Bengaluru chilling murder: ఫ్రిజ్‌లో, సూట్‌కేసులో 50 ముక్కలుగా మహాలక్ష్మీ శరీరం.. అష్రాఫ్‌పై భర్త అనుమానం..
- బెంగళూర్ మహిళ హత్య కేసులో సంచలన విషయాలు..
- ఫ్రిజ్‌తో పాటు సూట్‌కేసులో మహాలక్ష్మీ శరీర భాగాలు..
- లవర్ అష్రాఫ్‌పై భర్త అనుమానం..
- గత కొన్నేళ్లుగా లవర్‌తో అక్రమ సంబంధం..
- భర్త హేమంత్ దాస్ సంచలన ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru chilling murder: శ్రద్ధావాకర్ తరహాలోనే బెంగళూర్‌లో మహాలక్ష్మీ అనే 29 ఏళ్ల యువతి దారుణ హత్య జరిగింది. ఈ హత్య స్థానికంగా సంచలనంగా మారింది. మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టిన వైనం ఒళ్లు గగుర్పాటు గురయ్యేలా ఉంది. తాజాగా ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిని గుర్తించామని నగర పోలీస్ కమిషనర్ బి దయానంద్ సోమవారం తెలిపారు. అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. అయితే, నిందితుడికి సాయం పడేలా ప్రస్తుతానికి తాము ఏ వివరాలను బహిర్గతంగా వెల్లడించలేమని చెప్పారు. నిందితుడు వేరే రాష్ట్రానికి చెందిన వాడని పోలీసులు గుర్తించారు.
అయితే, ఈ హత్య కేసులో దారుణమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫ్రిజ్‌తో పాటు మహాలక్ష్మీ నివాసం ఉంటున్న ఇంటిలో ఫ్రిజ్ పక్కనే బ్లూ కలర్ సూటికేస్‌లో మరిన్ని శరీరభాగాలు దొరికనట్లు తెలుస్తోంది. నిందితుడు మృతదేహాన్ని తరలించే ఉద్దేశంలో ఉన్నాడా..? లేక వేరే ప్రాంతం నుంచి తీసుకువచ్చాడా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం పూర్తయిందని, నివేదిక కోసం వేచి చూస్తున్నట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి.
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
Read Also: MUDA land scam case: భూ కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు హైకోర్ట్ బిగ్ షాక్..
ఈ కేసులో మహాలక్ష్మీ భర్త హేమంత్ దాస్‌ని పోలీసులు విచారించారు. అయితే, ఆయన ఈ హత్యలో మహాలక్ష్మీ లవర్ పాత్ర ఉంటుందని అనుమానించాడు. తన భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని చెప్పాడు. ఆమె ప్రేమికుడు ఈ హత్యలో పాల్గొని ఉండొచ్చని పేర్కొన్నాడు. హత్య వెనక ఉత్తరాఖండ్‌కి చెందిన అష్రాఫ్ హస్తం ఉండొచ్చని, కొద్ది నెలల క్రితం బెంగళూర్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో అతడిపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఫిర్యాదు తర్వాత అతను బెంగళూర్ రాకూడదని ఆదేశించారని, అయితే, అతను ఎక్కడి వెళ్లిన విషయం తనకు తెలియదని అన్నాడు.
హేమంత్ దాస్‌కి మహాలక్ష్మికి 6 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. అయితే, కుటుంబ కలహాలతో తొమ్మిది నెలలుగా వీరిద్దరు విడిగా ఉంటున్నారు. “అష్రాఫ్ ఉత్తరాఖండ్ నుండి వచ్చాడు. వివాహేతర సంబంధం గురించి తెలియడంతో మేము ఫిర్యాదు చేసాము. ఇది అనుమానం కాదు, నాకు తెలుసు. అష్రఫ్ బార్బర్ షాప్‌లో పనిచేస్తున్నాడు. నాకు 2023 ఏప్రిల్ లేదా మేలో ఈ వ్యవహారం తెలిసింది. అష్రఫ్ గురించి మహాలక్ష్మి నాకు ఏమీ తెలియచేయలేదు, నేను ఆమెతో టచ్‌లో లేను…,” అని చెప్పాడు.
సెప్టెంబరు 22న బెంగళూరులోని వయాలికావల్ ప్రాంతంలోని ఒక గది ఫ్లాట్‌లో మహాలక్ష్మి (29) మృతదేహాన్ని కర్ణాటక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గది నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇంటి యజమాని మహాలక్ష్మీ తల్లికి, సోదరికి సమాచారం అందించారు. ముగ్గురు కలిసి డోర్ పగలగొట్టి చూడగా ఆమె తెగిపడిన మృతదేహాన్ని చూశారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న వారందర్ని పట్టుకుంటామని హోంమంత్రి పరమేశ్వర సోమవారం విలేకరులతో అన్నారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..