Calcutta High Court: తృణమూల్ నేత షేక్ షాజహాన్‌పై తమకు “సానుభూతి” లేదన్న హైకోర్టు.. సందేశ్‌ఖలి అఘాయిత్యాల్లో ప్రమేయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Calcutta High Court: పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్‌ని ఎట్టకేలకు 50 రోజుల తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. రేషన్ బియ్యం కుంభకోణంలో విచారణ జరిపేందుకు వచ్చిన ఈడీ అధికారులపై ఇతని అనుచరులు దాడులకు తెగబడ్డారు. అంతే కాకుండా సందేశ్‌ఖలి ప్రాంతంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. దీంతో బెంగాల్‌లోని సందేశ్‌ఖలిలో మహిళలు, యువత టీఎంసీ లీడర్లకు వ్యతిరేకంగా ఉద్యమించింది. 55 రోజుల పరారీ తర్వాత అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కేసుపై కలకత్త హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. షేక్ షాజహాన్ తరుపు న్యాయవాది బెయిల్ పిటిషన్‌ని జస్టిస్ టిఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని బెంచ్ లేవనెత్తారు. తమకు షేక్ షాజహాన్ పట్ల ఎలాంటి సానుభూతి లేదని లాయర్‌ని ఉద్దేశించి న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈడీ అధికారులపై దాడి కేసులో అతడిని బెంగాల్ పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. ఇతడు, ఇతని అనుచరులు సందేశ్‌ఖలి మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు భూకబ్జాలు, దోపిడి, బెదిరింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
- Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
ఈ రోజు షాజహాన్ తరుపు న్యాయవాదిని ఉద్దేశిస్తూ.. షాజహాన్‌పై 43 కేసులు ఉన్నాయి, ఇవి మిమ్మల్ని 10 ఏళ్ల పాటు బిజీగా ఉంచుతాయని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. అతని బెయిల్ పిటిషన్‌ని తిరస్కరించింది న్యాయస్థానం. సోమవారం మరోసారి విచారణకు రావాలని, షేక్ షాజహాన్‌కి 10 రోజుల పాటు కస్టడీ విధించింది.
అంతకుముందు కలకత్తా హైకోర్టు షేక్ షాజహాన్‌ని రాష్ట్రపోలీసులు, సీబీఐ, ఈడీ అరెస్ట్ చేయవచ్చని చెప్పింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ కూడా షాజహాన్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులకు 72 గంటల గడువు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అతడిని నిన్న బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్ని వారాలుగా షేక్‌పై 100కు పైగా ఫిర్యాదులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా షేక్ మరియు అతని సహచరులపై 376డి (గ్యాంగ్ రేప్) సహా అనేక కేసులు నమోదయ్యాయి. ఆయన సన్నిహితులు శిబాప్రసాద్ హజ్రా, ఉత్తమ్ సర్దార్‌లు ఇలాంటి ఆరోపణలపై గతంలో అరెస్టయ్యారు. మరోవైపు నమోదైన కేసుల దర్యాప్తును పశ్చిమ బెంగాల్ సీఐడీ చేపట్టింది.
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 25 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!