Donald Trump: ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ వ్యతిరేక వ్యక్తిగా పేరున్న అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్ కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. భారతదేశాన్ని అస్థిరపరిచేసందుకు సోరోస్ కుట్ర పన్నినట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Mamta Kulkarni: బాలీవుడ్ ఒకప్పటి అందాల నటి మమతా కులకర్ణి ఇటీవల సన్యాసిగా మారి వార్తల్లో నిలిచారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో ఆమె సన్యాసిగా మారారు. అయితే, ఆమె తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. కిన్నార్ అఖాడా మహామండలేశ్వర్ పదవికి రాజీనామా చేస్తు్నట్లు అధికారికంగా ప్రకటించారు. సాధ్విగా తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిస్తానని చెప్పారు.
Anurag Thakur: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. దీనిని ఉద్దేశిస్తూ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ లోక్‌సభలో రాహుల్ గాంధీపై సెటైర్లు వేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ట్రాక్ రికార్డుని మరోసారి గుర్తు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఉన్న ఆదాయపు పన్నుపై అనురాగ్ ఠాకూర్ వివరణాత్మకంగా విశ్లేషించారు.
Delhi CM: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కాషాయ పార్టీ అధికారాన్ని చేపట్టబోతోంది. దశాబ్ధకాలంగా ఉన్న ఆప్ అధికారానికి తెరిదించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 48, ఆప్ 22 స్థానాల్లో విజయం సాధించాయి. కాంగ్రెస్ పార్టీ ఒక్క చోట కూడా సత్తా చాటలేకపోయింది. 67 స్థానాల్లో దారుణంగా డిపాజిట్ కోల్పోయింది.
Walayar case: 2017లో కేరళలో సంచలనంగా మారిన ‘‘వలయార్ కేసు’’లో సంచలన విషయాలు సీబీఐ విచారణలో వెలుగులోకి వచ్చాయి. సొంత తల్లి కూతుళ్లపై అత్యాచారం చేసేందుకు సహకరించిందని, నిందితుల్లో ఒకరితో ఆమెకు సంబంధం ఉందని, తల్లిదండ్రులే వారి పిల్లలపై పదే పదే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సీబీఐ అభియోగాలు మోపింది. తల్లి తన పిల్లల సమక్షంలోనే ప్రధాన నిందితుడితో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు ఛార్జిషీట్లో పేర్కొంది.
Ranveer Allahbadia: ప్రముఖ యూట్యూబర్, పాడ్‌కాస్టర్ రణవీర్ అల్లాబాడియా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించాయి. సాధారణ ప్రజలతో పాటు రాజకీయ నాయకులు కూడా ఇతను చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు న్యాయవాదులు ఇతడిపై ఫిర్యాదు చేశారు. మరోవైపు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక దేశాధినేత మహ్మద్ యూనస్ తనకు ఎదురు లేకుండా చేసుకుంటున్నారు. ముఖ్యంగా మాజీ ప్రధాని షేక్ హసీనా మద్దతుదారుల్ని దేశవ్యాప్తంగా వేటాడేందుకు ‘‘ఆపరేషన్ డెవిల్ హంట్’’ని ప్రారంభించాడు. దేశవ్యాప్తంగా అస్థిరత, ఆర్థిక కష్టాలు వెన్నాడుతున్న నేపథ్యంలో అక్కడి ప్రజల్లో అసహనం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో షేక్ హసీనా అవామీలీగ్ పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిస్తుందనే భయంతో వారిని అణిచివేసే ప్రయత్నంలో యూనస్ ఉన్నారు.
Shiv Sena-UBT: ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ పరాజయంతో పాటు కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంపై ఇండియా కూటమిలోని ఇతర నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గానూ బీజేపీ 48 స్థానాల్లో, ఆప్ 22 స్థానాల్లో గెలుపొందింది. వరసగా మూడోసారి కూడా కాంగ్రెస్ సున్నా స్థానాలకు పరిమితమైంది. 67 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. అత్యంత అవమానకర రీతిలో కాంగ్రెస్ ఓడిపోయింది.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ తన అమెరికా పర్యటనకు ముందు కీలక సందేశం ఇచ్చారు. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోడీ భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ..‘‘ నా మిత్రుడు డొనాల్డ్ ట్రంప్‌ని కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ట్రంప్ మొదటి పదవీకాలంలో నిర్మించబడిన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడాని పర్యటన సహకరిస్తుందని మోడీ అన్నారు. ప్రధాని మోడీ ముందుగా మూడు రోజుల పర్యటన […]
Ranveer Allahbadia: యూట్యూబర్, పాడ్‌కాస్టర్ రణవీర్ అల్లాబాడియా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి. రోస్ట్ షోలో ఆయన చేసిన వ్యాఖ్యల్ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. పరిమితులు దాటి ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అల్లాబాడియాపై ఇద్దరు ముంబై న్యాయవాదులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు.