Bengaluru:బెంగళూర్‌లో దారుణం జరిగింది. 29 ఏళ్ల మహిళను కిరాతకంగా హత్య చేసి, ఆమె శరీరాన్ని 32 ముక్కలు చేసి, ఆమె నివాసంలోని ఫ్రిజ్‌లో దాచిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ప్రస్తుతానికి ఎవరు చంపారు..? ఎందుకు చంపారు..? అనుమానితులు ఎవరు..? అనే వివరాలు తెలియరాలేదు.
Matrimonial frauds: మ్యాట్రిమోనీ మోసాలు పెరిగిపోతున్నాయి. తమను తాము ఉన్నత ఉద్యోగినని, ప్రభుత్వ అధికారి అని నమ్మిస్తూ మహిళల్ని మోసం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 50 మంది మహిళల్ని ట్రాప్ చేశాడు ఓ కేటుగాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. నిందితుడు 38 ఏళ్ల ముఖీమ్ ఖాన్‌కి అప్పటికే వివాహమై, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతను ఆరు రాష్ట్రాల్లో 50 మందికి పైగా మహిళల్ని మోసం చేశాడు.
Software Engineer: ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా ఉద్యోగి, 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ మృతి దేశవ్యాప్తంగా సంచలంగా మారింది. పని ఒత్తిడి వల్లే తన కూతురు చనిపోయిందని ఆమె తల్లి ఆరోపించారు. ఈ ఘటన ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచంలో ఎలాంటి సమస్యలు, పని ఒత్తిడి ఉందనే విషయాన్ని హైలెట్ చేస్తున్నాయి.
USA: అమెరికా డెలావర్‌లో జరగబోయే భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా కూటమి ‘‘క్వాడ్ ’’ సమావేశం కోసం ప్రధాని నరేంద్రమోడీ బయలుదేరాడు. అయితే, అమెరికాలో మోడీ అడుగుపెట్టే కొన్ని గంటల ముందు వైట్‌హౌజ్ అధికారులు ఖలిస్తానీ మద్దతు గ్రూపులతో సమావేశమైంది. ‘‘అమెరికా గడ్డపై ఏదైనా అంతర్జాతీయ దురాక్రమణ నుంచి రక్షణ’’ ఇస్తామని సదరు సిక్కు గ్రూపులకు వైట్‌హౌజ్ అధికారుల నుంచి హామీ వచ్చింది. అమెరిలో ఉన్నప్పుడు అమెరికన్ పౌరులను హాని నుంచి రక్షించడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీ తన అమెరికా పర్యటన సమయంలో రిజర్వేషన్లు, సిక్కులపై మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి. అయితే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలపై అమెరికాలో ఆయన చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. బెంగళూర్‌లోని హైగ్రౌండ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్కి అధికారికంగా ఫిర్యాదు చేశారు.
Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటన వివాదాస్పదంగా మారింది. సిక్కులపై, రిజర్వేషన్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడింది. మరోవైపు సిక్కులపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సిక్కు సంఘాలు సోనియా గాంధీ నివాసం ముందు నిరసన తెలిపారు.
Tirupati laddoos: తిరుపతి లడ్డూల వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. లడ్డూల తయారీకి వినియోగించే నెయ్యి తక్కువ నాణ్యత కలిగి ఉండటంతో పాటు జంతువుల కొవ్వు కలిగి ఉందనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారింది.
Iran: మిడిల్ ఈస్ట్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమయంలోనే ఇరాన్ శనివారం మిలిటరీ పెరేడ్లో తన కొత్త బాలిస్టిక్ మిసైల్స్, అప్ గ్రేడ్ చేసిన వన్-వే అటాక్ డ్రోన్లు ఆవిష్కరించింది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు డ్రోన్లు, క్షిపణులను సరఫరా చేసినట్లు ఇరాన్ వెస్ట్రన్ దేశాల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటోంది.
Amul: తిరుమల తిరుపతి దేశస్థానం లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని ఉపయోగించారని, అందులో జంతువులకు సంబంధించిన కొవ్వు ఉందనే వార్తల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా వెంకన్న భక్తులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి తోడు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా నివేదిక కోరింది.
Anna Sebastian Perayil: ఎర్నెస్ట్ అండ్ యంగ్(EY) ఇండియా కంపెనీలో పనిచేసే 26 ఏళ్ల ఛార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ మరణించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కార్పొరేట్ వర్క్ కల్చర్, పని ఒత్తిడి ఆమె మృతికి కారణమైనట్లు ఆమె తల్లి ఆరోపించారు. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అన్నా మరణం తర్వాత దేశవ్యాపంగా చాలా మంది ఉద్యోగులు తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని సోషల్ మీడియా వ్యాప్తంగా హైలెట్ చేశారు. కొందరు కార్పొరేట్ ఉద్యోగం అంటే చాలా కష్టమంటూ […]