Priyanka Gandhi: హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రాజ్యసభ ఎన్నికలకు అక్కడి అధికార కాంగ్రెస్ పార్టీలో చిచ్చుపెట్టాయి. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా ఒటేయడంతో ఆ రాష్ట్రంలోని ఒకే ఒక రాజ్య సభ సీటులో కమలం గెలిచింది. ఇదిలా ఉంటే, దీని తర్వాత రాష్ట్రంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం, కాంగ్రెస్ నేత సుఖ్వీందర్ సుఖు రాజీనామా చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే, వీటిని ఆయన కొట్టిపారేశారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం ఎలాగైనా ప్రభుత్వాన్ని కాపాడే పనిలో తనమునకలై…
Chinese flag on Isro ad: తమిళనాడు అధికార పార్టీ డీఎంకే ఇస్రో ప్రకటన వివాదాస్పదంగా మారింది. తమిళనాడు రాష్ట్రంలోని కులశేఖర పట్నంలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ఇస్రో స్పేస్‌పోర్టు గురించి డీఎంకే మంత్రి చేసిన ప్రకటనలో చైనా జెండా ఉంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాకెట్ పై భాగంలో చైనా జెండా కలిగి ఉండటంతో డీఎంకే అభాసుపాలవుతోంది. రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్ విడుదల చేసిన ప్రకటనలో.. ఇస్రో కులశేఖరపట్టణంలో స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయడాన్ని ఉద్దేశిస్తూ, ప్రధాని నరేంద్రమోడీ, మాజీ ముఖ్యమంత్రి…
Akhilesh Yadav: అక్రమ మైనింగ్ కేసు విచారణలో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్‌కి కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సమన్లు జారీ చేసింది. ఈ కేసులో సాక్షిగా హాజరుకావాలని సమన్లలో కోరారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ని రేపు దర్యాప్తు సంస్థ ప్రశ్నించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అఖిలేష్ 2012 నుంచి జూన్, 2013 మధ్య మైనింగ్ శాఖను నిర్వహించాడు.
Gaganyaan: ప్రముఖ మలయాళ నటి లీనా తాను ‘గగన్‌యాన్’ వ్యోమగామి ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌ని పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించింది. భారత తొలి మానవసహిత అంతరిక్ష ప్రయోగం ‘గగన్‌యాన్’లో పాలుపంచుకుంటున్న నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ప్రకటించారు. ప్రధాని ప్రకటన అనంతరం లీనా తాను పెళ్లి చేసుకున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. గగన్‌యాన్ కోసం శిక్షణ పొందుతున్న నలుగురు వ్యోమగాముల్లో ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ఒకరు. READ ALSO: Jio phone: […]
Jio phone: 2024 చివరి నాటికి సరసమైన ధరలో రిలయన్స్ జియో 5G మొబైల్‌ని అందించబోతోంది. క్వాల్కామ్ సహాకారంతో జియో ఈ ఫోన్‌ను భారతీయులకు అందుబాటులోకి తీసుకురాబోతోంది. కేవలం రూ. 10,000 కంటే తక్కవ ధరకే ఈ జియో ఫోన్‌ని అందించబోతున్నారు. భారతదేశంలో త్వరలో కొత్త 5జి జియో ఫోన్లను విడుదల చేయడానికి రిలయన్స్ జియోతో కలిసి పనిచేస్తున్నట్లు క్వాల్కామ్ ధృవీకరించింది. క్వాల్కామ్ చిప్ సెట్‌తో జియో ఫోన్ రావడం ఇదే తొలిసారి. ఈ ఏడాది చివరి నాటికి ఫోన్ లాంచ్ అవుతుందని తెలుస్తోంది.…
Rajya Sabha Poll: రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ బీజేపీకి వరంగా మారింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ఒకే ఒక్క రాజ్యసభ ఎంపీ స్థానం బీజేపీ కైవసం చేసుకుంది. 68 మంది సభ్యులు ఉన్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ అధికారంలో ఉండీ, 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. 25 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ రాజ్యసభ స్థానాన్ని దక్కించుకోవడం ఆ పార్టీకి షాక్ ఇచ్చింది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మె్ల్యేలతో పాటు ముగ్గురు స్వతంత్రులు బీజేపీకి జైకొట్టారు.
BYD Seal EV: చైనీస్ ఎలక్ట్రిక్ కార్ మేకర్ BYD మరో ఎలక్ట్రిక్ కార్ మోడల్ని భారత్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధమువుతోంది. ఎలక్ట్రిక్ సెడాన్ కార్ బీవైడీ సీల్‌ని మార్చి 5న భారత్‌లో విడుదల చేయబోతోంది. దీనికి ముందు ఇండియాలో BYDకి రెండు ఎలక్ట్రిక్ మోడళ్ల ఉన్నాయి. BYD e6 ఎలక్ట్రిక్ MPVతో సహా BYD ఆటో.3 ఎలక్ట్రిక్ ఎస్యూవీ కార్లు ఉన్నాయి.
Jaya Prada: మాజీ ఎంపీ, సినీ నటి జయప్రదని ‘పరారీ’ ఉన్నట్లు ఉత్తర్‌ప్రదేశ్ రాంపూర్ ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు ప్రకటించింది. ఆమెపై ఉన్న రెండు కేసుల విచారణలో హాజరుకాకపోవడంతో ప్రత్యేక కోర్టు మంగళవారం ఈ నిర్ణయం తీసుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో, ఆమె బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అభ్యర్థిగా ఎన్నికల ప్రవర్తనా నియామావళిని ఉల్లంఘించినట్లు కేసులు నమోదయ్యాయి.
Pakistan: సింధు నదీ ఉపనది అయిన రావి నది నీటిని భారత్ నిలిపేసింది. దీంతో ఒక్కసారిగా పాకిస్తాన్ ఉలిక్కిపడుతోంది. ఇప్పటికే చీనాబ్ నదీ నీటిని భారత్ డైవర్ట్ చేసింది, తాజాగా రావి నది నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు షాపుర్కండి బ్యారేజీని నిర్మించింది. ఈ బ్యారేజ్ వల్ల జమ్మూ లోని కథువా, సాంబా ప్రాంతాల రైతులకు సాగు నీరు అందించడమే కాకుండా, విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. దీని వల్ల పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలు లాభపడనున్నాయి. సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం, మనకు హక్కుగా…
Bihar: ఓ వైపు లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. అధికార, విపక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. బీజేపీని గద్దె దించాలని భావిస్తున్న బీహార్‌లోని ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలకు షాక్ తగిలింది. ఆర్జేడీ-కాంగ్రెస్-వామపక్షాల ‘మహాగటబంధన్’ కూటమికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పార్టీల ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత అధికార బీజేపీలో చేరారు.