ఢిల్లీలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయులపై కఠిన చర్యలు మొదలయ్యాయి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా దేశ రాజధానిలో అక్రమంగా చొరబడి బంగ్లాదేశీయులపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని ఆదేశించారు. ఈ మేరకు ఎల్జీ ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నగర పోలీస్ చీఫ్‌కి లేఖ రాశారు. రాబోయే 60 రోజుల్లో అక్రమ వలసదారుల్ని గుర్తించి నిర్ణీత కాల వ్యవధిలో వారిని బహిష్కరించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
Trinamool Congress: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. ముర్షిదాబాద్ జిల్లాలోని బెల్డంగాలో ‘‘బాబ్రీ మసీదు’’ని పునర్నిర్మించాలని భావిస్తున్నట్లు టీఎంసీ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ వివాదానికి తెరలేపారు. ఈ వ్యాఖ్యలపై బెంగాల్లో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ నుంచి తీవ్ర స్పందన వచ్చింది.
Indian Coast Guard: భారతీయ సముద్ర జలాల్లో అక్రమంగా చేపల వేట సాగిస్తున్న రెండు బంగ్లాదేశ్ ఫిషింగ్ బోట్లను ఇండియన్ కోస్ట్ గార్డ్(ఐసీజీ) డిసెంబర్ 09న సీజ్ చేసింది. అక్రమంగా చేపట వేట సాగిస్తున్న 78 మంది మత్స్యకారుల్ని అదుపులోకి తీసుకుంది. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ(ఐఎంబీఎల్) వెంబడి సాధారణ పెట్రోలింగ్ సమయంలో ఈ ఆపరేషన్ జరిగింది.
India: భారతదేశం నుంచి పారిపోయిన ప్రతీ మూడో వ్యక్తి అమెరికాలో ఆశ్రయం పొందుతున్నాడని, ఇది నేరస్థులకు, ఉగ్రవాదులకు ‘‘సురక్షిత స్వర్గధామం’’గా మారిందని హోం మంత్రిత్వ శాక మంగళవారం పార్లమెంట్‌కి తెలిపింది.
No-Trust Motion: రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంఖర్‌పై ప్రతిపక్ష పార్టీలు ‘అవిశ్వాస తీర్మానం’ తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యా యి. ఈ తీర్మానానికి మద్దతుగా 50 మంది ఎంపీలు సంతకం చేశారు. అయితే, ఈ తీర్మాణంపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ ఛైర్మన్ తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
US F-1 Visas: అమెరికాలో చదువుకోవాలనేది భారతీయ విద్యార్థుల కల. స్టూడెంట్స్ మాత్రమే కాదు వారి తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి అమెరికాలో చదువుకుంటున్నాడని గొప్పగా చెబుతూ మురిసిపోతుంటారు. అయితే, 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు భారతీయ విద్యార్థుల వీసాలు భారీగా తగ్గినట్లు యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. యూఎస్ F-1 వీసాలలో 38 శాతం తగ్గినట్లు చెప్పింది. అయినప్పటికీ, అమెరికా వెళ్లే విదేశీ విద్యార్థుల్లో భారతీయులే టాప్ ప్లేస్‌లో ఉన్నారు.
Bengaluru: భార్య వేధింపులతో విసిగిపోయిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూర్‌లో జరిగింది. 34 ఏళ్ల అతుల్ సుభాష్ అనే వ్యక్తి బెంగళూర్‌లో తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూర్ పోలీసులు సూసైడ్ నోట్‌ని కనుగొన్నారు. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా ఎక్స్‌లో ట్రెండ్ అవుతోంది. అతుల్‌కి న్యాయం చేయాలంటూ నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. బీహార్‌కి చెందిన అతుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. బెంగళూర్‌లోని మంజునాథ్ లేఅవుట్లో నివాసం ఉంటున్నారు. చనిపోయే ముందు రికార్డ్ చేసిన వీడియోని చూస్తే […]
Top 10 Google Searches: మరికొన్ని రోజుల్లో కొత్త ఏడాది రాబోతోంది. 2024 ముగింపు దశకు చేరుకుంది. ఎన్నో అంశాలు ఈ ఏడాదిలో చోటు చేసుకున్నాయి. ఎన్నికల ఏడాదిగా పేరు సంపాదించింది. అనేక ప్రముఖ విషయాలు చోటు ఈ ఏడాదిలో చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే, 2024లో భారతీయులు ఎక్కువగా సెర్చ్ చేసిన అంశాలను గూగుల్ వెల్లడించింది. రాజకీయాల నుంచి స్పోర్ట్స్ వరకు భారతీయులు వెతికిన టాప్-10 అంశాలను తెలిపింది.
Justice Shekhar Kumar Yadav: విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) కార్యక్రమంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ చేసిన ‘‘మెజారిటీ’’ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రతిపక్షాలు, పలు సంఘాలు సుప్రీంకోర్టుకు లేఖలు రాస్తున్నాయి. భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఈ ఫిర్యాదులను స్వీకరించారు. ఈ ప్రసంగంపై సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టుని మంగళవారం వివరణ కోరింది. ప్రసంగానికి సంబంధించిన వివరాలనున అందించాలని ఆదేశించింది.
Asaduddin Owaisi: అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాద్ ఉల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) రాబోయే ఢిల్లీ అసెంబ్లీలో మాజీ ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ని నిలబెట్టింది. 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితుడి ఉన్న హుస్సేన్ని ముస్తఫాబాద్ నియోజకవర్గం నుంచి తమ అభ్యర్థిగా ప్రకటించింది. కౌన్సిలర్‌గా ఉన్న తాహిర్ హుస్సేన్ని ఆప్ బహిష్కరించింది. ఇప్పుడు ఈ అభ్యర్థిత్వం వివాదాస్పదంగా మారింది.