Atiq Ahmed: కొడుకు ఎన్‌కౌంటర్‌తో ప్రాణం విలువ తెలిసినట్లుంది.. కోర్టులోనే గుక్కపెట్టి ఏడ్చిన అతీక్ అహ్మద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atiq Ahmed: 100కు పైగా నేరాాలు, అనేక హత్యలు, బెదిరింపులు ఇలా ఓ సమయంలో ఉత్తర్ ప్రదేశ్ నేర సామ్రాజ్యాన్ని, రాజకీయాలను శాసించిన గ్యాంగ్ స్టర్ కం పొలిటీషియన్ అతీక్ అహ్మద్ కు ప్రాణ భయాన్ని చూపిస్తున్నారు సీఎం యోగీ ఆదిత్యనాథ్. చివరకు జైలు నుంచి భయటకు వస్తే ఎక్కడ ఎన్‌కౌంటర్‌లో హతమవుతానో అని భయపడుతున్నాడు. యూపీకి వెళ్లాలంటేనే భయపడి చస్తున్నాడు. తాజాగా ఈ రోజు అతని కొడుకు అసద్ అహ్మద్ ఎన్ కౌంటర్ లో హతం అయ్యాడు.
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 2005 బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ ను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ హత్యలో కీలక నిందితులుగా అతీక్ అహ్మద్ కొడుకు అసద్ అహ్మద్, షూటర్ గులాం ఉన్నారు. వీరిద్దరు గత కొంతకాలం నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. అయితే వీరు ఉత్తర ప్రదేశ్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో గురువారం మధ్యాహ్నం ఝాన్సీ సమీపంలో యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్ (ఎస్టీఎఫ్) టీం జరిపిన కాల్పుల్లో ఇద్దరు నిందితులు హతం అయ్యారు.
Also Read
- FSSAI Action on Nestle: నెస్లే ఇండియాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ బిగ్ షాక్.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై లీగల్ నోటీసులు
- Fake IAS Officer: నకిలీ ఐఏఎస్ తృప్తి సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసులపైనే లంచం ఆరోపణలు
- EPFO కీలక నిర్ణయం.. 51 లక్షల మందికి పైగా ఉద్యోగులకు ప్రయోజనం
- PM Vishwakarma Yojana: సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలా? గ్యారెంటీ లేకుండానే రూ.3 లక్షల లోన్.. పథకం పూర్తి వివరాలు ఇవే..
Read Also: Yogi Adityanath: అతిక్ అహ్మద్ కొడుకు ఎన్‌కౌంటర్.. ఎస్టీఎఫ్ టీంపై సీఎం ప్రశంసలు.. అత్యవసర సమావేశం..
గురువారం హతుడు అసద్ తండ్రి గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ ను ప్రయాగ్ రాజ్ కోర్టులో చీప్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు. అతీక్ తో పాటు అతని సోదరుడు అష్రఫ్ ను కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఇదే రోజు అతని కొడుకు ఎన్ కౌంటర్ జరగడం, ఆ వార్త కోర్టులో ఉన్న సమయంలో అతీక్ అహ్మద్ కు తెలియడంతో విపరీతంగా ఏడ్చాడు. కోర్టు హాల్ లోనే కుప్పకూలిపోయాడు. తన అన్న కుమారుడు ఎన్ కౌంటర్ లో మరణించాడని తెలిసి అష్రఫ్ షాక్ కు గురయ్యాడు.
ఈ ఎన్‌కౌంటర్‌కు డిప్యూటీ ఎస్పీ నావేందు, డిప్యూటీ ఎస్పీ విమల్ నాయకత్వం వహించారు. అసద్, గులాం ఇద్దరి తలలపై రూ. 5 లక్షల నజరానా ఉంది. ఒకటిన్నర నెలలుగా అసద్, గులామ్ లను ట్రాక్ చేస్తున్నట్లుగా యూపీ ఎస్టీఎఫ్ ఏడీజీ అమితాబ్ యాష్ తెలిపారు. బైకుపై పారిపోతున్న క్రమంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. కేవలం 5 నిమిషాల్లోనే ఇద్దరు నిందితులు నేలకొరిగారు. చనిపోయిన నిందితుల వద్ద పలు అత్యాధునిక విదేశీ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
iPhone 18 Pro అడిగిన భార్య.. బంగారం అమ్మి మరీ కొనిచ్చిన భర్త..
-
Gautam Gambhir: హార్దిక్ వస్తే నితీశ్ రెడ్డి పరిస్థితి ఏంటి?.. గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు!
-
Mirzapur The Movie: 14వ రోజూ దుమ్మురేపిన ‘మీర్జాపూర్: ది మూవీ’.. రూ.300 కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
FSSAI Action on Nestle: నెస్లే ఇండియాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ బిగ్ షాక్.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై లీగల్ నోటీసులు
ట్రెండింగ్
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!