Jammu Kashmir: ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న జమ్మూ కాశ్మీర్‌కి చెందిన రెండు ముస్లిం కాన్ఫరెన్స్ వర్గాలపై కేంద్రం నిషేధం విధించింది. ముస్లిం కాన్ఫరెన్స్ జమ్మూ కాశ్మీర్ (సుమ్జీ వర్గం), ముస్లిం కాన్ఫరెన్స్ జమ్మూ & కాశ్మీర్ (భాట్ వర్గం)లను బుధవారం నిషేధిత గ్రూపులుగా ప్రకటించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో కృతనిశ్చయంతో ఉందని, ఎవరైనా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమిత్ షా హెచ్చరించారు.
Karnataka: కర్ణాటక రాజకీయాల్లో ‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ నినాదాల రచ్చ నడుస్తోంది. నిన్న రాజ్యసభ ఎన్నికల్లో విజయం తర్వాత కాంగ్రెస్ నేత నసీర్ హుస్సేన్ మద్దతుదారులు పాక్ అనుకూల నినాదాలు చేశారు. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ వివాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ.. ఇది నిజమని తేలితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బీజేపీ కావాలనే ఇలాంటి కుట్రలకు తెరతీస్తోందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. బీజేపీ ఆరోపణల్ని కొట్టిపారేశారు.
Political parties income: కేంద్రంతో పాటు మెజారిటీ రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ ఆదాయం పరంగా టాప్ ప్లేస్‌లో ఉంది. దేశంలో ఉన్న 6 జాతీయ పార్టీల ఆదాయాలను బట్టి చూస్తే ఎవరికి అందనంత ఎత్తులో కాషాయ పార్టీ నిలిచింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 6 జాతీయ పార్టీలకు రూ. 3077 కోట్ల ఆదాయం వస్తే.. బీజేపీ ఏకంగా 76.77 శాతంతో రూ. 2361 కోట్ల ఆదాయాన్ని సంపాదించినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాలను ఉటంకిస్తూ.. అసోసియేషన్ ఫర్ డిమెక్రాటిక్ రిఫార్మ్స్(ADR) బుధవారం…
Mahindra Thar Earth edition: ఇండియాలో ఆఫ్ రోడ్ వాహనాల్లో మహీంద్రా థార్‌కి ఉన్న క్రేజే వేరు. వేరే కార్ మేకర్ కంపెనీల నుంచి పలు రకాల ఆఫ్ రోడర్లు వచ్చినప్పటికీ థార్‌కి ఉన్న ఆదరణ మాత్రం నానాటికి పెరుగుతోంది. తాజాగా థార్ కొత్త అవతార్‌లో వస్తోంది.
Isro: ప్రధాని నరేంద్రమోడీ బుధవారం దేశంలో రెండో రాకెట్ లాంచింగ్ స్టేషన్‌కి శంకు స్థాపన చేశారు. తమిళనాడు కులశేఖరపట్టణంలో ఈ స్పేస్‌పోర్ట్ రాబోతోంది. ఇన్నాళ్లు ఇస్రో రాకెట్ ప్రయోగాలకు కేరాఫ్‌గా ఏపీలోని శ్రీహరికోట ఉంది. గత దశాబ్దాలుగా ఈ శ్రీహరికోట రాకెట్ ప్రయోగాలకు ప్రసిద్ధి చెందింది. దీనికి 700 కిలోమీటర్ల దూరంలో కొత్త స్పేస్‌పోర్ట్ రాబోతోంది. ఈ రాకెట్ లాంచింగ్ స్టేషన్‌ని చిన్న శాటిలైట్స్, లోఎర్త్ఆర్బిట్(LEO)లోకి ప్రయోగించే ఉపగ్రహాల కోసం ఉపయోగించనున్నారు.
Crime: ఆన్లైన్, సోషల్ మీడియా పరిచయాలు అఘాయిత్యాలకు దారి తీస్తున్నాయి. స్నేహితుల పేరుతో మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కేసులు ఇప్పటి వరకు చాలానే నమోదయ్యాయి. తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి చెందిన ఓ మైనర్ బాలికపై ఆమె స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నగరంలోని దబ్రీ మెట్రోస్టేషన్ సమీపంలో బాలిక అపాస్మారక స్థితిలో కనిపించిందని పోలీసులు బుధవారం వెల్లడించారు.
Rajya Sabha Elections: క్రాస్ ఓటింగ్, రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలు ముగిశాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఎస్పీ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతుగా క్రాస్ ఓటింగ్ చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పట్టు నిలుపుకుంది. కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని రాజ్యసభ ఎన్నికల్లో హైడ్రామా చోటు చేసుకుంది.
ఇదిలా ఉంటే, అమెరికాలో సొంతగా కంపెనీ పెట్టలేకపోయాననే బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అమీన్పూర్ పరిధిలో చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూర్ మండలం ముత్యాల పల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాశీ విశ్వనాథ్(38) పటాన్చెరు పరిధిలోని అమీన్పూర్ దుర్గా హోమ్స్ కాలనీలో నివాసం ఉంటున్నాడు.
Pakistan: పాకిస్తాన్ పరిస్థితి గతంలో ఎప్పుడూ లేనంత ఘోరంగా తయారైంది. ఓ వైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు ఉగ్రవాదం, రాజకీయ అస్థిరత ఇలా ఆ దేశం అనేక కష్టాల్లో చిక్కుకుంది. ఇక ఆ దేశంలోని అన్ని సంస్థలు దాదాపుగా దివాళా అంచుకు చేరుకుంటున్నాయి. ఇందులో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచి పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) కూడా ఒకటి. ఇంధన ధరలు పెరిగిపోవడం, అప్పులు ఇలా పీఐఏ ఆర్థిక సమస్యల్లో ఉంది. తమను ఆదుకోవాలని దేశ ప్రభుత్వాన్ని కోరింది.
Karnataka: కర్ణాటక రాష్ట్రంలో మరో వివాదం చెలరేగింది. అసెంబ్లీలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం రాజకీయ దుమారం రేపింది. రాజ్యసభ ఎన్నికల ఫలితాల అనంతరం ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ ఆరోపణలపై ముఖ్యమంత్రి సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ఈ నినాదాలు నిజమని ప్రతిపక్ష బీజేపీ నిరూపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆరోపణలపై ఫోరెన్సిక్ సైన్య ల్యాబ్ విచారణకు సీఎం పిలుపునిచ్చారు.