Iran: ఇరాన్ దేశం పూర్తిగా మతాచారాలపై ఆధారపడిన రాజ్యం. అక్కడ అందరు విధిగా మత చట్టాను పాటించాల్సిందే. ముఖ్యంగా మహిళ హిజాబ్ అంశంపై అక్కడి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. గతేడాది హిజాబ్ సరిగా ధరించలేదని చెబుతూ.. కుర్దిష్ మహిళ మహ్సా అమినిని ఇరాన్ మొరాలిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె మరణించింది. అమిని మరణం ఇరాన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున హిజాబ్ వ్యతిరేక ఉద్యమానికి నాంది పలికింది.
Benjamin Netanyahu: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో ఇరాన్ మద్దతు ఉన్న లెబనాన్ మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా ఈ యుద్ధంలోకి ప్రవేశిస్తుందనే వార్తలు వస్తున్నాయి. హమాస్‌కి మద్దతుగా ఇప్పటికే ఇజ్రాయిల్ ఉత్తర ప్రాంత సరిహద్దుపై లెబనాన్ నుంచి హిజ్బుల్లా దాడులు చేస్తోంది. దీంతో ఇజ్రాయిల్ టూ ఫ్రంట్ వార్ చేస్తోంది. ఇప్పటికే సరిహద్దుల్లో ఉన్న ప్రజలను ఖాళీ చేసింది.
Earthquake: హిమాలయ దేశం నేపాల్ వరస భూకంపాలతో వణికిపోతోంది. ఆదివారం రెండుసార్లు భూకంపాలు వచ్చాయి. తాజాగా రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(ఎన్సీఎస్) వెల్లడించింది. ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ భూకంపం వచ్చింది. భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది.
Iran: గతేడాది ఇరాన్ దేశాన్ని మహ్స అమిని అనే యువతి మరణం ఓ కుదుపుకుదిపేసింది. మత సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. హిజాబ్ సరిగా ధరించలేదని కుర్దిష్ యువతి అయిన మహ్సా అమినిని మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేసి కొట్టడంతో ఆమె మరణించింది. ఈ మరణం ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్ ఉద్యమానికి కారణమైంది. మహిళలు, యువత పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. అక్కడి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఆందోళనలు…
Azam Khan: ఆజం ఖాన్.. ఒకప్పుడు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాన్ని శాసించారు. ఎస్పీ కీలక నేతగా ఉన్న ఆజం ఖాన్, అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యూపీలో కీలకంగా వ్యవహరించారు. ఎప్పుడైతే యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చారో, అప్పటి నుంచి పాత కేసులు ఒకదాని తర్వాత ఒకటి ఆజం ఖాన్ ని చుట్టుముట్టాయి. ప్రస్తుతం ఆయనకు ప్రాణభయం పట్టుకుంది.
JaiShankar: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలోని సర్రే ప్రాంతంలోని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అయితే ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య తీవ్ర దౌత్య వివాదం చెలరేగింది. పలు సందర్భాల్లో కెనడా, భారత దేశాన్ని కావాలనే కవ్విస్తోంది. ఇటీవల కూడా భారత్ లో కెనడా ప్రజలు భద్రంగా లేరని చెబుతూ వారికి ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. భారత్ లోని 41 మంది కెనడా…
Israel-Hamas War: అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదులు భయానక దాడికి పాల్పడ్డారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఇజ్రాయిల్ లోని ప్రజలను ఊచకోత కోశారు. మొత్తం 1400 మంది వరకు ప్రజలు మరణించారు. ఇజ్రాయిల్ కనీవిని ఎరగని రీతిలో దాడి జరిగింది. దీంతో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇజ్రాయిల్ హమాస్ ఉగ్రవాద సంస్థను నేలమట్టం చేసేందుకు సిద్ధమైంది.
Pentagon Report: భారత-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో డ్రాగన్ కంట్రీ లైన్ ఆఫ్ ఆక్చువల్ కంట్రోల్(ఎల్ఏసీ) వెంబడి 2022లో సైనికి ఉనికిని, మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని పెంచింది. ఈ విషయాలను అమెరికా పెంటగాన్ నివేదిక వెల్లడించింది. ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’ నివేదిక 2023 ప్రకారం.. భూగర్భ నిల్వ సౌకర్యాలు, కొత్త రోడ్లు, డ్యూయల్ పర్పస్ ఎయిర్ పోర్టులు, హెలిప్యాడ్ల నిర్మాణాలు ఎల్ఏసీ వెంబడి పెరిగాయి.
INDIA bloc: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని, ప్రధాని నరేంద్రమోడీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ తో పాటు టీఎంసీ, ఆర్జేడీ, శివసేన(ఉద్ధవ్), జేడీయూ, ఆప్, సమజ్ వాదీ(ఎస్పీ) పార్టీలు ‘ఇండియా’ పేరుతో కూటమిని కట్టాయి. అయితే ఇప్పటికే ఈ కూటమికి సంబంధించి మూడు సమావేశాలు జరిగాయి. సీట్ల సర్దుబాటుపై కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉంటే సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాత్రం కూటమి తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు.
India's aid to Gaza: ఇజ్రాయిల్, హమాస్ యుద్ధం నడుమ గాజాలోని సాధారణ పాలస్తీనా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఏ రాకెట్ ఎటునుంచి వస్తుందో అని, ఎక్కడ ఏ బాంబు పేలుతుందో అని భయపడుతున్నారు. మరోవైపు ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ ని దిగ్భంధించింది. ఉత్తర గాజాలోని ప్రజలను సురక్షితమైన దక్షిణ ప్రాంతాలకు వెళ్లాలని సూచించడంతో, ఆ ప్రాంతంలోని 10 లక్షల మందిలో 7 లక్షల మంది దక్షిణ వైపు వెళ్లారు.