గత సంవత్సరం ‘శాంసంగ్’ తన కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఇందులో శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 7, గెలాక్సీ జడ్ ఫ్లిప్ 7, గెలాక్సీ జడ్ ఫ్లిప్ 7 ఎఫ్‌ఈ ఉన్నాయి. ఈ మూడింటిలో డిజైన్, అత్యుత్తమ పనితీరు కారణంగా గెలాక్సీ జడ్ ఫోల్డ్ 7 ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించింది. మీరు ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్‌ను కొనాలనుకుంటే.. ఇదే సరైన అవకాశం అని చెప్పాలి. గెలాక్సీ జడ్ ఫోల్డ్ 7 ప్రస్తుతం అమెజాన్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. 19 వేల డిస్కౌంట్ ఉంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 7 (12జీబీ+512జీబీ) భారతదేశంలో రూ.1,86,999 ధరకు లాంచ్ అయింది. అయితే ఇ-కామర్స్ సైట్ అమెజాన్‌లో రూ.1,69,990 ధరకు అందుబాటులో ఉంది. రూ.17,000 కంటే ఎక్కువ తగ్గింపు లభిస్తుంది. ఇది కాకుండా బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ లేదా ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐపై కొనుగోళ్లు చేస్తే.. మీరు రూ. 2,500 అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. లేటెస్ట్ మోడల్, మంచి కండిషన్ ఉన్న ఫోన్‌పై రూ.43,000 వరకు ఆదా చేసుకోవచ్చు. పూర్తి ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ వర్తిస్తే.. మొత్తంగా మీకు రూ.62 వేలు ఆదా అవుతుంది. అప్పుడు గెలాక్సీ జడ్ ఫోల్డ్ 7 ఫోన్ రూ.1,07,990కి అందుబాటులో ఉంటుంది.
శాంసంగ్ జడ్ ఫోల్డ్ 7 బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్. 8 ఇంచెస్ QXGA+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ ఇన్ఫినిటీ ఫ్లెక్స్ ఇన్నర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz అడాప్టివ్ రీఫ్రెస్ రేటుతో వచ్చింది. ఫోన్‌ను క్లోజ్ చేసినప్పుడు 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ కవర్ డిస్‌ప్లే ఉండగా.. ఇది కూడా 120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేటు ఉంది. ఔటాఫ్‌ది బాక్స్ ఆండ్రాయిడ్ 16తో కూడిన వన్‌యూఐ 8తో రన్ అవుతుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంది. వర్ డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ 2 ప్రొటెక్షన్.. వెనుకవైపు బాడీకి కార్నింగ్ గొరిల్లా విక్టస్ 2 ప్రొటెక్షన్‌ను ఇచ్చారు. జెమినీ లైవ్, ఏఐ రిజల్ట్ వ్యూ, సర్కిల్ టు సెర్చ్, డ్రాయింగ్ అసిస్ట్, రైటింగ్ అసిస్ట్ వంటి ఏఐ ఫీచర్లు ఉన్నాయి.
Also Read: Vivo X200T Launch: 6200mAh బ్యాటరీ, 50MP సోనీ-శాంసంగ్ కెమెరా.. ‘వివో ఎక్స్200’ కొత్త లీక్స్ ఇవే!
శాంసంగ్ జడ్ ఫోల్డ్ 7లో వెనుక వైపు 200 ఎంపీ ప్రధాన కెమెరా ఉంటుంది. 12 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 10 ఎంపీ టెలిఫొటో లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 10 ఎంపీ కెమెరా ఉంది. ఇన్నర్ స్క్రీన్‌లో 10 ఎంపీ కెమెరా ఉంటుంది. ఇందులో 4,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. బ్లూ షాడో, జెట్‌బ్లాక్, సిల్వర్ షాడో రంగుల్లో ఇది కొనుగోలుకు అందుబాటులో ఉంది.