Realme TechLife QLED TV: రియల్‌మీ (Realme) నుండి TechLife సిరీస్‌లో భాగంగా 2025 ఎడిషన్‌కు చెందిన 75 అంగుళాల QLED Ultra HD (4K) స్మార్ట్ గూగుల్ టీవీపై భారీ ధర తగ్గింపును ప్రకటించింది. ఈ భారీ స్క్రీన్ టీవీ QLED టెక్నాలజీతో రూపొందించబడింది. ఇందులోని క్వాంటమ్ డాట్ టెక్నాలజీ వల్ల రంగులు మరింత స్పష్టంగా, ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఈ కాంట్రాస్ట్‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, క్రీడలు చూసే అనుభూతి థియేటర్‌లా ఉంటుంది. ఇంకా 4K రిజల్యూషన్ (3840×2160 పిక్సెల్స్)తో ప్రతి ఫ్రేమ్ అత్యంత క్లారిటీతో కనిపిస్తుంది.
TFI: తెలుగు సినీ పరిశ్రమలో చారిత్రాత్మక అడుగు.. ఇకపై డిజిటల్ దుష్ప్రచారానికి చెక్!
వీడియో ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ టీవీకి 60Hz రిఫ్రెష్ రేట్ ఉంది. గేమింగ్, స్పోర్ట్స్ చూడడానికి ఇది అనుకూలంగా ఉంటుంది. డైరెక్ట్ LED అరేంజ్మెంట్ వల్ల బ్రైట్‌నెస్ సమానంగా ఉంటుంది. విద్యుత్ వినియోగం తక్కువగా ఉండేలా 3 స్టార్ BEE ఎనర్జీ రేటింగ్ కూడా కలిగి ఉంది. స్మార్ట్ ఫీచర్లలో ‘గూగుల్ టీవీ’ ఆపరేటింగ్ సిస్టమ్, క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2GB ర్యామ్, 32GB స్టోరేజ్ ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, జియో హాట్‌స్టార్ వంటి ప్రముఖ యాప్స్‌కు పూర్తి మద్దతు లభిస్తుంది. బిల్ట్-ఇన్ వైఫైతో పాటు మొబైల్ క్యాస్టింగ్ సపోర్ట్ కూడా ఉంది.

ఆడియో పరంగా 30W బాక్స్ స్పీకర్లు ఉండటంతో శక్తివంతమైన సౌండ్ అవుట్‌పుట్ అందిస్తుంది. కనెక్టివిటీకి 3 HDMI పోర్టులు, 2 USB పోర్టులు, హెడ్‌ఫోన్ జాక్ అందుబాటులో ఉన్నాయి. మెటల్ స్టాండ్‌తో వచ్చే ఈ టీవీ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్, గేమింగ్, OTT స్ట్రీమింగ్, ఆఫీస్ అవసరాలకు కూడా అనువుగా ఉంటుంది. ఇంకా తయారీ లోపాలపై 1 సంవత్సరం వారంటీను కంపెనీ అందిస్తోంది.
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు.. ఐసీసీకి పీసీబీ స్పెషల్ ఆఫర్!
ఈ టీవీ సాధారణంగా రూ. 2,39,999 కాగా ఏకంగా 74 శాతం డిస్కౌంట్ తో ప్రస్తుతం కేవలం ఈ టీవీని రూ.60,999 ప్రత్యేక ధరకు అందుబాటులోకి తీసుకొచ్చింది. భారీ ధర తగ్గింపు, పెద్ద స్క్రీన్, ఆధునిక ఫీచర్లతో ఈ రియల్‌మీ 75 అంగుళాల QLED 4K స్మార్ట్ టీవీ ప్రస్తుతం మార్కెట్‌లో ఒక బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు.