Waqf Board: మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో రైతులకు సంబంధించిన 300 ఎకరాల భూమిని ‘‘వక్ఫ్ బోర్డ్’’ క్లెయిమ్ చేయడంపై వివాదం ప్రారంభమైంది. అయితే, అక్కడి రైతులు మాత్రం ఈ భూములు తమకు తరతరాలుగా సంక్రమించాయని చెబుతున్నారు. ఇటీవల ఈ భూములు తమవే అంటూ వక్ఫ్ బోర్డు రైతులకు నోటీసులు పంపింది. 103 రైతులు నోటీసులు అందుకున్నవారిలో ఉన్నారు.
Black magic: ఘజియాబాద్‌లో అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది. యూట్యూబ్‌లో క్షుద్రవిద్యలు నేర్చుకుని, ఓ వ్యక్తి తల నరికి బలి ఇచ్చిన ఘటన జరిగింది. బాధితుడి పుర్రెని ఉపయోగించి, పూజలు నిర్వహించి ధనవంతులు కావాలనుకున్న నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి పుర్రె, ఆయుధాలు, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Monkeys Fighting: కోతులు కొట్లాట ఏకంగా రైళ్ల రాకపోకలని నిలిపేశాయి. ఈ ఘటన బీహార్‌లోని సమస్తిపూర్ రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. రెండు కోతులు మధ్య గొడవ జరగడంతో దాదాపుగా గంటపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
Sambhal Violence: ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ పట్టణంలో ఇటీవల పెద్ద ఎత్తున హింస చోటుచేసుకుంది. సంభాల్‌లోని షాహీ జామా మసీదు సర్వేకి వచ్చిన అధికారులపై వేల సంఖ్యలో గుంపు రాళ్లదాడి చేసింది, కొందరు గన్ ఫైర్ చేశారు. స్థానికంగా ఉన్న ఇళ్లను ధ్వంసం చేసి, వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘర్షణల్లో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
Aaditya Thackeray: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి(ఎంవీఏ)లో విభేదాలకు కారణమవుతోంది. ఇటీవల శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన నేత, ఠాక్రేకి సన్నిహితుడు మిలింద్ నార్వేకర్.. బాబ్రీ మసీదు కూల్చివేత గురించి ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
Bashar al-Assad: సిరియాలో గత 15 ఏళ్లుగా కొనసాగుతున్న అంతర్యుద్ధానికి తెరపడింది. ఇస్లామిక్ గ్రూప్ హయతర్ తహ్రీర్ అల్-షామ్ నేతృత్వంలోని రెబల్స్ రాజధాని డమాస్కస్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే కీలక నగరాలైన అలెప్పో, హోమ్ వంటి నగరాలను, పట్టణాలను కైవసం చేసుకున్నారు. ఇదిలా ఉంటే, రెబల్స్ ధాటికి తట్టుకోలేక రష్యన్, సిరియన్ బలగాలు పారిపోతున్నాయి.
Sharad Pawar: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ‘‘మహాయుతి’’ కూటమి గెలవడంపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహాయుతి గెలవడంపై మహారాష్ట్ర ప్రజల్లో ఉత్సాహం లేదని, ఆనందం కనిపించడం లేదని శరద్ పవార్ శనివారం అన్నారు. కొల్హాపూర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రతిపక్షాలు ఆందోళన చెందాల్సిన పని లేదని, ఎదురుదెబ్బ తగిలిన తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని అన్నారు. Read Also: S Jaishankar: “బ్రిక్స్ కరెన్సీ ప్రతిపాదన లేదు”.. ట్రంప్ వార్నింగ్ తర్వాత జైశంకర్ […]
అమెరికన్ డాలర్‌కి పోటీగా కొత్త కరెన్సీని ఏర్పాటు చేయాలనే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఖతార్ పర్యటనలో ఉన్న ఆయన నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఇటీవల రష్యా వేదిక జరిగిన బ్రిక్స్ సమావేశం తర్వాత ‘‘బ్రిక్స్ కరెన్సీ’’ ఏర్పాటు చేస్తారనే వార్తలు వచ్చాయి. వర్థమాన ఆర్థిక వ్యవస్థలైన చైనా, భారత్, రష్యా వంటి బ్రిక్స్ కూటమి దేశాలు ఈ కరెన్సీపై కసరత్తు చేస్తున్నాయనే వార్తలు వచ్చిన నేపథ్యంలో అమెరికాకు కాబోయే అధ్యక్షుడు […]
Bangladesh: బంగ్లాదేశ్ రోజురోజుకు భారత్‌తో వైరం పెట్టుకోవాలని తహతహలాడుతోంది. అందుకు ఆ దేశం తీసుకుంటున్న నిర్ణయాలే కారణం. ఇప్పటికే బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులపై అకృత్యాలు కొనసాగిస్తూ, భారత్‌ని కవ్వించే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్ తన సరిహద్దుల్లో బైరెక్టర్ డ్రోన్లను మోహరించింది.
INDIA Alliance: 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఒకింత బీజేపీని అడ్డుకోగలిగింది . కానీ, అధికారంలోకి రాకుండా ఆపలేకుండా పోయింది. కూటమిగా బీజేపీ వ్యతిరేక పక్షాలు కాస్త సక్సెస్ అయినట్లే కనిపించింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత ప్రతిపక్ష హోదా దక్కించుకోవడం ఊరటనిచ్చే అంశం. కాంగ్రెస్ గత వైభవాన్ని దక్కించుకుంటుందని అంతా రాజకీయ విశ్లేషకులు, మీడియా కథనాలు అంచనా వేశాయి. తీరా.. షరా మమూలే అన్న రీతిలో కాంగ్రెస్ పరాజయాలు […]