Monkeys Fighting: కోతులు మధ్య కొట్లాట ఏకంగా రైళ్ల రాకపోకలని నిలిపేసింది. ఈ ఘటన బీహార్‌లోని సమస్తిపూర్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. రెండు కోతులు మధ్య గొడవ జరగడంతో దాదాపుగా గంటపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఫ్లాట్‌ఫారమ్ నెంబర్ 4 సమీపంలో అరటిపండు కోసం రెండు కోతులు గొడవపడ్డాయి. వాటిలో ఒకటి రబ్బర్ లాంటి వస్తువును మరొకదానిపైకి విసిరింది. విసిరిన వస్తువు రైల్వే ఓవర్ హెడ్ వైర్‌కి తాకడంతో షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో తీగలు తెగి రైలు బోగీల పడటంతో రైళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Read Also: Home Minister Anitha: కాకినాడ పోర్ట్ వ్యవహారంలో అన్ని తెలుస్తున్నాయి.. హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
రైల్వే స్టేషన్‌లోని ఎలక్ట్రిక్ డిపార్ట్‌మెంట్ వైర్లకు మరమ్మతులు చేసింది. ప్లాట్‌ఫారమ్ 4పై ఉన్న బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ దాదాపుగా 15 నిమిషాలు ఆలస్యంగా ప్రయాణించింది. ఇతర రైళ్లు కూడా ఆలస్యం కావడంతో ప్రయాణికులు గంటకు పైగా వేచిచూడాల్సి వచ్చింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇటీవల కాలంలో సమస్తిపూర్ రైల్వేస్టేషన్‌లో కోతుల బెడద ఎక్కువ కావడంతో, అటవీ శాఖ అధికారులు వాటిని పట్టుకున్నారు.