India’s aid to Gaza: గాజాకు భారత్ భారీ సాయం.. 6.5 టన్నుల వైద్య సామాగ్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India’s aid to Gaza: ఇజ్రాయిల్, హమాస్ యుద్ధం నడుమ గాజాలోని సాధారణ పాలస్తీనా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఏ రాకెట్ ఎటునుంచి వస్తుందో అని, ఎక్కడ ఏ బాంబు పేలుతుందో అని భయపడుతున్నారు. మరోవైపు ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ ని దిగ్భంధించింది. ఉత్తర గాజాలోని ప్రజలను సురక్షితమైన దక్షిణ ప్రాంతాలకు వెళ్లాలని సూచించడంతో, ఆ ప్రాంతంలోని 10 లక్షల మందిలో 7 లక్షల మంది దక్షిణ వైపు వెళ్లారు.
ప్రస్తుతం దక్షిణాన ఉన్న ఈజిప్టు నుంచి గాజాలోని రఫా క్రాసింగ్ వద్ద నుంచి గాజా ప్రజలకు మానవతా సాయం అందుతోంది. ఇదిలా ఉంటే యుద్ధంతో తల్లడిల్లిపోతున్న గాజా ప్రజలకు భారత్ కూడా ఆపన్నహస్తం అందించింది. పాలస్తీనా ప్రజల కోసం దాదాపుగా 6.5 టన్నుల వైద్యసాయాన్ని, 32 టన్నుల విపత్తు సహాయ సామాగ్రిని పాలస్తీనాకు పంపింది. ఈజిప్టు గుండా గాజాలోకి ఈ సాయం చేరుతుంది. ‘‘పాలస్తీనా ప్రజల కోసం దాదాపుగా 6.5 టన్నుల వైద్యసాయాన్ని, 32 టన్నుల విపత్తు సాయాన్ని తీసుకుని IAF C-17 విమానం ఈజిప్ట్‌లోని ఎల్-అరిష్ విమానాశ్రయానికి బయలుదేరింది’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందబ్ బాగ్చీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
- CJP: ‘‘సంతకాలు చేసి ఉల్లంఘించారు’’.. కాక్రోచ్ నేతలను జైలుకు పంపడానికి కారణాలివే.!
- Real Estate Boom: రియల్ ఎస్టేట్కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
- CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్పోర్టులో అవమానం..
Read Also: Israel: హిజ్బుల్లా డేంజరస్ గేమ్ ఆడుతోంది.. లెబనాన్‌ని యుద్ధంలోకి లాగుతోంది..
మానవతా సాయం కింద ప్రాణాలను రక్షించే మందులు, శస్త్రచికిత్స వస్తువలుు, టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్స్, టార్పాలిన్స్, శానిటరీ వస్తువులు, నీటి శుద్దీకరణ వస్తువులు ఇందులో ఉన్నట్లు బాగ్చీ వెల్లడించారు. పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ తో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన మూడు రోజుల తర్వాత పాలస్తీనాకు భారత్ సాయాన్ని అందించింది. పాలస్తీనాకు భారత్ మానవతా సాయాన్ని పంపుతుందని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.
అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై ఊచకోతకు పాల్పడ్డారు. ఈ దాడిలో 1400 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో గాజాపై ఇజ్రాయిల్ పై విరుచుకుపడుతోంది. హమాస్ ఉగ్రవాదులను సర్వనాశనం చేస్తామని ప్రకటించిన ఇజ్రాయిల్, వారి స్థావరాలను టార్గెట్ చేస్తూ కీలక నేతలను మట్టుబెడుతోంది. ఇజ్రాయిల్ దాడుల్లో గాజాలో 4000కు పైగా మరణించారు.
🇮🇳 sends Humanitarian aid to the people of 🇵🇸!
An IAF C-17 flight carrying nearly 6.5 tonnes of medical aid and 32 tonnes of disaster relief material for the people of Palestine departs for El-Arish airport in Egypt.
The material includes essential life-saving medicines,… pic.twitter.com/28XI6992Ph
— Randhir Jaiswal (@MEAIndia) October 22, 2023
తాజావార్తలు
-
Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
-
AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..