UP: తమ్ముడు చేసిన తప్పుకు అన్న శిక్ష అనుభవించాడు. తమ్ముడు ఓ మహిళతో పారిపోవడంతో అన్నను శిక్షించారు. విద్యుత్ స్తంభానికి కట్టేసి కర్రలతో కొట్టినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బదౌన్‌లో చోటు చేసుకుంది. బాధితుడిని అరేలా ప్రాంతానికి చెందిన అర్షద్ హుస్సేన్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
Manipur: గతేడాది కాలంలో మణిపూర్ నివురుగప్పిన నిప్పులా ఉంది. మెయిటీ, కుకీ తెగల మధ్య ఘర్షణ ఆ రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చింది. ఈ రెండు తెగల మధ్య ఆధిపత్య పోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇరు వర్గాల మధ్య ఈ ఘర్షణలు మతం రంగును పులుముకుంటున్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని సేనాపతి జిల్లాలో కొందరు వ్యక్తులు రాత్రిపూట శివాలయాన్ని ధ్వంసం చేశారు.
Rahul Gandhi: రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలని బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యం ఆమె తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంది. అయితే, దీనిపై రాజకీయ రగడ మాత్రం ఆగడం లేదు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కంగనా వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఆమె వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోడీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రద్దు చేసిన వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకువస్తే ఇండియా కూటమి దీనికి వ్యతిరేకంగా నిలుస్తుందని రాహుల్…
Gaza War: హమాస్-ఇజ్రాయిల్ పోరు ఇప్పటిలో ముగిసేలా కనిపించడం లేదు. అక్టోబర్ 07తో యుద్ధం ప్రారంభమై ఏడాది గడుస్తోంది. అయితే, గతేడాది అక్టోబర్ 07 నాటి దాడి సమయంలో అపహరణకు గురైన ఇజ్రాయిలీ బందీల జాడ ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. అయితే, వారెక్కడ ఉన్నారనే వివరాలు ఇంకా తెలియవు. మరోవైపు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) వారి కోసం గాజా వ్యాప్తంగా హమాస్ టన్నెల్స్, ఇతర భాగాల్లో క్షుణ్ణంగా వెతుకుతోంది.
MUDA land scam: మైసూరు అర్బన్ డెవలప్మెంట్(ముడా) ల్యాండ్ స్కామ్‌లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గతంలో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆయనపై విచారణకు ఆదేశాలు ఇవ్వడాన్ని సిద్ధరామయ్య కర్ణాటక హైకోర్టులో సవాల్ చేశారు. అయితే, సీఎం పిటిషన్‌ని నిన్న కర్ణాటక హైకోర్టు కోట్టేసింది. దీంతో విచారణకు మార్గం సుగమమైంది. ఇదిలా ఉంటే ట్రయల్ కోర్ట్ సీఎంపై కేసు నమోదు చేసి, విచారణ జరపాలని లోకాయుక్తాని ఈ రోజు ఆదేశించింది.
Musk "Dating" Meloni: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఇద్దరు ‘‘డేటింగ్’’లో ఉన్నారంటూ ఇప్పుడు వీరిద్దరి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మస్క్, జార్జియా మెలోని సంభాషిస్తున్న ఫోటో వైరల్ అయింది.
Asia power index: ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఖ్యాతి పెరుగుతోంది. ఇప్పుడున్న ప్రపంచ సమస్యల పరిష్కారానికి భారత చొరవ లేకుండా ఏ దేశం కూడా ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఆర్థికం బలపడటంతో పాటు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉండటం భారత్ గొప్పతనం. ఇదిలా ఉంటే ‘‘ఆసియా పవర్ ఇండెక్స్’’ రీజినల్ పవర్స్లో భారతదేశం సత్తా చాటింది.
Bengaluru woman Murder: బెంగళూర్‌లో మహాలక్ష్మీ అనే 29 ఏళ్ల యువతి దారుణహత్యకు గురైంది. బాధితురాలు అద్దెకు ఉంటున్న నివాసంలోని ఫ్రిజ్‌లో ఆమె తెగిపడిన శరీర భాగాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు అత్యంత కిరాతకంగా మహాలక్ష్మీని నరికి 52 భాగాలు చేశాడు. ఈ ఘటన యావత్ దేశంలో సంచలనంగా మారింది. మరో శ్రద్ధావాకర్ హత్యను తలపించేలా ఈ ఘటన జరిగింది. గది నుంచి దుర్వాసన రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇదిలా ఉంటే, ఈ ఎన్‌కౌంటర్‌పై అక్షయ్ షిండే తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌ని ఈ రోజు బాంబే హైకోర్టు విచారించింది. మహారాష్ట్ర పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఈ ఎన్కౌంటర్ని నమ్మడం కష్టంగా ఉంది
Mpox Clade 1b: దేశంలో అత్యంత ప్రమాదకరమైన ఎంపాక్స్ వైరస్‌కి చెందిన ‘‘క్లాడ్ 1బి’’ వెరైటీని గుర్తించారు. క్లాడ్ 1బీకి సంబంధించి ఇదే మొదటి కేసుగా గుర్తించబడింది.