Renukaswamy murder case: అభిమాని రేణుకాస్వామిని హత్య చేసిన కేసులో ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రస్తుతం జైలులో ఉన్న యాక్టర్ దర్శన్ నివాసంపై దాడులు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆదాయపన్ను శాఖ అధికారులు మంగళవారం సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్శన్ అభిమాని అయిన రేణుకాస్వామిని ఈ ఏడాది దర్శన్, పవిత్ర గౌడ, ఇతర సహాయకులు కలిసి హత్య చేశారు.
Delhi HC: భర్త మరో మహిళతో కలిసి సహజీవనం చేయడంతో పాటు బిడ్డను కూడా కలిగి ఉండటం ‘‘గృహహింస’’గానే పరిగణించబడుతుందని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పంది. గృహహింస చట్టం ప్రకారం భార్య గృహహింసకు గురవుతుందని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. తన భార్యకు నెలకు రూ. 30,000 భరణం చెల్లించడాన్ని వ్యతిరేకిస్తూ భర్త దాఖలు చేసిన పిటిషన్‌ని కోర్టు తిరస్కరించింది.
MUDA land scam: మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు షాక్ ఇచ్చింది. ముడా ల్యాండ్ స్కాంలో సీఎంపై గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ విచారణకు ఆదేశించారు. అయితే, దీనిని సవాల్ చేస్తూ సిద్ధరామయ్య కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ రోజు దీనిపై న్యాయమూర్తి జస్టిస్ నాగ ప్రసన్నతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరించారని, వాస్తవాలు వెలుగులోకి రావాలి’’ అని, సిద్ధరామయ్య పిటిషన్‌ని కొట్టేస్తున్నట్లుగా తీర్పు చెప్పారు.
Triangle Love: ‘‘ట్రయాంగిల్ లవ్ స్టోరీ’’ చివరకు విషాదంగా మారింది. అమ్మాయి కోసం ఇద్దరు స్నేహితులు గొడవ పడటం హత్యకు దారి తీసింది. ఈ ఘటన బెంగళూర్ లోని సంజయ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 24 ఏళ్ల వరుణ్ కోటియన్ అనే యువకుడి హత్య జరిగింది. ఉడిపికి చెందిన వరుణ్ని అతడి స్నేహితుడు దివేష్(25) బెంగళూర్‌లోని గెద్దలహళ్లీలో అద్దెకు ఉంటున్న ఇంట్లో హత్య చేశాడు.
UP News: అసలు ఇలాంటి నీచుడిని ఎక్కడా చూడం.. వీడు చేసిన అఘయిత్యాన్ని చూస్తే వీడు ఓ కొడుకేనా..? అని అనిపించక మానదు. భర్త చనిపోయి బాధలో ఉన్న కన్నతల్లి పైనే అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ కేసులో నిందితుడికి ఉత్తర్ ప్రదేశ్ బులంద్ షహర్ జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం నిందితుడిని కోర్టు నుంచి చేతులకు బేడీలు వేసి బయటకు తీసుకు వస్తున్న వీడియో వైరల్‌గా మారింది.
Karnataka: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం విచిత్రమైన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని మదిగెరె, చిక్కమగళూర్ జిల్లా్ల్లో అంగన్వాడీ టీచర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకుని అభ్యర్థులకు ఉర్దూ భాషని తప్పనిసరి చేసింది. రాష్ట్రంలో కన్నడ మాట్లాడాలని, కన్నడిగులకు తొలి ప్రాధాన్యం ఇస్తామి చెబుతున్న ప్రభుత్వం నుంచి ఇలాంటి ఆదేశాలు రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ నిర్ణయంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తో్ంది.
UP Crime: అత్యాచారాలకు అడ్డుకట్ట పడటం లేదు. దేశంలో ప్రతీ రోజూ ఎక్కడో చోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. పోక్సో, నిర్భయ వంటి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ నిందితులకు భయం అనేదే లేకుండా పోయింది. ఇదిలా ఉంటే, ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోరం జరిగింది. స్కూల్ నుంచి ఇంటికి తిరిగివస్తున్న 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది.
Karnataka: ముడా భూ కుంభకోణం కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ముడా స్కామ్‌లో సిద్ధరామయ్యను విచారించేందుకు కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అనుమతి ఇచ్చారు. అయితే, దీనిని సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించిన సిద్ధరామయ్యకు బిగ్ షాక్ తగిలింది. ‘‘ ఈ కేసులో గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరించారని, వాస్తవాలు వెలుగులోకి తేవాలి’’ అని హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ నాగ ప్రసన్న అన్నారు. సిద్ధరామయ్య వేసిన పిటిషన్‌ని కొట్టేశారు.
Odisha custodial assault: ఒడిశాలో ఆర్మీ అధికారికి కాబోయే భార్యపై పోలీసులు కస్టడీలో దాడి చేయడం సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా పోలీసుల తీరు ప్రజల్లో ఆగ్రహానికి గురైంది. ఈ ఘటన చర్చనీయాంశం కావడంతో ఉన్నతాధికారులు స్పందించి, మహిళపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేసింది. అయితే, ఈ ఘటన ఆర్మీ వర్సెస్ పోలీస్‌గా మారింది. చాలా మంది వెటరన్ ఆర్మీ అధికారులు పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు వారిపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదిక […]
Tamil Nadu Governor: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే అక్కడి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వానికి గవర్నర్‌కి మధ్య విభేదాలు ఉన్నాయి. అయితే, తాజాగా ఆయన చేసిన ‘‘లౌకికవాదం(సెక్యులరిజం)’’ వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమైంది.