Motorola Signature Launch: 5200 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా.. ప్రీమియం లుక్‌తో వచ్చేసిన మోటో సిగ్నేచర్!
- సిగ్నేచర్ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్
- ప్రీమియం లుక్‌తో వచ్చేసిన మోటో సిగ్నేచర్
- 5200 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘మోటోరొలా’ సిగ్నేచర్ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. మోటోరొలా సిగ్నేచర్ (Motorola Signature) స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. ఇటీవలే లాస్‌వేగాస్‌లో జరిగిన CES 2026లో లాంచ్ అయిన ఈ డివైస్.. డిజైన్, హార్డ్‌వేర్, కెమెరా ఫీచర్ల పరంగా హైఎండ్ యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత వేరియెంట్‌కు మెరుగైన హార్డ్‌వేర్ ఇవ్వడం ఇక్కడ విశేషం. మోటోరొలా సిగ్నేచర్ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లు, ఇతర డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
భారత్‌లో మోటోరొలా సిగ్నేచర్ 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.59,999గా కంపెనీ నిర్ణయించింది. 16జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ.64,999గా ఉండగా.. టాప్ ఎండ్ 16జీబీ+1టీబీ వేరియెంట్ ధర రూ.69,999గా ఉంది. ఈ ఫోన్ జనవరి 30 నుంచి భారత మార్కెట్‌లో అన్ని ప్రధాన ప్లాట్‌ఫాంలలో అందుబాటులోకి రానుంది. హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే.. రూ.5 వేలు డిస్కౌంట్ పొందొచ్చు. లేదా ఎక్స్‌ఛేంజ్ బోనస్ రూ.5 వేలు లభిస్తుంది.
Also Read
- Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు!
- Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
- Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
మోటరోలా సిగ్నేచర్‌లో 6.8 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇది 165Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. 6200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంది. స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 అందించారు. కేవలం 6.99mm మందం, 186 గ్రాముల బరువుతో స్లీక్ డిజైన్‌లో కనిపించే ఈ ఫోన్‌కు IP68 + IP69 రేటింగ్స్, అలాగే MIL-STD మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ ఉండటం విశేషం. ఇందులో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8 జన్ 5 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16తో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంది. గూగుల్ పిక్సెల్ ఫోన్ల తరహాలోనే 7 సంవత్సరాల సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని మోటరోలా తెలిపింది.
Also Read: Ustaad Bhagat Singh: ముందుకొచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్.. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్!
ఈ డివైస్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉంది. ఇందులో 50MP సోనీ మెయిన్ కెమెరా, 50MP శాంసంగ్ అల్ట్రావైడ్ లెన్స్, అలాగే 50MP 3x పెరిస్కోప్ టెలిఫోటో సోనీ లెన్స్ ఉన్నాయి. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ప్రియులను దృష్టిలో పెట్టుకుని కెమెరా విభాగంలో భారీ అప్‌గ్రేడ్ ఇచ్చారు. ఈ ఫోన్‌లో 5,200mAh బ్యాటరీ ఉంది. ఇది 90W ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్, 50W వైర్‌లెస్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. చార్జర్‌ను కూడా బాక్స్‌లోనే అందించడం వినియోగదారులకు అదనపు ప్లస్ పాయింట్. మొత్తంగా చూస్తే మోటరోలా సిగ్నేచర్ సిరీస్ ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. డిజైన్, డిస్‌ప్లే, కెమెరా, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అన్నింటిలోనూ హైఎండ్ యూజర్లకు బెస్ట్ ఆప్షన్. వినియోగదారులను ఆకట్టుకుంటుందో చూడాల్సి ఉంది.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!