Masood Azhar: నిషేధిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్ చీఫ్, 2001 భారత పార్లమెంట్ దాడి సూత్రధారి మసూద్ అజార్ దాయాది దేశం పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఇటీవల పాకిస్తాన్ బహవాల్ పూర్లో ఒక ఇస్లామిక్ సెమినరీలో అజార్ ప్రసంగించిన వీడియోలు వైరల్గా మారాయి. దీంట్లో అతను భారతదేశంపై దాడులు కొనసాగిస్తామని చెప్పడం, ప్రధాని నరేంద్రమోడీపై అవమానకరమైన పదాలను ఉపయోగించడం కనిపించింది. దీంతో పాకిస్తాన్ తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
Deep State: భారతదేశంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ‘‘యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్’’ పనిచేస్తుందని బీజేపీ ఆరోపించింది. అమెరికా ‘డీప్ స్టేట్’ ప్రధాని నరేంద్రమోడీని లక్ష్యం చేసుకుంటుందని పేర్కొంది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కుట్ర వెనక అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఉందని అన్నారు.
Mayawati: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడనే ఆరోపణలతో పార్టీ నేతని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) చీఫ్ మాయావతి సస్పెండ్ చేసింది. అయితే, అతను చేసిన తప్పు ఏంటంటే, సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) నేత కుమార్తెతో తన కొడుకు వివాహం జరిపించడమే. ఎస్పీ ఎమ్మెల్యే తిభువన్ దత్ కుమార్తెతో కొడుకు పెళ్లి చేసినందుకు సురేంద్ర సాగర్ని బీఎస్పీ నుంచి బహిష్కరించారు. ఇతడితో పాటు రాంపూర్ జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు ప్రమోద్ సాగర్ని తొలగించారు.
Jairam Ramesh: కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించిన రాజ్యసభ సీటు వద్ద నుంచి రూ. 50,000 దొరకడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై సభ చైర్మన్ జగదీప్ ధంఖర్ విచారణకు ఆదేశించారు. అయితే, ఈ వివాదంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ శుక్రవారం స్పందించారు.
West Bengal: 9 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య చేసిన 19 ఏళ్ల నిందితుడికి పశ్చిమ బెంగాల్ కోర్టు శుక్రవారం మరణశిక్ష విధించింది. నేరం జరిగిన 61 రోజుల తర్వాత నేరారోపణ రుజువు కావడంతో అతడికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని జైనగర్లో అక్టోబర్ 04న 9 ఏళ్ల బాలిక ట్యూషన్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో ముస్తాకిన్ సర్దార్ అనే వ్యక్తి ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశాడు. అదే […]
Rahul Gandhi: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై దూషిస్తూ వ్యాఖ్యలు చేసినందుకు ఇద్దరు బీజేపీ ఎంపీలపై కాంగ్రెస్ శుక్రవారం ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టింది. బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, సంబిత్ పాత్రలపై సభాహక్కుల తీర్మానాన్ని తీసుకువచ్చారు. పార్లమెంట్ నడపకుండా చేసే కుట్రలో ఇదొక భాగమని, వారు అదానీ ఇష్యూకి భయపడి దాని నుంచి పారిపోతున్నారని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అన్నారు. ప్రతిపక్షాలను అణిచివేసేందుకు కేంద్ర ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది.
Nobel Prize: బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేత, నోబెల్ అవార్డు గ్రహీత మహ్మద్ యూనస్కి ఇచ్చిన అవార్డుని సమీక్షించాలని కోరుతూ.. బెంగాల్ బీజేపీ ఎంపీ జ్యోతిర్మయ్ సింగ్ మహతో శుక్రవారం నార్వేజియన్ నోబెల్ కమిటీకి లేఖ రాశారు. ఆయన హయాంలో బంగ్లాదేశ్ హిందువుల, ఇతర మైనారిటీలపై జరుగుతున్న తీవ్ర అఘాయిత్యాలు, అకృత్యాలను పరిష్కరించాలని మహతో తన లేఖలో నోబెల్ కమిటీని కోరారు.
డిసెంబర్ 03 రాత్రి మంగ్లార్గావ్, మోనిగావ్ ఈస్ట్ గునిగ్రామ్లలో హిందూ సమాజానికి చెందిన వారిపై గుంపు దాడికి పాల్పడింది. 100 కన్నా ఎక్కువ ఇళ్లు, వ్యాపారాలపై దాడి చేశారు. షాపుల్ని లూటీ చేశారు. ఒక ఆలయాన్ని కూడా ధ్వంసం చేశారు. మొత్తం 1.5 మిలియన్ టాకా( రూ. 10లక్షల)కు పైగా నష్టం వాటిల్లినట్లు కౌన్సిల్ వెల్లడించింది.
Devendra Fadnavis: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని శివసేన ఠాక్రే, ఎన్సీపీ శరద్ పవార్ కూటమి ‘‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)’’ దారుణంగా ఓడిపోయింది. 288 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ కూటమి కేవలం 46 స్థానాలు మాత్రమే గెలిచింది. మరోవైపు బీజేపీ కూటమి మహాయుతి ఏకంగా 233 స్థానాలను కైవసం చేసుకుని మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది.