Bashar al-Assad: సిరియాలో గత 15 ఏళ్లుగా కొనసాగుతున్న అంతర్యుద్ధానికి తెరపడింది. ఇస్లామిక్ గ్రూప్ హయతర్ తహ్రీర్ అల్-షామ్ నేతృత్వంలోని రెబల్స్ రాజధాని డమాస్కస్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే కీలక నగరాలైన అలెప్పో, హోమ్ వంటి నగరాలను, పట్టణాలను కైవసం చేసుకున్నారు. ఇదిలా ఉంటే, రెబల్స్ ధాటికి తట్టుకోలేక రష్యన్, సిరియన్ బలగాలు పారిపోతున్నాయి. దీంతో 24 ఏళ్ల బషర్ అల్ అసద్ పాలనకు తెరపడింది. బషర్ భార్య, పిల్లల్ని ఇప్పటికే రష్యాకు వెళ్లినట్లు సమాచారం. అయితే, ఆయన కూడా దేశం నుంచి పారిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే, మరో విషయం వెలుగులోకి వచ్చింది. బషర్ అల్ అసద్ ప్రయాణిస్తున్న విమానం కూలిపోయిన మరణించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన తప్పించుకునేందుకు ఉపయోగించిన విమానం డమాస్కస్ నుంచి వెళ్లే సమయంలో కూలిపోయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆన్‌లైన్ ట్రాకర్ Flightradar24.com నుండి ఓపెన్ సోర్స్ డేటా ప్రకారం.. తిరుగుబాటుదారులు రాజధాని డమాస్కస్‌పై పట్టు సాధించిన తర్వాత ఎయిర్‌పోర్టు నుంచి సిరియన్ ఎయిర్ విమానం బయలుదేరినట్లు చూపించింది. ఇల్యుషిన్ 2-76టీ విమానం మొదట్లో సిరియా తీర ప్రాంతంలోకి వెళ్లింది.
Read Also: IND vs BAN: ఆసియా కప్ ఫైనల్.. టీమిండియా లక్ష్యం 199
అయితే, అకాస్మత్తుగా మార్గాన్ని మార్చుకుంది. హోమ్స్ నగరం సమీపంలోని రాడార్ నుంచి అదృశ్యమయ్యే ముందు కొన్ని నిమిషాల పాలు వ్యతిరేక దిశలో పయణించింది. ఫ్లైట్ మిస్సయ్యే ముందు 3,650 మీటర్ల నుండి 1,070 మీటర్లకు పడిపోయింది. తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న హోమ్స్ నగరం నుంచి వెళ్తున్న సమయంలో విమానాన్ని లక్ష్యంగా దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. అయితే, దీనిపై స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ, విమాన మార్గంలో ఆకస్మిక మార్పు, సిగ్నల్ కోల్పోవడం, కూల్చివేయడం లేదా మెకానిక్ ఫెయిల్యూర్‌కి గురయ్యే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలకు దారి తీసింది.
విమానంలో పాత ట్రాన్స్‌పాండర్లు, జీపీఎస్ జామింగ్ కూడా డేటాలో వ్యత్యాసాన్ని చూపించే అవకాశం ఉందనే తెలుస్తోంది. విమానంలో ఉన్న వారి గుర్తింపు ద్రువీకరించనప్పటికీ, అసద్ మరణించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సిరయన్ వర్గాలు వెల్లడించాయి. బహుశా ట్రాన్స్‌పాండర్లను స్విచ్చాప్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈజిస్టు జర్నలిస్ట్ ఖలీద్ మహమూద్ ప్రకారం.. విమానాన్ని కూల్చేసి ఉండొచ్చని ఎక్స్‌లో ట్వీట్ చేశారు.