Aligarh Muslim University: అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ) వార్తల్లో నిలిచింది. యూనివర్సిటీలోని సర్ షా సులైమాన్ హాల్‌లో ఆదివారం భోజనం కోసం ‘బీఫ్ బిర్యానీ’ వడ్డించాలని ఇచ్చిన నోటీసు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. ఈ నోటిసుని ఇద్దరు అధికారిక వ్యక్తులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ‘‘ఆదివారం లంచ్ మెనూ మార్చబడింది. డిమాండ్ మేరకు చికెన్ బిర్యానీ బదులుగా బీఫ్ బిర్యానీ వడ్డించబడుతుంది’’ అని నోటీసుల్లో ఉంది.
Read Also: BJP MLA: “ముస్తఫాబాద్” పేరుని “శివపురి”గా మారుస్తాం.. ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే..
దీనిపై వర్సిటీలో తీవ్ర వివాదం చెలరేగిన తర్వాత యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ‘టైపింగ్ తప్పిదం’ ఉందని చెప్పింది. ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. సర్ షా సులైమాన్ హాల్‌లోని విద్యార్థులు ఈ నోటీసును కనుగొన్న తర్వాత వివాదం చెలరేగింది. నోటీసులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మొదటి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఎలాంటి ప్రకటన చేయలేదు, పరిస్థితి తీవ్రం కావడంతో వివరణ ఇచ్చుకుంది. నోటీసులు జారీ చేసిన ఇద్దరు సీనియర్ విద్యార్థులకు షో కాజ్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పింది. ఈ సంఘటనపై బీజేపీ నాయకుడు, ఏఎంయూ మాజీ విద్యార్థి నిషిత్ వర్మ స్పందించారు. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ రాడికల్ అంశాలను ప్రోత్సహిస్తోందని విమర్శించారు.