Tata Cars Price Hike: దేశీయ ఆటోమొబైల్స్ దిగ్గజం టాటా మోటార్స్ బాంబ్ పేల్చింది. టాటా కారు కొందాం అని అనుకునే వారు త్వరపడండి. ఎందుకంటే మే 1 నుంచి కార్ల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇన్ పుట్ ఖర్చులు పెరగడంతో పాక్షికం ధరలను పెంచుతున్నట్లు, మే 1 నుంచి తమ ప్యాసింజర్ ధరలు పెరుగుతాయని తెలిపింది
Cyber Attack: భారత దేశానికి సంబంధించిన 12 వేల వెబ్సైట్లను ఇండోనేషియా హ్యకర్లు టార్గెట్ చేసినట్లు కేంద్రం ముందుగానే గుర్తించింది. దీంతో కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను హెచ్చరించింది. వీటిలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు చెందిన పలు వెబ్సైట్లు కూడా ఉన్నాయి.
Push-Ups World Record: సాధారణంగా జిమ్‌కు వెళ్లే వ్యక్తి లేదా రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసే వ్యక్తి రోజుకు 100 అంతకన్నా కొద్దిగా ఎక్కువ పుష్-అప్స్ చేస్తాడు. అంతకుమించి చేయడం అంటే దాదాపుగా కష్టమే అనిచెప్పాలి. కానీ ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి ఏకంగా 3000 కన్నా ఎక్కువ పుష్-అప్స్ చేశాడు.
Nexon EV Max: టాటా నెక్సాన్ భారతదేశంలోనే అత్యంత సురక్షితమైన, అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్యూవీ కారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని ఎస్యూవీ కార్ల కన్నా అత్యధిక సేల్స్ లో తొలిస్థానంలో ఉంది. మరోవైపు నెక్సాన్ ఈవీ కూడా అమ్మకాల్లో దుమ్మురేపుతోంది.
Dog Attack: దేశంలో కుక్కల దాడులు కామన్ అయిపోయాయి. రోజుకు ఎక్కడో చోట దీనికి సంబంధించిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హర్యానాలోని కర్నాల్ ప్రాంతంలో పిట్ బుల్ జాతికి చెందిన కుక్క ఓ వ్యక్తిపై దాడి చేసింది. అతడి ప్రైవేట్ భాగాన్ని కొరికింది. దీంతో తీవ్ర గాయాలపాలైన బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కర్నాల్ లోని బిజ్నా గ్రామంలో తన పొలంలో పనిచేసుకుంటున్న కరణ్ అనే 30 ఏళ్ల వ్యక్తిపై పిట్ బుల్ కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది
Covid-19: ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నిన్న 10,000లను దాటిని కేసుల సంఖ్య, ఈ రోజు 11,000లను దాటింది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు 9 శాతం అధికంగా కేసులు నమోదు అయ్యాయి. యాక్టివ్ ఇన్ఫెక్షన్ల సంఖ్య ప్రస్తుతం 49,622కి చేరింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించిన డేటా ప్రకారం..
Covid-Like Pandemic: 2019లో చైనా వూహాన్ నగరంలో నెమ్మదిగా మొదలైన కరోనా మహమ్మారి ప్రపంచంలోని అన్ని దేశాలను పట్టిపీడిస్తోంది. కోవిడ్ వ్యాధి ప్రారంభమై మూడేళ్లు పూర్తయినా ఇప్పటికే ఈ మహమ్మారి తన రూపాలను మార్చుకుంటూ ప్రజలపై దాడి చేస్తూనే ఉంది. ప్రపంచంలో అనేక దేశాల్లో లక్షల సంఖ్యలో మరణాలకు కారణం అయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసింది. మహమ్మారి దెబ్బతో ఇప్పటికీ ప్రపంచం కోలుకోలేకపోతోంది. ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్ ఇలా తన రూపాలను మార్చుకుంటూ కరోనా మహమ్మారి ఇబ్బందులు పెడుతోంది.
JPMorgan: ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ జేపీ మోర్గాన్ చేజ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక పై తమ ఉద్యోగులు విధిగా ఆఫీసులకు రావాలని సూచించింది. వర్క్ ఫ్రంతో చాలని తెలిపింది. దీనికి సంబంధించి ఓ మోమోను విడుదల చేసింది. సీనియర్ ఉద్యోగులు, మేనేజింగ్ డైరెక్టర్లను వారానికి ఐదు రోజుల ఆఫీస్ నుంచి పనిచేయాలని హెచ్చరించింది.
Joe Biden - Rishi Sunak: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి వార్తల్లో నిలిచారు. గుడ్ ఫ్రైడే శాంతి ఒప్పందం 25వ వార్షికోత్సవం సందర్భంగా జో బైడెన్ మంగళవారం యూకేలోని ఉత్తర ఐర్లాండ్ పర్యటనకు వెళ్లారు. అయితే ఈ సమయంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఆయనకు స్వాగతం పలికేందుకు బెల్ఫాస్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న సమయంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు అగ్రదేశాల నేతల పర్యటనలో ఒకరినొకరు పట్టించుకోని సంఘటనలు ఎప్పుడైనా చూశామా.?
Atiq Ahmed: గ్యాంగ్ స్టర్, రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ పోలీసుకు ఇచ్చిన వాంగ్మూలంలో తనకు పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఇంటర్ సర్విసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ), ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడించాడు. ఉమేష్ పాల్ హత్య కేసులో అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌లను ప్రయాగ్‌రాజ్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం నాలుగు రోజుల పోలీసు కస్టడీకి పంపింది.