తొలివిడతగా బీజేపీ 189 మంది అభ్యర్థులను ప్రకటించింది. తొలివిడతలో భారీగా ఎమ్మెల్యేలను తొలగించింది. ఏకంగా 52 మంది కొత్తవారికి అవకాశం ఇచ్చింది. రెండో జాబితా త్వరలోనే వస్తుందని సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు. గత వారం చివర్లో బీజేపీ అగ్రనాయకులు జేపీ నడ్డా ఇంటిలో భేటీ అయి అభ్యర్థుల జాబితాను ఫైనలైజ్ చేశారు
Man Who Killed A Rat By Drowning Could Be Jailed For 5 Years: ఉత్తర్ ప్రదేశ్ బుదౌన్ లో ఓ ‘‘ఎలుక హత్య’’ కేసు చర్చనీయాంశంగా మారింది. ఎలుకకు రాయి కట్టి నీటిలో పడేసిన వ్యక్తిపై యూపీ పోటీసులు 30 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు. వీటిని బుదౌన్ కోర్టులో మంగళవారం సమర్పించారు. ఎలుకకు సంబంధించి ఫోరెన్సిక్ వివారాలు, వివిధ సోర్సెస్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఛార్జిషీట్ సిద్ధం చేసినట్లు సీఐ అలోక్ మిశ్రా వెల్లడించారు. ఎలుకకు సంబంధించి…
Bombay High Court: వివాహ సంబంధ వివాదాల్లో పిల్లలను చరాస్థులుగా పరిగణిస్తున్నారని బాంబే హైకోర్టు మంగళవారం ఓ కేసులో వ్యాఖ్యానించింది. ఒక మహిళలను తన 15 ఏళ్ల కుమారుడితో థాయ్ లాండ్ నుంచి ఇండియాకు తిరిగిరావాలని ఆదేశించింది. పిల్లవాడు తన తండ్రి, తోబుట్టువులను కలుసుకోవచ్చని తీర్పు చెప్పింది. వైవాహిక వివాదాలు దేశంలో అత్యంత తీవ్రమైన కేసులని జస్టిస్ ఆర్డీ ధనుక, గౌరీ గాడ్సేలతో కూడిన బెంచ్ పేర్కొంది. పిల్లలపై తల్లిదండ్రుల హక్కుల కన్నా వారి సంక్షేమమే ముఖ్యమని పేర్కొంది.
Suicides rise significantly during the week of full Moon: భారతీయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడిని మనస్సుకు కారకుడిగా చెబుతుంటారు. చంద్రుడు మన ఆలోచల్ని ప్రభావితం చేస్తారని చెబుతుంటారు. ఇదిలా పక్కన పెడితే తాజాగా ఓ అధ్యయనంలో మాత్రం పౌర్ణమి సమయంలోనే అధికంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయని తేలింది. డిస్కవర్ మెంటల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనం ప్రకారం 55 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ఆత్మహత్యల ద్వారా మరణించే అవకాశం ఎక్కువగా ఉందని తేలింది. పౌర్ణమి రోజు ఆత్మహత్యలు…
Shiveluch Volcano Erupts: రష్యాలో షివేటుచ్ అగ్నిపర్వతం బద్ధలైంది. ప్రపంచంలో అత్యంత చురకైన అగ్నిపర్వాతాల్లో షివేటుచ్ ఒకటిగా ఉంది. ఇది మంగళవారం పేలినట్లు రష్యా అధికారులు వెల్లడించారు. తూర్పు కమ్చట్కా ద్వీపకల్పంలోని ఈ అగ్నిపర్వతం భారీ ఎత్తున బూడిదను వెడజల్లుతోంది. పేలుడు తర్వాత బూడిద ఆకాశంలో చాలా ఎత్తు వరకు వ్యాపించింది. అర్థరాత్రి తర్వాత విస్పోటనం చెంది సుమారు 6 గంటల వరకు యాక్టివ్ గా ఉందని రష్యా తెలిపింది.