Badlapur encounter: బద్లాపూర్ అత్యాచార నిందితుడిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. నిందితుడిని వాహనంలో తీసుకెళ్తుండగా.. అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ నీలేష్ మోర్ పిస్టల్ లాక్కుని ఎస్కార్ట్ పోలీసుల నుంచి పారిపోయిందుకు ప్రయత్నించాడని, ఈ నేపథ్యంలో ముగ్గురు పోలీసులకు కారణమయ్యాయని పోలీసులు వెల్లడించారు.
Bengaluru chilling murder: శ్రద్ధావాకర్ తరహాలోనే బెంగళూర్‌లో మహాలక్ష్మీ అనే 29 ఏళ్ల యువతి దారుణ హత్య జరిగింది. ఈ హత్య స్థానికంగా సంచలనంగా మారింది. మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టిన వైనం ఒళ్లు గగుర్పాటు గురయ్యేలా ఉంది. తాజాగా ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిని గుర్తించామని నగర పోలీస్ కమిషనర్ బి దయానంద్ సోమవారం తెలిపారు.
MUDA land scam case: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు భారీ షాక్ ఇచ్చింది కర్ణాటక హైకోర్టు. ముడా భూ కుంభకోణం కేసులో విచారణకు అనుమతి ఇచ్చిన కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆదేశాలను సవాల్ చేస్తూ సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిసిందే. అయితే, దీనిని కోర్టు ఈ రోజు తోసిపుచ్చింది.
Modi In USA: భారతదేశానికి మీరే బ్రాండ్ అంబాసిడర్లు అంటూ అమెరికాలోని ప్రవాస భారతీయులపై ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసలు కురిపించారు. అమెరికాలో పర్యటిస్తున్న మోడీ ఈ రోజు న్యూయార్క్‌లోని నసావు కొలీజియంలో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడారు. లాంగ్ ఐలాండ్‌లోని కొలీజయం వద్దకు ప్రధాని రాగానే ప్రవాసులు ఘనంగా స్వాగతం పలికారు. ‘‘మోడీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్’’ ఈవెంట్‌కి 14 వేల మంది ఎన్ఆర్ఐలు, సెలబ్రిటీలు, ఇండో అమెరికన్ కమ్యూనిటీ తరలించి వచ్చింది. ‘‘భారత్ మాతాకీ జై’’ అంటూ మోడీ తన ప్రసంగాన్ని…
Snake In Train: భారత రైల్వేలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లతో ఆధునాతనంగా మారుతోంది. మరోవైపు రైళ్లు పట్టాలు తప్పడం, వాటర్ లీకేజీలు, నాణ్యత లేని ఆహారంతో కొన్నిసార్లు అభాసుపాలవుతోంది. కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ ఎప్పటికప్పుడు భారతీయ రైళ్లలో మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కసరత్తు చేస్తూనే ఉంది. అయినా అక్కడక్కడ లోపాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి.
UP Shocker: యూపీలో గత వారం హత్యకు గురైన 17 ఏళ్ల బాలిక మిస్టరీ వీడింది. అత్యాచారానికి గురైన బాలిక వల్ల కుటుంబ పరువు పోతుందని సొంత తల్లి, ఇద్దరు కుమారులు ఆమెను దారుణంగా చంపేశారు. విచారణ తర్వాత సొంత కుటుంబమే బాలికను హత్య చేసినట్లు తేలిందని పోలీసులు ఆదివారం తెలిపారు. అత్యాచారం కేసు కారణంగా కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందనే ముగ్గురు కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Sri Lanka election: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో అనుర కుమార దిసానాయకే(55) విజయం సాధించారు. కొత్తగా ఆయన శ్రీలంక అధ్యక్ష పదవిని అధిరోహించబోతున్నారు. మార్స్కిస్ట్ నేతగా, జనతా విముక్తి పెరమున పార్టీకి చెందిన అనుర కుమార రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గెలుపొందారు.
Bengaluru Woman Murder: ఢిల్లీలో శ్రద్ధా వాకర్ తరహాలో బెంగళూర్‌లో మహాలక్ష్మి దాస్ (28) అనే మహిళని దారుణహత్య సంచలనంగా మారింది. ఈ హత్యతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగరంలోని వైయాలికావల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆమె శరీరాన్ని 32 ముక్కలుగా నరికి, ఆమె ఇంట్లోని ఫ్రిజ్ లోనే పెట్టారు. ఫ్రిజ్ కింది షెల్ఫ్‌లో ఆమె తెగిపడిన తల, పైన కాళ్లు, మధ్య భాగంలో మిగిలిన శరీర భాగాలు ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
MP Awadhesh Prasad: అయోధ్య రామాలయం ఉన్న ఫైజాబాద్ ఎంపీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) తరుపున అవధేష్ ప్రసాద్ గెలిచి సంచలనం సృష్టించారు. అయోధ్య రామ మందిరం ప్రారంభమైన తర్వాత కొన్ని రోజులకే జరిగిన ఎన్నికల్లో బీజేపీ అక్కడ ఘోరంగా ఓడిపోయింది.
Bhagwant Mann: ఖలిస్తాన్ మద్దతుదారు, ఈ ఏడాది పంజాబ్ లోని ఖదూర్ సాహిబ్ ఎంపీగా గెలిచిన అమృత్‌పాల్ సింగ్ నుంచి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కి ప్రాణహాని ఉందని పంజాబ్ పోలీసులు పేర్కొన్నారు. అమృత్‌పాల్, అతడి సన్నిహితుల నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలకే కాకుండా, సీఎం ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పారు. పంజాబ్ పోలీసులు వారి వాదనలకు మద్దతుగా గతంలో అమృత్‌పాల్ సింగ్ చేసిన ప్రసంగాలకు సంబంధించి వీడియో క్లిప్‌లను ప్రస్తావించారు.