Ranveer Allahbadia: యూట్యూబర్, పాడ్‌కాస్టర్ రణవీర్ అల్లాబాడియా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి. రోస్ట్ షోలో ఆయన చేసిన వ్యాఖ్యల్ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. పరిమితులు దాటి ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అల్లాబాడియాపై ఇద్దరు ముంబై న్యాయవాదులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Punjab: పంజాబ్ పాటియాలాలో నిర్వహించిన సోదాల్లో రాకెట్ మందుగుండు సామాగ్రి దొరికింది. పేలుడు పదార్థాలు దొరకడంతో ఒక్కసారిగా స్థానికుల్లో భయాందోళన వ్యక్తమైంది. అనుమానాస్పద పదార్థాల గురించి పోలీసులకు సమాచారం అందడంతో, పాటియాలాలోని రాజ్‌పురా రోడ్డులోని చెత్త కుప్పలో సోదాలు జరిపారు. దీంట్లో మందుగుండు సామాగ్రి దొరికినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. Read Also: CISF Recruitment 2025: 10th పాసైతే చాలు.. సీఐఎస్ఎఫ్లో భారీగా కానిస్టేబుల్ జాబ్స్.. నెలకు రూ. 69 వేల జీతం […]
Viral Video: ఇటీవల కాలంలో యువత గుండెపోటుతో హఠాత్తుగా మరణిస్తున్నారు. ముఖ్యంగా పెళ్లి వేడుకల్లో డ్యాన్సులు చేస్తూ కుప్పకూలిన సంఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా అలాంటి సంఘటనే మధ్యప్రదేశ్‌లోని విదిషలో జరిగింది. పెళ్లి వేడుకల్లో డ్యాన్సు చేస్తూ, 23 ఏళ్ల యువతి ఉన్నట్టుండి కుప్పకూలింది. స్టేజ్ పైనే పడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
INDIA bloc: ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ పరాజయం, కాంగ్రెస్ ఘోర పరాజయం ఇండియా కూటమి భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా చేశాయి. కూటమిలోని ఈ రెండు పార్టీలు ఎన్నికల్లో పొత్తు పెట్టుకోక పోవడంతోనే అధికారం కోల్పోయాయని మిత్రపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే, అనుమానాల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమిలో చీలికలు ఉన్నాయనే వాదనల్ని తోసిపుచ్చారు. ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయని, మళ్లీ లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు కలిసి వస్తాయని అన్నారు. Read Also: Asteroid: భూమికి […]
Asteroid: గ్రహశకలాలు భూమికి ఎప్పటికీ ప్రమాదకరంగానే ఉంటాయి. కొన్ని మిలియన్ ఏళ్ల క్రితం ఒక ఆస్టరాయిడ్ భూమిని ఢీ కొట్టడంతో డైనోసార్లు అంతరించి పోయాయి. నిజానికి ఈ గ్రహశకలాలే భూమి పైకి నీరు తీసుకువచ్చాయనే వాదన కూడా ఉంది. ఇదిలా ఉంటే, తాజాగా ఓ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2024 YR4 గ్రహశకలం 2032లో భూమికి అత్యంత దగ్గరగా వస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఈ గ్రహశకలం కక్ష్య గమనాన్ని నాసా అంచనా వేసింది.
Donald Trump: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడినట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే, ఈ విషయాన్ని రష్యా ధృవీకరించలేదు, అలాగని ఖండించలేదు. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించడం గురించి పుతిన్‌తో ఫోన్లో మాట్లాడినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ది న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, ఉక్రెయిన్‌లో సంఘర్షణను ముగించడం గురించి తాను పుతిన్‌తో మాట్లాడినట్లు డొనాల్డ్ ట్రంప్ చెప్పారని , “ప్రజలు చనిపోవడం ఆపాలనే” కోరికను పుతిన్ వ్యక్తి చేసినట్లు నివేదించింది. Read Also: Biren Singh: […]
IMEC: ఈ వారం ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోడీ భేటీ కానున్నారు. అయితే, వీరిద్దరి మధ్య ఇరు దేశాల సంబంధాలు, రక్షణ, ఇతర అంశాలు చర్చకు రాబోతున్నాయి. ముఖ్యంగా ‘‘ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEC)’’ ప్రాజెక్టు ఇరువురి మధ్య కీలకంగా మారబోతోంది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(BRI) కు ప్రత్యామ్నాయంగా IMEC ఉండబోతోంది. ఈ ప్రాజెక్టులో బిలియనీర్ అదానీ కీలకంగా ఉన్నారు.
Aligarh Muslim University: అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ) వార్తల్లో నిలిచింది. యూనివర్సిటీలోని సర్ షా సులైమాన్ హాల్లో ఆదివారం భోజనం కోసం ‘బీఫ్ బిర్యానీ’ వడ్డించాలని ఇచ్చిన నోటీసు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. ఈ నోటిసుని ఇద్దరు అధికారిక వ్యక్తులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ‘‘ఆదివారం లంచ్ మెనూ మార్చబడింది. డిమాండ్ మేరకు చికెన్ బిర్యానీ బదులుగా బీఫ్ బిర్యానీ వడ్డించబడుతుంది’’ అని నోటీసుల్లో ఉంది. Read Also: BJP MLA: “ముస్తఫాబాద్” […]
BJP MLA: ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారాన్ని చేపట్టబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గానూ 48 సీట్లలో బీజేపీ గెలిచింది. ఆప్ 22 స్థానాలకే పరిమితమైంది. గత పదేళ్ల ఆప్ అధికారానికి బీజేపీ బ్రేకులు వేసింది. ఇదిలా ఉంటే, తాజాగా ముస్తఫాబాద్ నుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే మోహన్ సింగ్ బిష్త్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ముస్తఫాబాద్ పేరుని ‘‘శివపురి’’ లేదా ‘‘శివ విహార్’’గా మారుస్తామని ప్రకటించారు.