Rakasa Glimpse: మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్.. మొదటిసారి తను సోలో హీరోగా వెండి తెరపైకి రాబోతున్న చిత్రం ‘రాకాస’. ఈ సినిమాకి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో జాతీయ స్థాయిలో నిర్మాతగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పిస్తు్న్నారు. ఏప్రిల్ 3న ఈ మూవీని విడుదల చేయబోతోన్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ‘రాకాస’ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.
READ ALSO: Jammu kashmir: పాక్ ఉగ్రవాది ఖతం.. భద్రతా బలగాలకు కీలక విజయం..
‘యుగయుగాలుగా ప్రతీ కథలో ఒక సమస్య.. ఆ సమస్యను ఛేదించడానికి ఓ వీరుడు పుడతాడు.. ఆ వీరుడు ఎవరో అని తెలిసేలోపే నిశ్శబ్దంగా పని ముగిస్తాడు.. ఈ కథలో ఆ వీరుడు నేనే’ అంటూ ఓ రేంజ్ లెవెల్ ఎలివేషన్ ఇస్తూ ఈ గ్లింప్స్ సాగింది. అయితే ఆ తరువాత ఒక్కసారిగా అది కామెడీ టర్న్ తీసుకోవడం ముగిసింది. ఈ గ్లింప్స్‌లో సంగీత్ శోభన్ తన కామెడీ టైమింగ్‌తో మెప్పించాడు. ఈ చిత్రానికి ప్రధాన బలం కామెడీ అని తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్ చెబుతోంది. కామెడీతో పాటుగా ఓ కొత్త పాయింట్‌ను, కొత్తదనాన్ని చూపించేలా మేకర్స్ ట్రై చేస్తు్న్నట్లు కనిపిస్తోంది. ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్ ఈ చిత్రంపై మరిన్ని అంచనాలను పెంచుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
READ ALSO: Strange Police Complaint: ‘సర్ నా చిలుక ఎగిరిపోయింది’..!