CM KCR: సీఎం కేసీఆర్ ఆస్తులు ఎంతో తెలుసా..? టాప్‌లో జగన్ మోహన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా మొదటిస్థానంలో నిలిచారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల అఫిడవిట్ లో వెల్లడించిన దాని ప్రకారం సీఎం ఆస్తుల్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అండ్ నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో జగన్మోహన్ రెడ్డి ఆస్తులు రూ.510 కోట్లు ఉన్నట్లు వెల్లడైంది. దేశంలో అతి తక్కువ ఆస్తులు రూ. 15 లక్షలు కలిగిన సీఎంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిలిచారు.
Read Also: GT vs PBKS: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న గుజరాత్ టైటాన్స్
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
ఇదిలా ఉంటే తెలంగాణ సీఎం కేసీఆర్ ఆస్తులు రూ.8 కోట్లు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. మొత్తం ఆస్తుల్లో జగన్ తర్వాతి స్థానంలో రూ.163 కోట్లతో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ రెండోస్థానంలో, రూ. 63 కోట్లతో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మూడో స్థానంలో ఉన్నారు. ఈ నివేదికలో మమతా తప్పితే అందరు ముఖ్యమంత్రుల ఆస్తులు ఒక కోటికి పైగానే ఉన్నాయి. కోటి విలువైన ఆస్తులతో హర్యానాకు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, కేరళకు సీఎం పినరయి విజయన్‌లు మమతా బెనర్జీతో కలిసి చివరి మూడు స్థానాలను పంచుకున్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆస్తులు రూ. 4 కోట్లు కాగా, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే ఆస్తులు రూ. 3 కోట్లుగా నివేదిక వెల్లడించింది. మొత్తం 30 మంది ముఖ్యమంత్రుల్లో ముగ్గురిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. సీఎంలలో 11 మంది గ్రాడ్యుయేట్లు కాగా, 9 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్టు, నలుగురు ప్రొఫెషనల్ డిగ్రీలు, ఒకరు డాక్టర్ డిగ్రీని కలిగి ఉన్నారు. ఒక సీఎం కేవలం 10 పాస్ కాగా, మిగిలిన ముగ్గురు కేవలం 12 వ తరగతి ఉత్తీర్ణులు ఉన్నారు.
తాజావార్తలు
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!