Amit Shah: రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నాయకుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tirupati Laddoo Row: తిరుపతి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగిస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఒక్కసారి హిందువులు, భక్తుల్లో ఆందోళన మొదలైంది. ఈ వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది.
UP Crime: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. 7 ఏళ్ల బాలికపై ఇద్దరు బాలురు అత్యాచారం చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం ఇద్దరు నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు
Al Jazeera: ఖతార్‌కి చెందిన ప్రముక మీడియా సంస్థ ‘‘అల్ జజీరా’’కి ఇజ్రాయిల్ షాక్ ఇచ్చింది. వెస్ట్ బ్యాంక్‌లోని రమల్లాలో అల్ జజీరా కార్యాలయానికి వెళ్లిన ఇజ్రాయిల్ ఆర్మీ వెంటనే వారిని ఖాళీ చేయాలని ఆదేశించింది. భా
Satyapal Malik: జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మరోసారి బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ శవపేటికకు మహారాష్ట్ర చివరి మేకు అవుతుందని ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో శనివారం అన్నారు. రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. హర్యానాలో పాటు మహారాష్ట్రకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉందని, అయితే ఓటమి భయంతోనే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల మాదిరిగానే వీటిని కూడా వాయిదా వేశారని మాలిక్ అన్నారు.
EY Employee Death: ఎర్నెస్ట్ అండ్ యంగ్‌లో సీఏగా పనిచేస్తున్న 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ పెరాయిల్ మరణం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కార్పొరేట్ రంగంలో పని ఒత్తిడి ఎలా ఉంటుందనే విషయాలను ఆమె మరణం వెలుగులోకి తెచ్చింది. తన కూతురు ‘‘పని ఒత్తిడి’’తో మరణించిందని అన్నా తల్లి ఆరోపించడంతో ఈ ఉదంతం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Bitter gourd juice: మధుమేహం, సింపుల్‌గా షుగర్ వ్యాధిగా పిలుచుకునే ఈ జబ్బు ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం భరించాల్సిందే. అయితే, కొన్ని చిట్కాలు వల్ల షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చు. అయితే, చాలా మంది షుగర్ వ్యాధిగ్రస్తులు ఉదయం ‘‘కాకరకాయ’’ జ్యూస్ తాగుతుంటారు. అయితే, ఇది నిజంగా పనిచేస్తుందా..? అసలు ఏ విధంగా కాకరకాయ షుగర్‌ని అదుపులో ఉంచుతుందో తెలుసుకుందాం.
Mallikarjun Kharge: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలకు కారణమవుతున్నాయి. కాంగ్రెస్-ఎన్సీ పొత్తుపై బీజేపీ చేసిన విమర్శలకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జన ఖర్గే ప్రతిస్పందించారు. శనివారం ప్రధాని నరేంద్ర మోడీ ,హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రధాని మోడీ, అమిత్ షాలు ఇటీవల మాట్లాడుతూ.. కాంగ్రెస్-ఎన్సీ కూటమి పాకిస్తాన్ ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకుందని ఆరోపించారు.
EY Employee Death: అన్నా సెబాస్టియన్ పెరాయిల్ అనే 26 ఏళ్ల యువతి మరణం ఇప్పుడు కార్పొరేట్ రంగాన్ని కుదిపేస్తోంది. ఎర్నెస్ట్ అండ్ యంగ్(EY) ఇండియాలో సీఏగా పనిచేస్తున్న అన్నా ‘‘పని ఒత్తిడి’’ కారణంగా మరణించిన ఘటన ఇప్పుడు కార్పొరేట్లో చీకటి కోణాన్ని వెలుగులోకి తెస్తోంది. ఆఫీస్ కల్చర్ యువ ప్రాణాలు ఎలా బలి తీసుకుందనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా, ఉద్యోగులు ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారనే దాన్ని వెలుగులోకి తెచ్చింది. కేరళకు చెందిన అన్నా, పూణేలో సీఏగా పనిచేస్తోంది.
Indus Water Treaty: దాయాది దేశం, ఉగ్రవాదుల ఉత్పత్తి కర్మాగారంగా ఉన్న పాకిస్తాన్‌కి భారతదేశం మాస్టర్ స్ట్రోక్ ఇవ్వబోతోంది. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ‘‘సింధు జల ఒప్పందాన్ని’’ సమీక్షించాలని పాకిస్తాన్‌కి నోటీసులు పంపింది. ప్రజల ఆందోళనలు, జనాభా మార్పులు, పర్యావరణ సమస్యలు, శక్తి అవసరాలకు అనుగుణంగా సమీక్షించాలని నోటీసులు జారీ చేసింది. పాకిస్తాన్ పదేపదే భారత్ లక్ష్యంగా సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న తరుణంలో ఈ చర్య వచ్చింది.