Bengaluru Woman Murder: ఫ్రిజ్‌లో తెగిన తల, కాళ్లు, చేతులు.. దుర్వాసనతో మహిళ దారుణహత్య వెలుగులోకి..
- సంచలనంగా మారిన బెంగళూర్ మహిళ మర్డర్..
- ఫ్రిజ్‌లో శరీర భాగాలను కట్ చేసి ఉంచిన నిందితుడు..
- 32 భాగాలుగా మహిళ మృతదేహం..
- దుర్వాసన రావడంతో వెలుగులోకి హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru Woman Murder: ఢిల్లీలో శ్రద్ధా వాకర్ తరహాలో బెంగళూర్‌లో మహాలక్ష్మి దాస్ (28) అనే మహిళని దారుణహత్య సంచలనంగా మారింది. ఈ హత్యతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగరంలోని వైయాలికావల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆమె శరీరాన్ని 32 ముక్కలుగా నరికి, ఆమె ఇంట్లోని ఫ్రిజ్ లోనే పెట్టారు. ఫ్రిజ్ కింది షెల్ఫ్‌లో ఆమె తెగిపడిన తల, పైన కాళ్లు, మధ్య భాగంలో మిగిలిన శరీర భాగాలు ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. హత్య జరిగి 4-5 రోజులు అయినట్లుగా తెలుస్తోంది. అప్పటి నుంచి ఇంటికి తాళం వేసి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. భర్తతో విడిపోయిన మహాలక్ష్మీ ఒంటరిగా అద్దె ఇంట్లో నివసిస్తోంది. స్థానికంగా ఉన్న ఓ మాల్‌లో పనిచేస్తున్న మహాలక్ష్మీని ఒక వ్యక్తి బైక్‌పై పికప్, డ్రాప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రస్తుతం అతడే ప్రధాన అనుమానితుడిగా ఉన్నాడు.
Read Also: Fake Notes: సినిమాలో చూసి.. దొంగ నోట్ల ముద్రణ.. చివరికి ఏమైదంటే?
Also Read
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
- Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
- Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
ఎలా తెలిసింది..?
ఇంటి నుంచి దుర్వాసన వస్తున్నక్రమంలో ఇరుగు పొరుగు వారు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మహాలక్ష్మీ తల్లి, సోదరిని ఇంటి యజమాని పిలిపించుకున్నాడు. ముగ్గురూ కలిసి తలుపులు బద్ధలుకొట్టి చూశారు. ఫ్రిజ్ నుంచి కారుతున్న రక్తాన్ని చూసిన ముగ్గురూ…ఫ్రిజ్ ఓపెన్ చేసి చూడగా అందులో మహాలక్ష్మీ మృతదేహం ముక్కలు ముక్కలుగా చేసి కనిపించడంతో వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. బాధితురాలి తల్లి, సోదరి సంఘటనా స్థలంలోనే అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు.
ఎఫ్ఐఆర్ ప్రకారం మహాలక్ష్మీ కుటుంబం నేపాల్ ఖాట్మాండులోని టికాపూర్ గ్రామానికి చెందినది. 35 ఏళ్ల నుంచి బెంగళూర్‌లోని నేలమంగళలో నివసిస్తున్నారు. మహాలక్ష్మీ తల్లిదండ్రులకు నలుగురు సంతానం. మొదటి కూతురు లక్ష్మీ, సయ్యద్ ఇమ్రాన్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుని, షాహిదా బుష్రాగా మారింది. మృతురాలు మహాలక్ష్మీ రెండో కూతురు . ఈమెకు హేమంత్ దాస్‌తో వివాహం జరిగింది. వీరిద్దరికి విభేదాలు రావడంతో నాలుగేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. మూడో కుమారుడు ఉక్కమ్ సింగ్ జొమాటోలో పనిచేస్తున్నాడు. నాలుగో వ్యక్తి నరేష్ తమతోనే ఉంటున్నట్లు మృతురాలి తల్లిదండ్రులు పేర్కొన్నారు. తన కుమార్తె చివరిసారిగా సెప్టెంబర్ 2న ఉదయం 9 గంటలకు ఫోన్ చేసినట్లు ఆమె తల్లి చెప్పారు. సెప్టెంబర్ 12న ఆమె మొబైల్ స్విచ్ ఆఫ్‌లో ఉన్నట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Varanasi Movie Update: 30 నిమిషాల వార్ సీన్.. అంటార్కిటికా నుంచి రోమ్ వరకు.. రాజమౌళి ప్లాన్ ఇదేనా?
-
Success Story: రూ.150తో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు రూ.10 లక్షల టర్నోవర్.. గృహిణి అద్భుత విజయం..!
-
Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే “మినప జంతికలు” చేసేయండి ఇలా..!
-
Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
-
Joshna Chinappa History: ఏడు ఏషియన్ గేమ్స్.. ఆరు పతకాలు.. 40 ఏళ్ల వయసులోనూ జోష్నా జోరు!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!