Donald Trump: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడినట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే, ఈ విషయాన్ని రష్యా ధృవీకరించలేదు, అలాగని ఖండించలేదు. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించడం గురించి పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ది న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, ఉక్రెయిన్‌లో సంఘర్షణను ముగించడం గురించి తాను పుతిన్‌తో మాట్లాడినట్లు డొనాల్డ్ ట్రంప్ చెప్పారని , “ప్రజలు చనిపోవడం ఆపాలనే” కోరికను పుతిన్ వ్యక్తి చేసినట్లు నివేదించింది.
Read Also: Biren Singh: మణిపూర్ సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా..
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో చాలా సార్లు, తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఉక్రెయిన్-రష్యా యుద్ధాని ఆపేస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలని ఒత్తిడి తెస్తున్నారు.