Bangladesh: పాకిస్తాన్ కోసం బంగ్లాదేశ్ కీలక నిర్ణయం.. భారత్‌కి సెక్యూరిటీ సమస్య..
- పాకిస్తాన్ కోసం బంగ్లాదేశ్ కీలక నిర్ణయం..
- వీసా రూల్స్ సవరించిన బంగ్లా..
- భారత్‌కి భద్రతాపరమైన సమస్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ రోజురోజుకు భారత్‌తో వైరం పెట్టుకోవాలని తహతహలాడుతోంది. అందుకు ఆ దేశం తీసుకుంటున్న నిర్ణయాలే కారణం. ఇప్పటికే బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులపై అకృత్యాలు కొనసాగిస్తూ, భారత్‌ని కవ్వించే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్ తన సరిహద్దుల్లో బైరెక్టర్ డ్రోన్లను మోహరించింది. బంగ్లాదేశ్ సరిహద్దును దాటి ఆ దేశ బోర్డర్ గార్డ్స్ అస్సాంలోకి చొరబడ్డారు. సరిహద్దుల్లో నిర్మితమవుతున్న ఆలయ నిర్మాణాన్ని ఆపేయాలంటూ, లేకుంటే కాల్పులు జరుపుతామంటూ హెచ్చరించారు. ఈ చర్యతో అంతర్జాతీయ చట్టాలను బంగ్లాదేశ్ సరిహద్దు దళం ఉల్లంఘించింది.
Read Also: Pushpa 2: రెండో రోజుకే 500 కోట్ల క్లబ్బులో పుష్ప.. అస్సలు తగ్గేదేలే!
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింతగా పెరుగుతున్నాయి. ఇప్పటికే బంగ్లాలో తమ జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మాన్‌ని కాదని మహ్మద్ అలీ జిన్నాను పొగుడుతున్నారు. తాజాగా రెండు దేశాల మధ్య బంధం మరింతగా పెరిగేందుకు బంగ్లాదేశ్, పాకిస్తాన్ పౌరులకు వీసా నిబంధనల్ని సడలించింది. పాకిస్తాన్ పౌరులుకు భద్రతా క్లియరెన్స్ పొందాల్సిన అవసరాన్ని తొలగించింది. 2019లో ఈ క్లియరెన్స్‌ని ప్రవేశపెట్టారు. డిసెంబర్ 2న బంగ్లా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సెక్యూరిటీ సర్వీసెస్ డివిజన్(ఎస్ఎస్‌డీ) కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి, పరిమితుల్ని తొలగించింది. ఈ పరిణామం రానున్న కాలంలో భారత్‌కి భద్రతా పరమైన సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది.
బంగ్లాదేశ్‌లోని పాకిస్తాన్ హైకమీషనర్ సయ్యద్ అహ్మద్ మరూఫ్ డిసెంబర్ 3న ఢాకాలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) నాయకురాలు ఖలీదా జియాతో సమావేశానికి ఒక రోజు ముందు ఈ నిర్ణయం వెలువడింది. గత నెలలో తొలిసారిగా కరాచీ నుంచి బంగ్లాదేశ్ చిట్టగాంగ్‌కి పాకిస్తాన్ నుంచి కార్గో నౌక వచ్చింది. ఇప్పుడు పాకిస్తానీలకు వీసా నిబంధనల్లో సడలింపుల్ని ఇచ్చింది. ఖలీదా జియా, మాజీ ప్రధాని షేక్ హసీనాలా కాకుండా పాకిస్తాన్‌తో సంబంధాలను కలిగి ఉండి. షేక్ హసీనా సమయంలో భారత్‌కి మంచి మిత్రురాలిగా ఉండేది. ఇప్పుడు బంగ్లాదేశ్ మొత్తం జమాతే ఇస్లామీ, బీఎన్‌పీలే పాలన సాగిస్తున్నారు. ఈ రెండు కూడా పాకిస్తాన్ అనుకూల పార్టీలుగా పేరు పొందాయి.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!