Venu Goapl Reddy
Author- NTV Telugu-
Netanyahu: నెతన్యాహుకు అవమానం.. ఖాళీ కుర్చీలను చూస్తూనే ప్రసంగం..
Netanyahu: ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు చేదు అనుభవం ఎదురైంది. ఓ రకంగా చెప్పాలంటే అవమానం. శుక్రవారం ఆయన ప్రసంగించే సమయంలో చాలా దేశాల ప్రతినిధులు, రాయబారులు సామూహికంగా వాకౌట్ చేశారు. గాజాలో ఇజ్రాయిల్ చేపట్టిన సైనిక చర్యకు వ్యతిరేకంగా వారు నిరసన తెలిపారు. నెతన్యాహూ ప్రసంగం కొనసాగుతుంటేనే ఒక్కొక్కరుగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. -
USA: పాకిస్తాన్ చమురు నిల్వలపై మునీర్, షరీఫ్‌లకు ఎదురుదెబ్బ..
USA: పాకిస్తాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ తాకింది. పాకిస్తాన్లో చమురు నిల్వలు ఉన్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెలలో ప్రకటన చేశాడు. పాకిస్తాన్లో బిలియన్ల విలువైన నిల్వలు ఉన్నాయని చెప్పాడు. అయితే, ఇప్పుడు అమెరికా ఇంధన కార్యదర్శి క్రిస్ రైట్, ట్రంప్ వాదనలకు విరుద్ధంగా ప్రకటన చేశారు. పాకిస్తాన్లో చమురు నిల్వలను అన్వేషించడంలో అమెరికాకు ఆసక్తి లేనది చెప్పాడు. Read Also: RBI Digital Payment Rules: యూజర్స్ కు అలర్ట్.. డిజిటల్ చెల్లింపులపై ఆర్బీఐ […] -
Khalistani terrorist: “ఢిల్లీ ఖలిస్తాన్ అవుతుంది”.. అజిత్ దోవల్‌కు టెర్రరిస్టు బెదిరింపులు..
Khalistani terrorist: కెనడాలో ఉంటూ, ఖలిస్తాన్ అంటూ గొడవ చేసే ఉగ్రవాదులు భారత్‌ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్‌కు ఖలిస్తానీ ఉగ్రవాది ఇందర్ జీత్ గోసల్ బెదిరింపులు జారీ చేశారు. అరెస్ట్ అయిన కొద్ది రోజులకే కెనడాలో బెయిల్ పొందిన ఇందర్ జీత్ ‘‘ దోవల్, నేను మీ కోసం ఎదురు చూస్తున్నాను’’ అని వార్నింగ్ ఇచ్చాడు. -
ICC: హారిస్ రౌఫ్‌కు ఐసీసీ జరిమానా, ఫర్హాన్‌కు వార్నింగ్..!
ICC: ఆసియా కప్ టోర్నీలో భాగంగా సూపర్ ఫోన్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో పాక్ పేసర్ హారిస్ రౌఫ్ రెచ్చగొట్టేలా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్, 6 భారత ఫైటర్ జెట్లను కూల్చేసిందనే అర్థం వచ్చేలా హావభావాలను ప్రదర్శించాడు. దీనిపై BCCI అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కి ఫిర్యాదు చేసింది. -
UP: ‘‘ఐ లవ్ ముహమ్మద్’’ వివాదం.. యూపీలో అల్లర్లు..
UP: ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా ‘‘ఐ లవ్ ముహమ్మద్’’ పోస్టర్‌పై ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. శుక్రవారం ప్రార్థనల అనంతరం బరేలీలో నిరసనకారులు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. సెప్టెంబర్ 4న ‘ఐ లవ్ ముహమ్మద్’ పోస్టర్‌తో ఉన్న టెంట్‌ను పోలీసులు తొలగించిన తర్వాత కాన్పూర్‌లో ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై ఒక మతపెద్ద మెమోరాండం సమర్పించాలని ఇచ్చిన పిలుపుకు ప్రతిస్పందనగా శుక్రవారం ప్రార్థనల తర్వాత బరేలీలోని ఇస్లామియా మైదానం సమీపంలో భారీగా జనాలు గుమిగూడారు. -
Tej Pratap Yadav: ఆర్జేడీకి భారీ షాక్.. లాలూ కుమారుడి కొత్త పార్టీ..
Tej Pratap Yadav: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారీ రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీ చీఫ్ అయిన లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తన కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. లాలూ పెద్ద కుమారుడు, మాజీ మంత్రి అయిన తేజ్ ప్రతాప్ తన కొత్త పార్టీ ‘‘జనశక్తి జనతాదళ్’’ను ఆవిష్కరించారు. రానున్న బీహార్ ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. -
India Russia: ‘‘యుద్ధంపై మోడీ, పుతిన్ చర్చించారు..’’ నాటో చీఫ్ వ్యాఖ్యలను తిరస్కరించిన భారత్..
India Russia: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ, భారత్ పరోక్షంగా ఉక్రెయిన్ యుద్ధానికి సహకరిస్తుందనే ఆరోపణతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం సుంకాన్ని విధించాడు. అయితే, దీనిపై నాటో ఛీఫ్ మార్క్ రుట్టే సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ విధించిన సుంకాల దెబ్బ మోడీకి తగిలిందని, అందుకే మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేసి ఉక్రెయిన్ యుద్ధంపై మాట్లాడారని, యుద్ధ వ్యూహాలను అడిగారని అన్నారు. -
Pak PM: భారత్‌తో కాల్పుల విరమణకు ట్రంప్ సాయం: ప్రధాని షెహబాజ్ షరీఫ్..
Pak PM: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తానే కారణం అని, తానే మధ్యవర్తిత్వం చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకుంటున్నారు. అయితే, ఇప్పుడు అదే మాటను పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా చెప్పుకుంటున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న పాక్ ప్రధాని షరీఫ్, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్లు వైట్ హౌజ్‌లో ట్రంప్‌తో సమావేశమయ్యారు. -
Sonam Wangchuk: సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్.. లడఖ్ అల్లర్లపై కేంద్రం ఉక్కుపాదం..
Sonam Wangchuk: పర్యావరణ కార్యకర్త, లడఖ్ రాష్ట్ర హోదాకు డిమాండ్ చేస్తున్న సోనమ్ వాంగ్చుక్ను శుక్రవారం పోలీసుల అరెస్ట్ చేశారు. రాష్ట్ర హోదా కోరుతూ, రెండు రోజుల క్రితం లడఖ్ వ్యాప్తంగా భారీ నిరసనలు జరిగాయి. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో నలుగురు మరణించారు. -
Ravindra Kaushik: ‘‘బ్లాక్ టైగర్’’ రవీంద్ర కౌశిక్.. పాక్ ఆర్మీలో ఎలా చేరాడు, ఎలా పట్టుబడ్డాడు..?
Ravindra Kaushik: ఒక వ్యక్తి మొత్తం పాకిస్తాన్ ఆర్మీకి, ఆ దేశానికి భయం అంటే ఏంటో చూపించాడు. వారి ఆర్మీలోనే ఉంటూ, భారతదేశానికి పనిచేసిన గొప్ప వ్యక్తి, ‘‘బ్లాక్ టైగర్’’గా కొనియాడబడిన రవీంద్ర కౌశిక్ ధైర్యం, తెగువ చాలా మందికి ఆదర్శం. భారత గూఢచారిగా ఆయన చేసిన సేవలు ఇప్పటికీ, నిఘా ఏజెన్సీలకు గర్వకారణం. అయితే, ఎప్పటికైనా ఒక గూఢచారిని కలవరపెట్టే అంశం, తన ముసుగు తొలిగిపోవడం. రవీంద్ర కౌశిక్‌కు కూడా ఇలాంటి పరిస్థితే వచ్చింది. ఎవరు […]
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..