Gangster: నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కీలక వ్యక్తి, మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ మహ్మద్ గౌస్ నియాజీని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దక్షిణాఫ్రికాలో అరెస్ట్ చేసింది. నియాజీపై రూ. 5 లక్షల రివార్డు ఉంది. 2016లో బెంగళూర్‌లో ఆర్ఎస్ఎస్ నేత రుద్రేష్ని హత్య చేసిన కేసులో ఇతడు నిందితుడిగా ఉన్నాడు. ఈ ఘటన తర్వాత నియాజీ విదేశాలకు పారిపోయాడు. అప్పటి నుంచి దర్యాప్తు అధికారులు ఇతడి కోసం వెతుకుతున్నారు. తాజాగా దక్షిణాఫ్రికాలో పట్టుబడటం ఎన్ఐఏకి గొప్ప విజయంగా చెప్పవచ్చు.
Nuclear Cargo: చైనా నుంచి పాకిస్తాన్‌లోని కరాచీకి వెళ్తున్న ఓ కార్గో నౌకను భారత అధికారలు ముంబై పోర్టులో అడ్డుకున్నారు. పాకిస్తాన్ అణు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాల కోసం వినియోగించే సరకు ఉందనే అనునమానంతో ముంబై నవ షేవా నౌకాశ్రయంలో భారత అధికారులు శనివారం నిలిపేశారు. కస్టమ్స్, ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఆధారంగా.. జనవరి 23న కరాచీకి వెళ్లే మార్గంలోని వెళ్తున్న సీఎంఎ సీజీఎం అట్టిలా నౌకను నిలిపేశారు. నౌకలో ఉన్న సరుకును పరిశీలించారు. ఇందులో కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్(సీఎన్సీ) అనే యంత్రం ఉన్నట్లు, ఇది…
Rameshwaram Cafe Blast: బెంగళూర్ నగరంలోని రామేశ్వరం కేఫ్ పేలుడు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన బాంబు పేలుడులో 10 మంది గాయపడ్డారు. పథకం ప్రకారమే నిందితుడు ఐఈడీ బాంబుకు టైమర్‌ని అమర్చి పేల్చినట్లు తెలుస్తోంది. 2022 మంగళూర్లో జరిగిన ప్రెషర్ కుక్కర్ పేలుడుకు, తాజాగా జరిగిన బెంగళూర్ పేలుడుకు మధ్య సంబంధం ఉందని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ శనివారం అన్నారు. బెంగళూర్ లోని ఐటీ కారిడార్‌లోని బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలో ఈ…
Stalin vs Annamalai: తమిళనాడులో డీఎంకే, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. దీనికి ప్రతిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. అన్నామలై కూడా అంతే ధీటుగా స్పందించడంతో ఇరు పార్టీల మధ్య పోరు రసవత్తరంగా మారింది. తమిళనాడు రాష్ట్రం పన్నులుగా చెల్లించిన ప్రతీ రూపాయిలో కేంద్రం తిరిగి 28 పైసలు మాత్రమే రాష్ట్రానికి ఇస్తుందని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. ‘28 పైసా మోడీ’ అంటై ప్రధానిని విమర్శించారు.
Pakistan: పాకిస్తాన్ కొత్త ప్రధానిని ఎన్నుకోవడానికి సిద్ధమైంది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) సహకారంలో పాకిస్తాన్ ముస్లిం లీగ్(ఎన్) నేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు షహబాజ్ షరీఫ్‌ని ఆదివారం ప్రధానిగా ఎన్నుకోనున్నారు. మరోవైపు జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ఒమర్ అయూబ్ ఖాన్ని తన ప్రధానమంత్రి అభ్యర్థిగా నామినేట్ చేసింది. అయితే, ఇతను గెలిచే పరిస్థితి లేదు.
Rameshwaram Cafe: బెంగళూర్‌లో ప్రముఖ హోటల్ రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ రోజు మధ్యాహ్నం ఈ పేలుడు సంభవించింది. గుర్తుతెలియని వ్యక్తి రెస్టారెంట్లో బ్యాగ్ వదిలిసి వెళ్లాడు. అందులో ఉన్న బాంబు పేలినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. పేలుడులో ఐఈడీ ఉపయోగించినట్లు ఇప్పటికే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ధ్రువీకరించారు. ఐఈడీని పేల్చేందుకు టైమర్ ఉపయోగించినట్లు అనుమానిస్తున్నారు.
Election Commission: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ పార్టీలు మర్యాదపూర్వకంగా, ఉత్తమంగా నడుచుకోవాలని సలహా ఇచ్చింది. బహిరంగ సభల్లో సంయమనం పాటించాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించకుండా ఉండాలని సూచించింది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్(ఎంసీసీ) ఉల్లంఘన విషయంలో పార్టీలు సీరియస్‌గా ఉండాలని చెప్పింది. ఎవరైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Rameshwaram Cafe: బెంగళూర్ రామేశ్వరం కేఫ్‌లో ఈ రోజు మధ్యాహ్నం పేలుడు సంభవించింది. పేలుడుతో తక్కువ తీవ్రత ఉన్న ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) బాంబు అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం ధృవీకరించారు. ప్రముఖ ఫుడ్ జాయింట్‌గా ఉన్న రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడులో 9 మంది గాయపడ్డారు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు విచారిస్తున్నారు. బాంబ్ స్వ్కాడ్, ఫోరెన్సిక్, డాగ్ స్వ్కాడ్ ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు.
Annamalai: ద్రవిడ రాజకీయాల్లో జాతీయవాద రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు కే అన్నామలై. బీజేపీకి తమిళనాడులో అన్నామలై ఒక తురుపుముక్కగా ఉన్నారు. అన్నాడీఎంకే మాజీ చీఫ్ జయలలిత మరణంతో ఏర్పడిన శూన్యాన్ని పూరించే దిశగా ఈ యాంగ్రీయంగ్ మ్యాన్ దూకుడును ప్రదర్శిస్తున్నారు. 39 ఏళ్ల ఈ మాజీ ఐపీఎస్ అధికారికి బీజేపీ అధిష్టానం పూర్తిగా స్వేచ్ఛనిస్తోంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అన్నామలై లోక్‌సభ అరంగ్రేటం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తమిళనాడు నుంచి లోక్‌సభ బరిలో నిలిపేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది.
Himalayas: ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం వాతావరణ మార్పులను ప్రేరేపిస్తున్నాయి. ధృవాల వద్ద మంచు కరిగిపోతోంది. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే శతాబ్ధంలో భూమి విపరీత వైపరీత్యాలను ఎదుర్కొనే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అంటార్కిటికాలో పెద్ద మంచు ఫలకం క్రమంగా కరుగుతోంది. ఇదిలా ఉంటే, స్టేట్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్మెంట్ 2024 నివేదిక కీలక విషయాలను వెలుగులోకి తెచ్చింది. 2100 నాటికి హిమాలయాల్లోని 75 శాతం మంచు కనుమరుగు అయ్యే అవకాశం ఉందని, ఇది ఆసియాలో బిలియన్ల ప్రజలపై ప్రభావం చూపుతుందని తెలిపింది.