PM Surya Ghar Muft Bijli Yojana: సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు కుటుంబానికి రూ. 78,000.. కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Surya Ghar Muft Bijli Yojana: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇటీవల ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా కోటి కుటుంబాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చే విధంగా సోలార్ ప్యానెల్ వ్యవస్థ ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ఈ యోజన కింద సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే కుటుంబాలకు రూ. 78,000లను అందించనున్నట్లు కేంద్రం వెల్లడించింది.
ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. గురువారం విలేకరుల సమావేశంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి సూర్యఘర్: ముఫ్త్ బిజిలీ యోజనకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. రూ. 75,021 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని ప్రధాని మోడీ ఫిబ్రవరి 13న ప్రారంభించారు. ఈ పథకం కుటుంబాలకు సహాయం చేయడమే కాకుండా సౌరశక్తి విడిభాగాల దేశీయ తయారీకి ఊతమిస్తుందని, 17 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధిని అందిస్తుందని మంత్రి చెప్పారు.
Also Read
- Tarun Tejpal: అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు షాక్.. 2 వారాల్లో లొంగిపోవాలని తేజ్‌పాల్‌కు ఆదేశం
- Mojtaba Khamenei: మోజ్తబా ఖమేనీ అరుదైన వీడియో విడుదల.. అనుమానాల వేళ వైరల్
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
Read Also: Naga Babu: 5 అడుగుల మూడు అంగుళాల హీరో గురించి మాట్లాడడం తప్పే.. క్షమించండి
సోలార్ విద్యుత్ పెంచే లక్ష్యం:
సబ్సిడీ కింద కోటి కుటుంబాలకు రూ. 78,000 రాయితీ అందించనునంది. మిగిలిన మొత్తాన్ని సదరు ఇంటి యజమాని భరించలేని పక్షంలో వారికి బ్యాంకు ద్వారా రుణం అందించనున్నారు. ఎండ ఉన్న రోజులో 1 kW సౌర విద్యుత్ ప్లాంట్ ఒక రోజులో 4 నుండి 5.5 యూనిట్లను ఉత్పత్తి చేయగలదు.
ఈ పథకం కింది రూప్ టాప్ సోలార్ విద్యుత్ వ్యవస్థ కోసం కేంద్రం 2 కిలోవాట్ సిస్టమ్ ఖర్చులో 60 శాతం, 2-3 కిలోవాట్ల మధ్య ఉన్న సిస్టమ్‌కి రూ. 40 శాతం అదనపు ఖఱర్చు ఇవ్వబడుతుందని అధికారిక ప్రకటన తెలిపింది. ఆర్థిక సాయం 3 కిలోవాట్ల వరకే పరిమితం చేయబడుతుంది.
దీని ప్రకారం .. 2 KW సోలార్ ప్యానెల్ కెపాసిటీ కలిగిన వ్యవస్థను ఏర్పాటు చేసుకునే ఇళ్లకు కిలోవాట్‌కి రూ. 30,000 చొప్పున సబ్సిడీ ఉండనుంది. 3 కిలోవాట్లకు వరకు అదనపు సామర్థ్యం కోసం మరో కిలోవాట్‌కి రూ. 18,000 సబ్సిడీగా ఇవ్వనుంది.
దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో https://pmsuryaghar.gov.in/consumerRegistrationlలో నమోదు చేసుకోవచ్చు, అర్హత ఉన్న కుటుంబాలు ఇన్‌స్టాలేషన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పంపిణీ సంస్థ(డిస్కమ్) సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఆమోదం తెలుపుతుంది.
తాజావార్తలు
-
Tarun Tejpal: అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు షాక్.. 2 వారాల్లో లొంగిపోవాలని తేజ్‌పాల్‌కు ఆదేశం
-
Harish Rao : 22A భూములపై హరీశ్ రావు ఫైర్.. ‘కమీషన్ల కోసమే దోపిడీ!’
-
Kaka vs House No 47: పాత ఫార్ములానే రిపీట్ చేస్తున్నారా? చిరు, వెంకీ సినిమాలపై ఆసక్తికర చర్చ!
-
Dhanush: “నాకు యాక్టింగ్ నేర్పిస్తావా?”.. ఇరుముడి పాపతో ధనుష్ వీడియో కాల్ వైరల్
-
Brain Eating Amoeba: మెదడును తినేసిన జీవి.. 8ఏళ్ల చిన్నారి కథలో ఊహించని విషాదం
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!