Yogi Adityanath: గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ కొడుకు ఎన్‌కౌంటర్‌లో హతమైన తర్వాత యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాత వ్యాఖ్య మళ్లీ ట్రెండ్ అవుతోంది. యూపీ అసెంబ్లీ వేదికగా ఆయన చేసిన హెచ్చరికలు మరోసారి నిజం అయ్యాయి. తాజాగా ఈ రోజు (గురువారం) మధ్యాహ్నం కరడుగట్టిన నేరస్తుడు, గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కొడుకు అసద్ అహ్మద్, మరో నిందితుడు గులాంలను ఝాన్సీ సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్ లో చంపేశారు. యూపీ ఎస్టీఎఫ్ టీం, నిందితులకు మధ్య దాదాపుగా 40 రౌండ్లకు పైగా కాల్పులు జరిగాయి.
2005 బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ ను అత్యంత దారుణంగా కాల్చిచంపారు. ఈ ఘటన ఈ ఏడాది ఫిబ్రవరిలో చోటు చేసుకుంది. ఈ కేసులో అసద్ తో పాటు గులాం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యారు. గత రెండు నెలల నుంచి తప్పించుకుతిరుగుతున్నారు. ఈ రోజు జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు హతం అయ్యారు.
Read Also: Akhilesh Yadav: అసద్ అహ్మద్‌ది బూటకపు ఎన్‌కౌంటర్.. బీజేపీకి కోర్టులపై నమ్మకం లేదు..
Every word is turning out to be true…
Yogi ji Roxxx ❤️❤️ pic.twitter.com/55wE4QiWn2— INFERNO (@SmokingLiberals) April 13, 2023
ఇదిలా ఉంటే ప్రస్తుతం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. సీఎం తన మాటను నిలబెట్టుకున్నారంటూ పలువురు నెటిజెట్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఉమేష్ పాల్ హత్య అనంతరం సీఎం యోగీ అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నాయకుడు, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వైపు వేటు చూపిస్తూ… ‘‘నేను మాఫియాను నేలమట్టం చేస్తా, మట్టిలో కలిపేస్తా’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అతీక్ అహ్మద్ ను పెంచి పోషించిందే సమాజ్ వాదీ పార్టీ అని, దాని వెన్ను విరిచే పనిలో మేము ఉన్నామని అన్నారు.
అతిక్ అహ్మద్ ను ఉద్దేశిస్తూ..‘‘స్పీకర్ సార్, అతను అన్ని ప్రొఫెషనల్ క్రిమినల్స్, మాఫియాకు గాడ్ పాథర్, వారి నరాల్లో నేరం ఉంది, నేను ఈ రోజు సభకు చెబుతున్నాను, నేను ఈ మాఫియాను మట్టిలో కలిపేస్తా’’అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్ నేపథ్యంలో మరోసారి యోగి చేసిన మాస్ వార్నింగ్ వీడియో ట్రెండ్ అవుతోంది. ఇదిలా ఉంటే ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. బీజేపీకి కోర్టులపై నమ్మకం లేదని అన్నారు.