ICC ODI Rankings: వన్డే ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ విధ్వంసం సృష్టిస్తున్నాడు. ప్రతి మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. విరాట్ సూపర్ ఫామ్‌లో ఉన్న నేపథ్యంలో, ఇప్పుడు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 బ్యాట్స్‌మన్‌గా అవతరించడం ఖాయంగా కనిపిస్తుంది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ వైఫల్యం, విరాట్ కోహ్లీ దంచికొట్టడంతో వన్డే ర్యాంకింగ్‌లను గణనీయంగా మార్చాయి. న్యూజిలాండ్‌పై విరాట్ కోహ్లీ 93 పరుగులు చేయడంతో, కింగ్ కోహ్లీ నంబర్ 1 వన్డే బ్యాట్స్‌మన్ హోదా దాదాపుగా ఖాయమైంది. తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్‌లు బుధవారం విడుదల కానున్నాయి.
READ ALSO: Rahul Gandhi: వియత్నాం టూర్‌లో రాహుల్ గాంధీ.. ‘‘పార్టీ-టూరిజం’’ లీడర్ అని బీజేపీ ఫైర్..
విరాట్ – రోహిత్ మధ్య తేడా చాలా తక్కువ..
విరాట్ కోహ్లీ – రోహిత్ శర్మల తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో హిట్ మ్యాన్ నంబర్ వన్ స్థానంలో, విరాట్ రెండవ స్థానంలో ఉన్నారు. రోహిత్ శర్మ రేటింగ్ 781 పాయింట్లు, విరాట్ కోహ్లీ 773లను కలిగి ఉన్నారు. ఈ ఇద్దరి మధ్య తేడా కేవలం 8 పాయింట్లు మాత్రమే. తాజాగా భారత్- న్యూజిలాండ్ మధ్య జరిగిన పోరులో విరాట్ దంచికొట్టడం, రోహిత్ పరుగుల వరదపారించ లేకపోవడంతో, ఈ ఫార్మెట్లో విరాట్.. రోహిత్‌ను అధిగమించడం ఖాయంగా కనిపిస్తుందని క్రికెట్ పండితులు చెబుతున్నారు. బుధవారం రాజ్‌కోట్ వన్డేలో విరాట్ కోహ్లీ మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు, కింగ్ కోహ్లీ ప్రపంచంలోనే నంబర్ వన్ వన్డే బ్యాట్స్‌మన్ అవుతాడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
విరాట్ కోహ్లీ దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత నంబర్ 1 ర్యాంకింగ్‌ను సొంతం చేసుకోబుతున్నాడు. కోహ్లీ చివరిసారిగా 2021లో నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత బాబర్ అజామ్ అతని స్థానాన్ని దక్కించుకున్నాడు. 2022లో కింగ్ కోహ్లీ టాప్ 10 నుంచి నిష్క్రమించాడు. అయితే విరాట్ పునరాగమనం 2023లో ప్రారంభమైంది. 2025 చివరి నాటికి, విరాట్ నంబర్ 2 ర్యాంకింగ్‌ను సాధించాడు. అయితే ఇప్పుడు ఏకంగా నంబర్ వన్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మను అధిగమించడానికి రడీగా ఉన్నాడు.
READ ALSO: Japan: చైనాకు చెక్ పెట్టిన ఇండియా ఫ్రెండ్.. డ్రాగన్ ఆట ముగిసినట్లే!