Asaduddin Owaisi: అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాద్ ఉల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) రాబోయే ఢిల్లీ అసెంబ్లీలో మాజీ ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ని నిలబెట్టింది. 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితుడి ఉన్న హుస్సేన్ని ముస్తఫాబాద్ నియోజకవర్గం నుంచి తమ అభ్యర్థిగా ప్రకటించింది. కౌన్సిలర్‌గా ఉన్న తాహిర్ హుస్సేన్ని ఆప్ బహిష్కరించింది. ఇప్పుడు ఈ అభ్యర్థిత్వం వివాదాస్పదంగా మారింది.
Global Pandemic: కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందన్ని ప్రపంచ మానవాళి ఎప్పుడూ ఊహించని విధంగా 2019 నుంచి రెండేళ్ల పాటు ప్రపంచదేశాలు ‘‘లాక్డౌన్’’లోకి వెళ్లాయి. లక్షల మంది చనిపోయారు. కోట్లలో కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ తన రూపాన్ని మార్చుకుంటూ ఇప్పటికీ ప్రజలపై ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది.
Rahul Gandhi: లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీ పార్టీ అధికారంలోకి రాకుండా, ప్రధాని మోడీని గద్దె నుంచి దించాలని ప్రతిపక్షాలన్నీ కలిసి ‘‘ఇండియా కూటమి’’ని ఏర్పాటు చేశాయి. ఇదిలా ఉంటే, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత ఈ కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి.
Crime: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎక్స్ట్రా క్లాసుల పేరుతో అక్కాచెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగింది. నిందితుడైన కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నగరంలోని చోలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కోచింగ్ సెంటర్లో ఈ దారుణం జరిగింది.
Madhavi Latha: హిందూ గ్రూప్ నిర్వహిస్తున్న కార్యక్రమానికి కర్ణాటకలోని బీదర్ జిల్లా కలెక్టర్ అనుమతి నిరాకరించారు. బీజేపీకి చెందిన తెలంగాణ నేత మాధవి లతతో పాటు ముగ్గురు వ్యక్తులు కార్యక్రమంలో పాల్గొనకుండి నిషేధించారు. కలెక్టర్ నిర్ణయాన్ని హిందూ సంఘాలు విమర్శిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ గిరీష్ బడోలే ఆదేశాల మేరకు మాధవి లత సోమవారం వరకు బీదర్‌లోకి ప్రవేశించకుండా నిషేధాన్ని విధించారు.
Bangladesh: షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ ప్రభుత్వం పాకిస్తాన్‌కి చాలా దగ్గరైంది. 1971 విముక్తి ఉద్యమంలో లక్షలాది మంది బెంగాలీలను చంపిన ఉదంతాన్ని మరిచిపోయి, పాక్‌తో స్నేహం చేస్తోంది. నిజానికి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యానికి కారణమైన భారత్‌ని వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం ఆ దేశంలోని హిందూ మైనారిటీలపై మతోన్మాద మూకలు దాడులకు తెగబడుతున్నాయి. భారత్, అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న అభ్యర్థనను కూడా యూనస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పాక్-బంగ్లా చెట్టాపట్టాల్: బంగ్లాదేశ్‌లో […]
Sonia Gandhi: బీజేపీ అమెరికన్ డీప్ స్టేట్, జార్జ్ సోరోస్‌పై విరుచుకుపడుతోంది. గత కొన్నాళ్లుగా బీజేపీ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు అమెరికాలోని డీప్‌స్టేట్, దాని వెనక జార్జ్ సోరోస్ వంటి వ్యక్తులు కుట్రలు చేస్తు్న్నారని, ఈ కుట్రల వెనక అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అన్నారు.
Acharya Pramod Krishnam: కాంగ్రెస్ మాజీ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కి అంతిమ సంస్కారాలు నిర్వహించినట్లే, ఆయన ఇండియా కూటమికి ‘‘పిండప్రధానం’’ చేస్తారని కల్కిథామ్ పీఠాధీశ్వర్ ప్రమోద్ కృష్ణం విరుచుకుపడ్డారు.
Bashar al-Assad: తిరుగుబాటుతో సిరియా రెబల్స్ హస్తగతమైంది. ఇప్పటికే ఇస్లామిక్ గ్రూప్ హయరత్ తహ్రీర్ అల్ షామ్ నేతృత్వంలోని తిరుగుబాటుదారులు రాజధాని డమాస్కస్‌ని ఆక్రమించుకున్నారు. ఇప్పటికే కీలక నగరాలైన అలెప్పో, హోమ్స్ వారి ఆధీనంలోకి వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో 24 ఏళ్లుగా సిరియాను పాలిస్తున్న అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ పాలనకు తెరపడింది. 15 ఏళ్లుగా కొనసాగుతున్న అంతర్యుద్ధం ముగిసింది.
Canada: కెనడాలో మరో భారత సంతతి వ్యక్తి హత్య జరిగింది. శుక్రవారం ఎడ్మింటన్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న 20 ఏళ్ల భారత సంతతికి చెందిన వ్యక్తిని ఒక ముఠా కాల్చి చంపింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. భారతీయ సంతతికి చెందిన వ్యక్తిని హర్షన్‌దీప్ సింగ్‌గా గుర్తించారు.