Odisha: హనుమాన్ జయంతి బైక్ ర్యాలీపై దాడి.. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత.. 144 సెక్షన్ విధింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha: ఒడిశాలో హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన బైకు ర్యాలీలో ఉద్రిక్తత చెలరేగింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఏప్రిల్ 12న సంబల్‌పూర్ జిల్లాలో ఇరు వర్గాల మధ్య హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో సంబల్‌పూర్ జిల్లాలో గురువారం ఉదయం 10 గంటల నుంచి 48 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. జిల్లాలో 144 సెక్షన్ విధించారు. ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం గురువారం నిషేధాజ్ఞలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ఒడిశాలోని సంబల్‌పూర్‌లో ఏప్రిల్ 15 వరకు వచ్చే 48 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడతాయని పేర్కొన్నారు.
Read Also: Tarun Chugh : మహేశ్వర్ రెడ్డి చేరిక తో బీజేపీ మరింత బలోపేతం
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
హనుమాన్ జయంతి సామాన్య సమితి సభ్యులు, భజరంగ్ దళ్ కార్యకర్తలు ఏప్రిల్ 12 సాయంత్ర 6 గంటల సమయంలో చేపట్టిన బైక్ ర్యాలీ సమయంలో పట్టణంలోని హిందూ, ముస్లిం వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయని రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజాభద్రతకు భంగం కలిగించడానికి దుండగులు సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తున్నారని, వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ మరియు ఇతర మీడియా వంటి మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లు మతపరమైన భావాలను రెచ్చగొట్టే అవకాశం ఉందని, దీంతోనే ఇంటర్నెట్ సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
సంబల్ పూర్ ఎస్పీ బీ గంగాధర్ ఈ ప్రాంతంలో గురువారం రోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తామని, పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని, శాంతిభద్రతల కోసం సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. సున్నిత ప్రాంతాల్లో బలగాలను మోహరించినట్లు వెల్లడించారు. కాగా, ఈ ఘర్షణలకు కారణం అయిన వారిలో ఇప్పటి వరకు 40 మందిని అదుపులోకి తీసుకున్నామని, ముగ్గురు పోలీసులు గాయపడినట్లు ఎస్పీ వెల్లడించారు.
తాజావార్తలు
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!