భారత్-న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగింది. సోమవారం ప్రధాని మోడీ-న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. అనంతరం సంయుక్తంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం విజయవంతంగా ముగిసిందని ప్రకటించారు. 9 నెలల చర్చల తర్వాత ఈ ఒప్పందం తుది రూపం దాల్చిందని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ భారత్‌లో పర్యటించారు. ఆ సందర్భంగా చర్చలు జరిగాయి. సోమవారం చర్చల తర్వాత తుది రూపం దాల్చినట్లుగా నేతలిద్దరూ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడడం కోసం ఇది ఎంతగానో దోహదపడుతుందని ఇరువురి నాయకులు చెప్పారు.
ఇది కూడా చదవండి: Vince Zampella: కారు ప్రమాదం.. ‘కాల్ ఆఫ్ డ్యూటీ’ గేమ్ సృష్టికర్త జాంపెల్లా మృతి
అయితే ఈ ఒప్పందాన్ని న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్‌స్టన్ పీటర్ తప్పుపట్టారు. ఈ ఒప్పందం న్యూజిలాండ్‌కు చెడు ఒప్పందంగా పేర్కొన్నారు. ప్రభుత్వం తక్కువ నాణ్యత గల ఒప్పందాన్ని కుదుర్చుకుందని ఆరోపించారు. ఈ ఒప్పందంలో స్వేచ్ఛా లేదు న్యాయంగా లేదంటూ ఎద్దేవా చేశారు. ఈ ఒప్పందానికి సంబంధించిన బిల్లు పార్లమెంట్‌కు వచ్చినప్పుడు వ్యతిరేకిస్తామని.. ఓటుతో తిప్పికొడతామని పేర్కొన్నారు. ఒప్పందాన్ని తొందరపడి చేసుకోవద్దని సంకీర్ణ భాగస్వామిని పదే పదే కోరామని.. పార్లమెంటరీ అనుమతి లేకుండా ఒప్పందంపై సంతకం చేయొద్దని హెచ్చరించినట్లు పీటర్స్ వెల్లడించారు. అయినా కూడా విస్మరించారని చెప్పారు.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు షాక్.. భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు
New Zealand First is regrettably opposed to the India Free Trade Agreement announced today.
We consider the India-New Zealand Free Trade Agreement to be neither free nor fair.Regrettably, this is a bad deal for New Zealand. It gives too much away, especially on immigration,…
— Winston Peters (@winstonpeters) December 22, 2025