Live-in relationship: సహజీవనం విషాదంగా మారుతోంది. లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న వారు హత్యలకు గురవుతున్నారు. దేశ రాజధానిలో శ్రద్ధా వాకర్ హత్య ఈ కోవకే చెందుతుంది. ఆమె పార్ట్నర్ అఫ్తాబ్ పూనావాల అత్యంత కిరాతంగా శ్రద్ధాను హత్య చేయడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ తర్వాత నుంచి పలు సందర్భాల్లో లివ్ రిలేషన్లో ఉన్న మహిళలు హత్యలకు గురయ్యారు.
BJP Lok Sabha Candidates: గురువారం రాత్రి 11 గంటల నుంచి శుక్రవారం ఉదయం 4 గంటల వరకు బీజేపీ అగ్రశ్రేణి నాయకత్వం లోక్‌సభ అభ్యర్థులపై సుదీర్ఘంగా చర్చించింది. తొలి విడతలో 100 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు, త్వరలోనే జాబితా విడుదల చేస్తుందని తెలుస్తోంది. హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాలతో దక్షినాదిన తెలంగాణ రాష్ట్రంలో అభ్యర్థుల ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ నివాసం నిన్న అమిత్ షా, జేపీ నడ్డా రాజ్‌నాథ్ సింగ్, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
Google: సర్వీస్ ఫీజు చెల్లింపుల వివాదంలో భారత్ మ్యాట్రిమెనీ వంటి కొన్ని ప్రముఖ మ్యాట్రిమెనీ యాప్‌లతో సహా దేశంలోని 10 కంపెనీలకు చెందిన యాప్‌లను గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి తొలగించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే తొలగింపు ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తోంది. దేశంలో యాంటీట్రస్ట్ అధికారులు 15 శాతం నుంచి 30 శాతం వసూలు చేసే విధానాన్ని రద్దు చేయాలని ఆదేశించిన తర్వాత, యాప్ చెల్లింపులపై 11 శాతం నుంచి 26 శాతం వరకు రుసుమును విధించకుండా గూగుల్‌ని ఆపడానికి కొన్ని భారతీయ స్టార్టప్‌లు చేసిన…
MK Stalin: తమిళనాడులో చైనా వివాదం కొనసాగుతోంది. ఇటీవల తమిళనాడు కులశేఖరపట్టణంలో ఇస్రో కొత్త స్పేస్పోర్టును నిర్మించడాన్ని పురస్కరించుకుని, అధికార డీఎంకే ఓ ప్రకటన జారీ చేసింది. ఇందులో ఇస్రోకు అభినందనలు తెలియజేస్తూ.. భారత రాకెట్‌పై చైనా జెండాను పెట్టింది. దీంతో ఒక్కసారిగా వివాదం ముదిరింది. బీజేపీ, అధికార డీఎంకే పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శించింది. ప్రధాని మోడీ కూడా సీఎం స్టాలిన్, డీఎంకేలను టార్గెట్ చేస్తూ.. వారు భారత పురోగతిని కూడా చూడలేకపోతున్నారని, చైనా జపం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
Rameshwaram Cafe: బెంగళూర్ నగరంలో ప్రముఖ రెస్టారెంట్‌గా పేరొందిన రామేశ్వరం కేఫ్‌లో భారీ పేలుడు సంభవించింది. నగరంలోని వైట్‌ఫీల్డ్ లోని రామేశ్వరం కేఫ్‌లో సంభవించిన పేలుడులో కనీసం నలుగురు గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో ముగ్గురు సిబ్బంది ఉండగా..ఒకరు కస్టమర్. ప్రాథమిక నివేదిక ప్రకారం మధ్యాహ్నం 1 గంట సమయంలో బ్యాగులో ఉంచిన వస్తువు పేలినట్లుగా
Mamata Banerjee: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే వంటగ్యాస్ ధర పెంచవచ్చని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు. గ్యాస్ ధర రూ. 2000 వరకు పెంచవచ్చని గురువారం అన్నారు. ‘‘బీజేపీ ఎన్నికల్లో గెలిస్తే, వంటగ్యాస్ ధరలను రూ. 1500 లేదా రూ.2000 పెంచవచ్చు. మళ్లీ మనం మంటల్ని వెలిగించేందుకు కలపను సేకరించే పాత పద్ధతికి వెళ్లాల్సి ఉంటుంది’’ అని మమతా బెనర్జీ అన్నారు. ఝర్గ్రామ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
BJP: ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశానికి ఆ పార్టీ నేతలంతా సిద్ధమవుతున్నారు. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించేందుకు కాసేపట్లో బీజేపీ అత్యున్నత సమావేశానికి ప్రధాని నరేంద్రమోడీ కూడా హాజరుకాబోతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు ఢిల్లీ బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల కమీషన్ లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించడానికి ముందే బీజేపీ తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమైంది. మరోవైపు ప్రతిపక్ష ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో తలమునకలైన సమయంలోనే బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించాలని…
Sharad Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇండియా కూటమిలో ఉన్న శరద్ పవార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేతో పాటు డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లను మార్చి 2న లంచ్‌కి రావాల్సిందిగా ఆహ్వానించారు. తన సొంత ప్రాంతం బారామతిలోని తన నివాసంలో జరిగే కార్యక్రమానికి ఆహ్వానం పంపారు. శరద్ పవార్ రాజకీయ ప్రత్యర్థులైన వీరికి ఆహ్వానం పంపండం ప్రాధాన్యతన సంతరించుకుంది.
The Indrani Mukerjea Story: 2012లో దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది షీనాబోరా హత్య- ఇంద్రాణి ముఖర్జియా కేసు. సొంత తల్లి తన కూతురిని హత్య చేసిన ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియాపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంట్ సిరీస్ రూపొందించిది. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు విడుదలపై స్టే ఇవ్వాలని విచారణ సంస్థ సీబీఐ బాంబే కోర్టును ఆశ్రయించింది. న్యాయమూర్తులు రేవతి మోహితే డేరే, మంజుషా దేశ్‌పాండేలతో కూడిన డివిజన్ బెంచ్ సీబీఐ పిటిషన్‌ని కొట్టేసింది. దీంతో నెట్‌ఫ్లిక్స్‌లో సిరీస్…
Sandeshkhali: సందేశ్‌ఖలీ లైంగిక వేధింపుల నిందితుడు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మాజీ నేత షేక్ షాజహాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు అతడికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. 10 రోజుల కస్టడీ విధించింది. మరోవైపు టీఎంసీ అతడిని పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేసింది. ఇతడిని అరెస్ట్ చేయాలని కొన్ని వారాలుగా సందేశ్‌ఖలీలో మహిళలు, అక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారు. వీరికి బీజేపీతో సహా పలు విపక్షాలు మద్దతు తెలిపాయి.