Russia-Ukraine war: ఉక్రెయిన్ యుద్ధంలో భారతీయులు చిక్కుకుపోయారు. రష్యా-ఉక్రెయిన్ వార్‌జోన్‌లో కనీసం 20 మంది భారతీయులు చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. వీరింతా భారత అధికారులను సంప్రదించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) ఈ రోజు వెల్లడించింది. వీరిని సురక్షితంగా భారత్ తీసుకురావడానికి రష్యా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఎంఈఏ అధికార ప్రతినిధి రణదీప్ జైశ్వాల్ చెప్పారు.
Read Also: Russia-Ukraine war: రష్యా-ఉక్రెయిన్ వార్‌జోన్‌లో చిక్కుకుపోయిన 20 మంది భారతీయులు..
ఉక్రెయిన్‌తో రష్యా చేస్తున్న యుద్ధంలో కొంతమంది భారతీయులు చిక్కుకుపోయినట్లు కేంద్రం ఫిబ్రవరి 23 తెలిపింది. వారందరిని ఇండియాకు తిరిగి రప్పించేందుకు రష్యా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత అధికారులు వెల్లడించారు. రష్యాలో ఉద్యోగాల పేరుతో పలువురు బలవంతంగా యుద్ధంలో పాల్గొనాల్సి వస్తోందని నివేదికలు వెలువడ్డాయి. ఇప్పటికే రష్యాలోని భారతీయులకు కేంద్రం కీలక సూచనలు చేసింది. యుద్ధ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లొద్దని, కష్టాల్లో చిక్కుకోవద్దని సూచించింది.