Delhi: బంగ్లాదేశ్ హిందువులపై అకృత్యాలు జరుగుతున్న నేపథ్యంలో హజ్రల్ నిజాముద్దీన్ దర్గా ప్రాంతంలోని మతపెద్దలు, నివాసితుల ప్రతినిధి బృందం శనివారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో భేటీ అయ్యారు. అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయులను గుర్తించి స్వదేశానికి పంపించేందుకు స్పెషల్ డ్రైవ్‌ని చేపట్టాలని కోరినట్లు రాజ్ భవన్ ఒక ప్రకటనలో తెలిపింది.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీని చంపేస్తామని ముంబై పోలీసులకు శనివారం బెదిరింపు మెసేజ్‌లు వచ్చినట్లు ఓ అధికారి తెలిపారు. అజ్మీర్‌కి చెందిన ఓ నెంబర్ నుంచి ఈ మెసేజ్ వచ్చినట్లు గుర్తించామని, నిందితుడిని పట్టుకునేందుకు అక్కడికి పోలీస్ టీంలను పంపామని అధికారి తెలిపారు.
Mahindra BE 6e: స్వదేశీ కార్ మేకర్ మహీంద్రా ఇటీవల తన ప్లాన్షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను మార్కెట్లోకి తీసుకువచ్చింది. మహీంద్రా BE 6E, XEC 9E కార్లను విడుదల చేసింది. అయితే, ఇప్పుడు BE 6E పేరు వివాదాస్పదంగా మారింది. కారు పేరులో ‘6E’ని వాడినందుకు, దేశంలో అతిపెద్ద ఎయిర్ లైన్ సంస్థ ఇండిగో కేసు పెట్టింది. దీనిని కారు పేరులో వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే, శనివారం మహీంద్రా.. మహీంద్రా BE 6e’ని ‘మహీంద్రా […]
Mayawati: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలపై బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి స్పందించారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితికి కాంగ్రెస్ కారణమని ఆరోపించారు. కాంగ్రెస్‌పై విరుచుకుపడిన ఆమె.. రాజ్యాంగ సభకు డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్‌ని ఎన్నుకున్నందుకు శిక్షగా, హిందూ మెజారిటీ ప్రాంతం అయినప్పటికీ కాంగ్రెస్ బెంగాల్‌ని పాకిస్తాన్‌కి ఇచ్చిందని ఆరోపించారు. ఆ తర్వాత ఈ ప్రాంతం బంగ్లాదేశ్‌లో భాగమైందని చెప్పారు.
Man Kills Mother: తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోవడంతో ఓ వ్యక్తి తన తల్లినే హత్య చేశారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. 22 ఏళ్ల యువకుడు తాను ఎంచుకున్న మహిళను పెళ్లి చేసుకోవడానికి తల్లి నిరాకరించింది. తన ఆస్తిపై వారసత్వాన్ని కోల్పోతావని తల్లి బెదిరించడంతో హత్య జరిగినట్లు తెలుస్తోంది. నిందితుడని అరెస్ట్ చేసిటనట్లు పోలీసులు శనివారం తెలిపారు. నిందితుడిని సావన్ అనే వ్యక్తిగా గుర్తించారు. మొదట్లో ఈ నేరాన్ని దోపిడిగా చిత్రీకరించే పనిచేశాడు.
Bangladesh: బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ దుస్సాహసానికి పాల్పడ్డారు. భారత సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చి, ఇక్కడి ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్(BGB) అక్రమంగా అస్సాంలోకి ప్రవేశించారు. అస్సాంలో బంగ్లాదేశ్ సరిహద్దులకు సమీపంలో హిందూ ఆలయ పునరుద్ధరణను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఆలయం బంగ్లాదేశ్‌లో ముస్లింలను కించపరుస్తుందని, అక్కడ హింస చెలరేగుతుందని చెప్పారు.
Varanasi: వారణాసిలోని ఉదయ్ ప్రతాప్ కాలేజీ క్యాంపస్‌లో మసీదు వివాదానికి ఆజ్యం పోసింది. మసీదును తొలగించాలని పెద్ద ఎత్తున విద్యార్థులు నిరసనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఉత్తర్ ప్రదేశ్ వక్ఫ్ బోర్డు యాజమాన్యం ఈ స్థలాన్ని క్లెయిమ్ చేసినట్లు నివేదికలు రావడంతో నిరసన ప్రదర్శన జరిగింది.
Samajwadi Party: బాబ్రీ మసీదు కూల్చివేతపై ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఈ వ్యాఖ్యలు మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి ‘‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో విభేదాలకు కారణమైంది. ఈ వ్యాఖ్యల కారణంగా కూటమిలోని ‘‘సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)’’ ఎంవీఏ కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది.
Vijay Diwas: భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు ఇటీవల కాలంలో క్షీణించాయి. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత, అక్కడి మహ్మద్ యూనస్ పాలనలో హిందువులపై దాడులు తీవ్రమవుతున్నాయి. ఇటీవల కాలంలో హిందువులు ఆస్తులు, వ్యాపారాలు, ఇళ్లు, గుడులపై మతోన్మాద మూక దాడులు చేస్తు్న్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య గతంలో ఉన్నట్లుగా సంబంధాలు లేవు.
Digital arrest: డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ దేశంలో ఎక్కువ జరుగుతున్నాయి. పోలీస్ అధికారులు, ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులగా ఫోజు కొడుతూ స్కామర్లు అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు.