Kangana Ranaut: నటి కంగనా రనౌత్ ఇజ్రాయిల్‌కి మద్దతు తెలిపారు. బుధవారం ఆమె భారత్ లోని ఇజ్రాయిల్ రాయబారి నవోల్ గిలోన్ని కలిశారు. ఇద్దరు పలు విషయాలను చర్చించుకున్నారు. ఈ మీటింగ్ కి సంబంధించిన విషయాలను ఇరువురు తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు. ఉగ్రవాదంపై ఇజ్రాయిల్ విజయం సాధింస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
Iran: ఇరాన్ దేశం పూర్తిగా మతపాలనపై ఆధారపడి ఉంటుంది. ఇస్లామిక్ చట్టాలు ఎక్కువగా పాటిస్తుంటారు. ముఖ్యంగా మహిళల వస్త్రధారణ విషయంలో చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తుంటారు. ఎవరైనా మహిళలు హిజాబ్ నియమాలను ఉల్లంఘిస్తే శిక్షలు దారుణంగా ఉంటాయి. తాజాగా హిజాబ్ చట్టాలను ఉల్లంఘించినందుకు దేశంలోని 12 మంది మహిళా నటులపై నిషేధాన్ని విధించింది అక్కడి ప్రభుత్వం. సినిమాల్లో నటించకుండా వీరందరిపై బ్యాన్ విధించింది.
Patalkot Express: మరో రైలు ప్రమాదానికి గురైంది. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ నుండి మధ్యప్రదేశ్‌లోని శివానికి వెళ్తున్న పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్ (14624)లోని నాలుగు కోచ్‌లలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రా జిల్లా థానా మల్పురాలోని బధాయి రైల్వే స్టేషన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రైలు ఆగ్రా నుంచి ఝాన్సికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
China: 2019 మొదలైన కరోనా వైరస్ ఇప్పటికీ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. ఆల్పా, బీటా, ఓమిక్రాన్ అంటూ ఇలా తన రూపాన్ని మార్చుకుని మనుషులపై దాడి చేస్తోంది. తొలిసారిగా ఈ వైరస్ చైనా నగరమైన వూహాన్ లో బయటపడింది. ఆ తర్వాత నెమ్మదిగి ప్రపంచం అంతటా వ్యాపించింది. ప్రస్తుతం కోవిడ్-19కి వ్యాక్సిన్ కనుగొన్నా కూడా అడపాదడపా ఇది తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది.
మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో కారుక వినోద్ అనే వ్యక్తి రాజ్ భవన్ ప్రధాన గేటు వద్ద పెట్రోల్ బాంబులను విసిరాడు. 2022లో చెన్నైలోని బీజేపీ కార్యాలయం వద్ద బాంబులు విసిరిన కేసులో కూడా వినోద్ అరెస్టయ్యాడు. ఈకేసులో మూడు రోజుల క్రితమే విడుదయ్యాడు.
Skin Cancer: వైద్యశాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా, ఇప్పటికీ కొన్ని వ్యాధులకు పూర్తిగా చికిత్స కలిగిలేము. ఇందులో క్యాన్సర్ కూడా ఉంది. అయితే అమెరికాకు చెందిన ఓ 14 ఏళ్ల బాలుడు మాత్రం అద్భుతం చేశాడనే చెప్పాలి. హేమన్ బెకెలే చర్మ క్యాన్సర్ తో పోరాడేందుకు ఓ సబ్బును కనుగొన్నాడు. 2023 3ఎం యంగ్ సైంటిస్ట్స్ ఛాలెంజ్ లో 9 మంది వ్యక్తులతో పోటీ పడిన అతను అమెరికా టాప్ యంగ్ సైంటిస్ట్ గా విజయం సాధించాడు. 25,000 డాలర్ల ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు.
Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మధ్య జరిగిన సమావేశం గురించి ఎక్స్(ట్విట్టర్)లో పంచుకున్నారు. తామిద్దరం పుల్వామా దాడి, జమ్మూ కాశ్మీర్లో పరిస్థితుల గురించి చర్చించినట్లు వెల్లడించారు. అదానీ వ్యవహారం గురించి చర్చించినట్లు వెల్లడించారు. ఇద్దరి మధ్య ఈ భేటీ ఈడీ, సీబీఐల ప్రయేయాన్ని పెంచుతుందా..? అంటూ కేంద్రంపై వ్యంగాస్త్రాలు సంధించారు.
Tayyip Erdogan: వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటే టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. అక్టోబర్ 7న పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ లోకి చొరబడి అక్కడి ప్రజల్ని ఊచకోత కోశారు. ఈ దాడిలో 1400 మంది అమయాకు ప్రజలు, పిల్లలు, మహిళలు చనిపోయారు. ఈ దాడి ప్రస్తుతం ఇజ్రాయిల్, హమాస్ మధ్య తీవ్ర యుద్ధానికి కారణంమైమది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను పెంచుతోంది.
Rajasthan: రాజస్థాన్ లో దారుణం జరిగింది. భూమి విషయంలో తగాదా ఒకరి దారుణ హత్యకి కారణమైంది. ఒక వ్యక్తి తన సోదరుడిపై నుంచి ట్రాక్టర్ పోనిచ్చి హత్య చేశాడు. ఒకసారి కాదు 8 సార్లు అతనిని ట్రాక్టర్ తో తొక్కించాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ ఘటన రాజస్థాన్ లోని భరత్పూర్ లో చోటు చేసుకుంది.
Israel: అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై పాలస్తీనా హమాన్ మిలిటెంట్ సంస్థ క్రూరమైన దాడికి పాల్పడింది. ఈ దాడిలో 1400 మంది ఇజ్రాయిల్ పౌరులు మరణించారు. అయితే అప్పటి నుంచి గాజా స్ట్రిప్ పై ఇజ్రాయిల్ వైమానిక బలగాలు నిప్పుల వర్షాన్ని కురపిస్తున్నాయి. హమాస్ ఉగ్రవాదులు ఉన్నారని అనుమానం వచ్చినా కూడా ఆ భవనాలను నామరూపాలు లేకుండా చేస్తోంది. ఇజ్రాయిల్ జరిగిన దాడుల్లో ఇప్పటి వరకు గాజాలో 5000 మంది చనిపోయారు. వీరిలో సాధారణ పౌరులు, పిల్లలు కూడా ఉన్నారు.