NCERT: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొద్ది రోజులుగా దేశ పేరును ఇండియా స్థానంలో భారత్ అని మారుస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారం ఎలా ఉన్నా.. ప్రస్తతం NCERT కొత్త పుస్తకాలల్లో ఇండియాకు బదులుగా భారత్ అని మర్చారు. కొత్తగా వచ్చే పుస్తకాలన్నింటిలో ఇండియా స్థానంలో భారత్ అని ఉంటుంది.
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా వైదొలగడంతో అక్కడి ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేసి ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అయితే రష్యా, చైనా, ఖతార్ లాంటి కొన్ని దేశాలు మినహా అక్కడి ప్రభుత్వానిన ప్రపంచం గుర్తించలేదు. మహిళల హక్కులు, విద్యపై తాలిబాన్ల ఆంక్షలు ఎక్కువ కావడంతో ఆ దేశానికి విదేశాల నుంచి వచ్చే సాయం కూడా తగ్గింది.
Pakistan Economic Crisis: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశం పాకిస్తాన్, కనీసం తన ప్రభుత్వ ఎయిర్ లైనర్ సంస్థ అయిన పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్క(పీఐఏ) కష్టాలు తీర్చే పరిస్థితిలో కూడా లేదు. పీఐఏకి ఇంధనాన్ని సరఫరా చేస్తున్న పాకిస్తాన్ స్టేట్ ఆయిల్(పీఎస్ఓ) ఇకపై ఇంధనాన్ని సరఫరా చేసేది లేదని స్పష్టం చేసింది.
Hamoon Cyclone: తూర్పు తీరానికి తుఫాన్ ప్రమాదం పొంచింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఓ ప్రకటనలో తెలిపింది.
Swiss Woman Murder: ఢిల్లీలో ఇటీవల స్విట్జర్లాండ్ మహిళ దారుణ హత్యకు గురైంది. తిలక్ నగర్లో 30 ఏళ్ల నినా బెర్గర్ మృతదేహం శుక్రవారం లభ్యమైంది. గురుప్రత్ సింగ్ అనే వ్యక్తి సదరు మహిళతో రిలేషన కలిగి ఉన్నట్లు పోలీసులు వచ్చారు. స్విట్జర్లాండ్ లో ఉంటున్న మహిళను ప్లాన్ ప్రకారం ఇండియాకు వచ్చే విధంగా చేసి హత్య చేశాడు.
Honour Killing: కర్ణాటకలో మరో పరువు హత్య వెలుగులోకి వచ్చింది. దళిత యువకుడితో పారిపోయిందని ఓ తండ్రి కన్న కూతురిని కిరాతకంగా చంపాడు. ఈ ఘటన నాగనాథపురలోని డాక్టర్స్ లే అవుట్లో అక్టోబర్ 21న జరిగింది. కూతురిని చంపిన తర్వాత నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. నిందితుడిని మైసూరులోని హెచ్డీ కోటేలోని కలిహుండి గణేశ(50)గా గుర్తించారు. కూతురిని చంపే క్రమంలో అడ్డుగా వచ్చినందుకు భార్య శారదతో పాటు భార్య సోదరి గీత, అతని భర్త శాంతకుమార్ ను కూడా గాయపరిచాడు.
Hijab: గతేడాది కర్ణాటక వ్యాప్తంగా హిజాబ్ అంశం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. విద్యాలయాల్లోకి హిజాబ్ లేదా ఇతర మతపరమైన దుస్తులు ధరించి రావడాన్ని కర్ణాటక ప్రభుత్వం బ్యాన్ చేసింది. కర్ణాటక హైకోర్టు కూడా ఇదే అంశాన్ని పేర్కొంది. బీజేపీ ప్రభుత్వం మతపరమైన భావాలను అణిచివేస్తోందని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి.
Illicit Relationship: సభ్య సమాజం తలదించుకునేలా, ఇలా కూడా అక్రమ సంబంధం పెట్టుకుంటారా అని నోరెళ్ల పెట్టేలా ఓ వ్యక్తి, ఓ మహిళ అనైతిక సంబంధం పెట్టుకున్నారు. ఏకంగా కూతురి అత్తగారితో లవ్ లో పడ్డాడు ఓ వ్యక్తి. ఇద్దరూ కూడా ఇంట్లో నుంచి పారిపోయారు. చివరకు ఈ సంబంధాన్ని బంధువులు వ్యతిరేకించడంతో తనువు చాలించారు. నడి వయస్కులైన ఈ జంట చివరకు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు.
Uttar Pradesh: విద్యార్థులు స్కూల్లో నమాజ్ చేయడం ఉత్తర్ ప్రదేశ్ లో వివాదాస్పదం అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, హిందూ సంఘాలు దీనికి అభ్యంతరం తెలపడంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. లక్నోలోని స్కూల్ లో నమాజ్ చేస్తున్న విద్యార్థుల వీడియో వైరల్ కావడంతో, ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేసింది ప్రభుత్వం. మరో ఇద్దరు ఉపాధ్యాయుల్ని హెచ్చరించి వదిలేసింది.