Monkey fever: కర్ణాటక రాష్ట్రంలో ‘మంకీ ఫీవర్’ వ్యాధి కలవరపెడుతోంది. క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్(కేఎఫ్‌డీ)గా పిలువబడే ఈ వ్యాధి బారిన పడి మరో వ్యక్తి మరణించాడు. చిక్కమగళూర్‌లో 43 ఏళ్ల వ్యవసాయ కూలీ బుధవారం ఉదయం మృతి చెందింది. కేఎఫ్‌డీ ఇన్ఫెక్షన్తో మహిళ ఫిబ్రవరి 21న శివమొగ్గలోని మెగాన్ హాస్పిటల్లో చేరిందని అధికారులు తెలిపారు. దీంతో 10 రోజుల వ్యవధిలో ముగ్గురు మరణించారు. మరోవైపు కేఎఫ్‌డీ వ్యాక్సిన్ల స్టాక్ అయిపోయిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
Matrimonial fraud: ఇటీవల కాలంలో మ్యాట్రిమోనియల్ మోసాలు పెరుగుతున్నాయి. గతంలో పెద్దలు కుదర్చిన పెళ్లిళ్లు ఉంటే, ఇప్పుడు మాత్రం అమ్మాయిలు, అబ్బాయిలు తమకు నచ్చిన సంబంధాలను మ్యాట్రిమోని సైట్లలో వెతుక్కుంటున్నారు. ఇదే మోసగాళ్లకు వరంగా మారింది. తాజాగా రాజస్థాన్‌కి చెందిన 45 ఏళ్ల వ్యక్తి ఒకర్నికాదు ఇద్దర్ని కాదు ఏకంగా 250 మందికి పైగా మహిళల్ని మోసం చేశాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Russia-Ukraine war: ఉక్రెయిన్ యుద్ధంలో భారతీయులు చిక్కుకుపోయారు. రష్యా-ఉక్రెయిన్ వార్‌జోన్‌లో కనీసం 20 మంది భారతీయులు చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. వీరింతా భారత అధికారులను సంప్రదించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) ఈ రోజు వెల్లడించింది. వీరిని సురక్షితంగా భారత్ తీసుకురావడానికి రష్యా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఎంఈఏ అధికార ప్రతినిధి రణదీప్ జైశ్వాల్ చెప్పారు.
Semiconductor Plants: ఎలక్ట్రాన్సిక్స్, ఆటోమొబైల్ రంగంతో పాటు శాస్త్రసాంకేతిక రంగంలో ఎంతో కీలకమైన సెమీకండక్టర్ తయారీలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రయత్నిస్తోంది. చైనా, తైవాన్ వంటి దేశాల గుత్తాధిపత్యం నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్‌లోనే చిప్ తయారీని ప్రోత్సహిస్తోంది. ఈ మేరకు భారతదేశంలో మూడు సెమీకండక్టర్ల ప్లాంట్లనను ఏర్పాటు చేసేందుకు కేంద్ర క్యాబినెట్ గురువారం పచ్చజెండా ఊపింది. ఈ విషయాన్ని ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ప్రకటించారు. రానున్న 100 రోజుల్లో నిర్మాణాలు ప్రారంభిస్తామని చెప్పారు.
Gaza War: అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడికి పాల్పడి 1200 మందిని చంపేయడంతో పాటు 240 మందిని బందీలుగా గాజాలోకి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ ఆర్మీ గాజాతో పాటు పాలస్తీనా భూభాగాలపై విరుచుకుపడుతోంది. గాజా స్ట్రిప్‌తో పాటు వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లోని హమాస్ స్థావరాలు, మిలిటెంట్లు లక్ష్యంగా దాడులు చేస్తోంది. హమాస్‌ని పూర్తిగా నిర్మూలించే వరకు యుద్ధాన్ని ఆపే ప్రసక్తి లేదని పలు సందర్భాల్లో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పష్టం చేశారు. అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చే ఒత్తిడిని…
Leopard Population: దేశంలో చిరుత పులుల సంఖ్య 2018-2022 మధ్య పెరిగినట్లు పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ రోజు విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ కాలంలో 1.08 శాతం వృద్ధితో 13,874కి చిరుతల సంఖ్య చేరుకుంది. కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక చిరుతపులుల ఉన్నట్లు పేర్కొంది. ఈ రాష్ట్రంలో 3907 చిరుతలు ఉండగా.. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర(1985), కర్ణాటక(1879), తమిళనాడు(1070) ఉన్నాయి.
Delhi: బీజేపీ మహిళా కార్యకర్త వర్షా(32)ని దారుణంగా హత్య చేశారు. ఫిబ్రవరి 24 నుంచి అదృశ్యమైన తర్వాత ఆమె మృతదేహాన్ని బుధవారం ఢిల్లీలోని నరేలా ప్రాంతంలోని ప్లేస్కూల్లో బుధవారం పోలీసులు కనుగొన్నారు. నరేలాలోని స్వతంత్ర నగర్లో ఉంటున్న వర్షా అదృశ్యంపై ఆమె తండ్రి విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 23న వర్షా తన స్కూటీపై ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆమె తన వ్యాపార భాగస్వామి సోహన్ లాల్‌తో చివరిసారిగా కనిపించింది.
Calcutta High Court: పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్ని ఎట్టకేలకు 50 రోజుల తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. భూ కుంభకోణంలో విచారణ జరిపేందుకు వచ్చిన ఈడీ అధికారులపై ఇతని అనుచరులు దాడులకు తెగబడ్డారు. అంతే కాకుండా సందేశ్‌ఖలి ప్రాంతంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. దీంతో బెంగాల్‌లోని సందేశ్‌ఖలిలో మహిళలు, యువత టీఎంసీ లీడర్లకు వ్యతిరేకంగా ఉద్యమించింది. 55 రోజుల పరారీ తర్వాత అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
PM Surya Ghar Muft Bijli Yojana: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇటీవల ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా కోటి కుటుంబాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చే విధంగా సోలార్ ప్యానెల్ వ్యవస్థ ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ఈ యోజన కింద సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే కుటుంబాలకు రూ. 78,000లను అందించనున్నట్లు కేంద్రం వెల్లడించింది.
Sheikh Shahjahan: పశ్చిమబెంగాల్ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత షేక్ షాజహాన్‌పై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పదుల సంఖ్యలో కేసులు ఉండటంతో పాటు ఇటీవల సందేశ్‌ఖలీలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినట్లు అక్కడి ప్రజలు ఉద్యమించారు.